S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/15/2019 - 18:41

లేడిపిల్లలాటి తాను సింహం గుహలోకి ప్రవేశించింది. ఆ సమయంలో సింహం ఆకలిగొని ఉండటం తన తప్పుకాదు. అసలు ఆ ఆకలి పుట్టించే బాధ్యత తనది! కాని అది ఆ సమయంలో ప్రకృతి సిద్ధంగానే దానికి ఏర్పడి ఉన్నది. ముందు ఆ ఆకలి తీరితేనే తప్ప అది చెప్పిన మాట చెవిన వేసుకొనే స్థితిలో లేదు. తన కన్న బలమైన జంతువుకు, సహజంగానే అత్యధికమైన ఆత్మశక్తీ, ధైర్యసాహసాలూ ఉంటవి. దీనికితోడు స్థానబలిమి కూడాను.

10/14/2019 - 19:59

తాను ద్వారపాలకునికి లొంగటం వేరు. ఈ వీరభద్రునికి లొంగటం వేరూనూ. ద్వారపాలుడు రాణి కోరిన ప్రియుడు కాదు. అందుకని ఆమెకు ఆ విషయంలో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇక ఈ వీరభద్రుడు ఆమె మానసచోరుడు. ఇలాంటివాణ్ణి తానే వశం చేసుకున్నానని రాణికి తెలిస్తే ఈర్ష్యపడి, తనమీద కారాలూ, మిరియాలూ నూరుతుందేమో? ఈ చిక్కును మరెలా విడదీయటం?

10/13/2019 - 22:16

నగ్నంగా వున్న తన వీపులో విజయుడైన అహంకారంతో పొంగి పొరలే తన పాపను చూసుకొని గర్వపడుతున్నట్లుందీ వీరభద్రుడు.
‘‘వీపుమీద వాతలు వేశానన్న ఈ కోమలి కూతలు, వట్టి కూతలేనని గ్రహించినా, నోళ్ళకు మూతలు వేసుకొని, మూతులు ముడుచుకున్నారేమయ్యా!’’ అని వీరభద్రుడు రక్షక భటుల్ని దబాయించాడు.

10/11/2019 - 19:52

తన మరణం అతని ఆనందాన్నిస్తుందని తాను తలచలేదు. కాని అనాలోచితంగా, అనుకోకుండానే గురిచూడని ఆయువుపట్టున ఆ దెబ్బ తగలవచ్చు.

10/10/2019 - 19:41

దబ్బుమని పేడకుప్పల్లే సరస్వతి కిందపడింది. పిరుదులు నొప్పి పుట్టినవి.
‘‘చిలిపితనానిక్కడా హద్దులుండాలి.. ఏమిటి అరుస్తావా?’’ అన్నాడు వీరభద్రుడు.
తను అరుస్తానంటే భయపడి తనను వదిలేశాడని సరస్వతి తేల్చుకున్నది. శతృవు తాలూకు బలహీనత తెలిసిపోయాక సమ్మెట పోటులను ఆ లొసుగుమీదనే ప్రయోగించటం వివేకం.
‘‘ఔను.. అరుస్తాను. దూరంగా ఉండు ముందు!’’ అన్నదామె రోషాయుక్తమైన నేత్రాలను ప్రదర్శిస్తూ.

10/09/2019 - 19:08

వీరభద్రుని చేతుల్లో చాతుర్యం తక్కువనే విషయం తెలిసిపోయిందామెకు. ఆడవాళ్ళ ముడులు, ఇష్టపడి స్ర్తిలు విప్పవలసిందేకాని, పురుషునివల్ల అయే పనికాదని త్వరలోనే అతను తెలుసుకొని, మరింత చిరాకుతో గమ్యాన్ని జేరలేక దిక్కుతోచని పక్షివలె ఆ ప్రదేశమంతా తచ్చాడుతూ, మరీ ముందుకు సాగలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు.
‘‘నన్నొక మాట చెప్పనివ్వండి’’ అన్నదామె మృదువుగా.

10/07/2019 - 19:55

అలాంటిదాన్ని తాను ప్రయోగించి, తనలోని లోతులను వీరభద్రుని గ్రహణశక్తికే వొదులుతే, అంతకన్నా పదునైన జిహ్వ ఎదురుసవాలుగా, తన లోతులను గమనించమంటూన్నది.
రాణి నాలుక కొనలోంచి వెలువడిన మాటలు ఆజ్ఞలై, నేర్పరి ఐన విలుకాడు వదలిన బాణమల్లే తనను విడుస్తే, తాను వచ్చి పడిన వేగాన్ని తేలిగ్గా నిరోధించగల ఈ మాటలు వీరభద్రుని నాలుక నుంచి వెలువడి ప్రతిఘటిస్తున్నవి!

10/06/2019 - 21:31

‘‘తెలుసు!’’ అన్నదామె రహస్యం మాట్లాడిన విధంగా.
‘‘సరే.. ఇప్పుడు చెప్పు.. తమరెవరూ? ఇటెందుకొచ్చారు?’’ అన్నాడు వీరభద్రుడు- ఆ ‘తమరు’ అనే పదం గౌరవ సూచకం కాదనీ, హేళనను సూచిస్తున్నదనీ అతని కంఠస్వరమే తెలియజెపుతున్నది.

10/04/2019 - 18:48

అసలు రేపు ఉదయం వెళ్ళేందుకే నిశ్చయించుకొని ఉంటావని మేమందరం అనుకున్నాం.. నా మాట విని.. రేపు ఉదయమే వెళ్ళవచ్చు!’’ అన్నాడామె దూరపు బంధువు.
‘‘వీలు లేదు. మీ ఆదరణకు కృతజ్ఞురాలిని. రాణి నాకోసం ఎదురుచూస్తూంటుంది. ఆలస్యమైనందుకే ఆమె ఆందోళన పడుతుంది. నేను వెళ్ళగలను. రాణివాసపు రమణిని- అందునా రాణి ప్రియసఖిని. ననె్నవరు అడ్డుపెడతారు? నాకేం భయం లేదు.. వెళ్ళక తప్పదు!’’
బంధువులు ఎదురాడలేకపోయారు.

10/03/2019 - 21:58

ఈ సింహం బక్క మృగాలపట్ల మృత్యుదేవతగా ఉంటే ముందు వెనుకలు చూడని వేటగాడు ఈ సింహం పట్ల యముడుగానే ఉంటున్నాడు. వేశ్యావాటికలోని రంగేళీ రాయుళ్ళ నుంచేగాక, వాళ్ళను వేటాడేందుకు నియమించబడిన రక్షక భటులనుంచి కూడా తనను తాను కాపాడుకోవాలి. వేటగాడికి అడవిలో జంతువులన్నీ లోకువే కదా!

Pages