S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/10/2020 - 22:48

తన రుూ పతనానికి తానే బాధ్యుడైనప్పటికీ, తననీ కూపంలోకి పడేసిన ఆ నీచురాలి బాధ్యత కూడా లేకపోలేదు!
తనమీద తనకు కలిగిన అసహ్యాన్ని భరించలేకపోయాడతను. దాన్ని క్లియోపాత్రా పరంగా విడుదల చేయందే మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రయోజనమనేది రుూ స్థితిలో ఉండనప్పటికీ, కనీసం కడుపుమంటన్నా చల్లరుతుందనే భావంతో అతను మండిపడుతూ, క్లియోపాత్రా పట్టు డేరా వైపు పరుగెత్తాడు.

03/09/2020 - 22:36

దీనికి జవాబు చెప్పటం అనవసరం అన్నట్లుగా తల ఆడించి వూరుకున్నాడు ఏంటనీ.
‘‘అదంతా అలా ఉంచుదాం ఏంటనీ! ఈ యుద్ధం మానుకోవటం చాలా మంచిదని నా అభిప్రాయం. నిజానికి నీవు ఇందులో కల్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆక్టోవియన్ ఈ యుద్ధాన్ని క్లియోపాత్రా మీద ప్రకటించాడు కాని, నీ మీద కాదు కదా?’’

03/08/2020 - 23:27

వారి దృష్టిలో ఏంటనీ భోగలాలసతో మూర్ఖుడై, పతనమైపోతున్నాడు. తీరా యుద్ధం ఆరంభమైతే, రోమన్ సైనికులు తమ సోదరులైన రోమన్‌లతో పోరాడేందుకు నిరాకరిస్తే ఏం గతి?

03/07/2020 - 22:10

తనంటే ఏంటనీకి ప్రాణమనే సంగతి తానే కాకుండా ఈ ప్రపంచమంతా గ్రహించింది. తన పుత్రుడు సీజర్ టాలమీని, సీజర్‌కు వారసునిగా ఏంటనీ ఒప్పుకున్నాడు! చివరకు మరణానంతరం అస్థికల్ని, తన సమాధి పక్కనే పాతాలనే అంతిమంగా కోర్కెను అతను వెలిబుచ్చాడు. ఈ సమయంలో ఆమె ఏంటనీని ఎంత గాఢంగా ప్రేమించగలుగుతుందో అర్థమైపోయింది. ఈ ప్రపంచానికి ప్రళయమే ఆసన్నమవుగాక! తమ ప్రయాణం అమరం!

03/05/2020 - 23:02

ప్రజలు ఆశ్చర్యంతో ముక్కుమీద వేలేసుకున్నారు. ఏంటనీ బహిరంగంగా ఆక్టోవియాకు విడాకులివ్వటాన్ని ఎవ్వరూ సహించలేకపొయ్యారు. ఇదొక నైతిక పతనంగా అందరూ గుర్తించారు.
ఆక్టోవియన్ వీలునామాను సంగ్రహించటం నీచమైన పనే! ఐతే, అందులోని రహస్యాన్ని బైట పెట్టాక, అతి నీచమైన ఏంటనీ వాంఛల ముందు, ఆక్టోవియన్ నైచ్యం ఒక లెక్కలోకి రాలేదు. ఈ విధంగా అతను బైటపడ్డాడు.

03/04/2020 - 23:23

సమర రాక్షసి, శాంతిదేవత ధరించే దుస్తుల్ని వేసుకుంటుంది. అప్పుడు తనను ఈ యుద్ధాన్ని లేవదీసినందుకు శపించినవారే, తన సౌభాగ్యానికి గెలుచుకున్న సామ్రాజ్యానికి అచ్చెరువొంది తనను కొలుస్తారు. ఆ సుదినం కోసమే కదా, తాను వేయిదేవుళ్ళకు మొక్కుకొని ఈ దండయాత్రను స్వయంగా నడుపుతూన్నది!
ఇలాంటి పగటి కలలతో, ఆకాశ హర్మ్యాలతో ఆమె సుఖంగా ప్రయాణం చేసింది.

03/03/2020 - 22:57

‘‘తొందరపడవద్దు. మాతృదేశం మీద కత్తి దూయవద్దు’’
‘‘అందుకే అవసరమైతే అంటున్నాను. రాణీ! నీవు నన్ను ఎత్తిపొడవద్దు. ఎగతాళి చేయకు. అత్యున్నతాశయం కోసమే పవిత్రమైన సమరాన్ని జరిపి, శాంతి నెలకొల్పాలని నా ప్రయత్నం’’.

03/02/2020 - 23:11

లోగడ నీకు పెళ్లి కట్నంగా ఇచ్చిన సైన్యాలను, తన సైన్యాల్లో కలుపుకున్నాడు. దేశద్రోహి చేతికి చిక్కినపుడు ప్రభుత్వం అమలుపరిచే వొత్తిడులనన్నింటినీ అతను ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికీ నీలో వేడంటూ కనిపించినందువల్ల, ప్రజలు నిజంగా నీవు ప్రభుత్వానికేదో గొప్ప ద్రోహం చేశావని, ఆక్టోవియన్ పనుల్ని విమర్శించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

03/02/2020 - 00:10

తన రుూ సుఖ స్వప్నం చెడుతుందేమోననే భయంతో ఏంటనీ ఇదంతా ఏమిటని అడిగిన పాపాన పోలేదు.

02/29/2020 - 22:19

తననుగూర్చి తానే తెలుసుకోలేని అధోగతిలో ఉన్నపుడు, క్లియోపాత్రా తన స్థితిని తనకు అర్థం చేస్తోంది. అందుకనే తనమీద తాను జాలిపడుతున్నాడు!
‘‘ప్రభూ! మీరెంత మనోవేదనకు గురై ఉంటారో ఇపుడే తెలుసుకుంటున్నాను. తన పట్ల నేను ఎంత అపచారం చేశానో కూడా అర్థమైంది. మీ నీడలో బతకవలసినదాన్ని. నన్ను క్షమించండి.. మీ విశాల హృదయంలో నాకు తావు కల్పించండి. ఈ జన్మకు నేను కోరదగిన వరమంటూ మరేమీ ఉండదు’’.

Pages