డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిన్న యుద్ధానికే తాను విపరీతమైన పన్నులు వేసి, ప్రజల్ని పిండి, అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ప్రజల్ని ఇంకా పిండేందుకైనా వారి దగ్గర ఏమీ లేదని తెలుసు. అసలు ప్రాచ్య దేశాల యుద్ధమే మానుకోమనే ప్రజాభిప్రాయం తనకు అడ్డంకి కావచ్చు. ఈ సమస్య తేలుతే, తన ఏక ఛత్రాధిపత్యం తథ్యమైనట్టే!
దానిక్కూడా ఆక్టోవియన్ ఒక మార్గం ఆలోచించాడు. ఈ సైనికులు యుద్ధానికి తప్ప మరెందుకూ పనికిరాదు. కొన్నాళ్లపాటు వేతనాలు లేకపోయినా ఓర్చుకోగలరు. ప్రాచ్య దేశాలమీద పడితే, ఈ ప్రదేశాలను దోచుకొని, వీరందరికీ ధనం ముట్టజెప్పవచ్చు. నేను రోమ్ వైభవమంతా ప్రాచ్య దేశాల వైభవంలో ఒక భాగంగానే వున్నది కదా! కనుక, ఆ ఆశతో సైన్యాలను సాధ్యమైనంత త్వరలో తూర్పుకు నడిపిస్తే, వారు కూడా ఉత్సాహంగా పట్టపగలు దోపిడీకి ఎగిరి గంతేస్తారు.
మనసులో ఇలాంటి ఊహలతో ఆక్టోవియన్ ఊహాసౌధాలను నిర్మించాడు. అవసరాలనేవి వొత్తిడి చేసినట్లయితే, మానవుడు ఎంత పనన్నా చేయగల సమర్థుడౌతాడనే సత్యాన్ని తాను ప్రవేశపెట్టి నెగ్గగలడు.
ముందు రోమ్‌లో తన రుూ విజయానికి తగిన తిరణాలను సాగించి, రోమన్‌ల విశ్వాసాన్ని పొందటం ముఖ్యంయం. ఆక్టోవియన్ ఆ ప్రయత్నాలలో నిమగ్నుడయ్యాడు.
29
ప్రాణాలు రక్షించుకొని ఓడలో జేరినందుకు నిరపాయకరమైన ప్రదేశాల్లోనుంచి ప్రయాణం సాగుతున్నందుకూ ఏంటనీ ఆనందించాడు. ఏదెలా వున్నా తాను బ్రతికి బైటపడినందుకు తనను తాను అభినందించుకున్నాడు. యుద్ధ్భయం, ఆతృత, అలసట కాస్త తగ్గాయి.
అలసటనెరుగని మహాకాయులు, అతిబలాఢ్యులు అయిన బానిసలు తెడ్లు వేస్తున్నారు. ప్రశాంతంగా వున్న మధ్యధరా సముద్రాన్ని చీల్చుకుంటూ ఓడ వేగంగా సాగిపోతూన్నది. గాలి కూడా చాలా అనుకూలంగా వుండడంవల్ల ప్రయాణ వేగం హెచ్చింది.
క్లియోపాత్రా దృష్టి అంతా అలెగ్జాండ్రియామీదనే వున్నది. నిజానికి అనుకున్నదానికన్నా ఎక్కువ వేగంతోనే ఓడలు ప్రయాణిస్తున్నప్పటికీ, వేగాన్ని ఇంకా హెచ్చించాలని ఆమె ఆజ్ఞల్ని జారీచేసింది. తమ యజమానురాలిని తృప్తిపరచేందుకు బానిసలు తమ కండలను కరిగించే విధంగా తెడ్లు వేస్తున్నారు.
ఏంటనీ ఓడమీదికి జేరడంవరకూ ఆమె చూసింది. రణరంగం దూరమవ్వడం చూసింది. ఇక ప్రమాదం లేదని తెలుసుకున్నది. ఆ తరువాత ఆమె ఆలోచనలు సామ్రాజ్యాన్ని గురించి కానీ ఆక్టోవియన్ గురించి కానీ, చివరకు తన ఓడలోని వేరొక గదిలోవున్న ఏంటనీని గురించి కానీ సాగలేదు. ఈ భూమండలంలోకెల్లా తనకు ప్రియమైన సంతానం తప్ప వేరెవరకూ ఆమె తలపుల్లోకి రావడంలేదు. మనసు పరిగెత్తినట్లు, ఓడలు పరుగెత్తలేకపోతున్నందుకు ఆమె కించబడింది.
ఈ యుద్ధంలో ఓడిపోయినందుకు ఇపుడామె విచార పడడంలేదు. ఒకవేళ యుద్ధంలో గెలిచినపట్లయితే, ఏంటనీ ఎంత గొప్పవాడైపోయేవాడా, తనకూ ఏంటనీకి మధ్య ఎంత దూరం ఏర్పడేదో తలచుకొని ఈ ఓటమి కూడా ఒకవిధంగా తన మేలుకేనని సంతోషించింది. అయితే, ఈ గెలుపు తన శత్రువుది కాదు, తన పెద్దకొడుకు సీజర్ టాలమీ శత్రువుది కనుక- తనకూ, తన సీజర్‌కూ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. తామిద్దర్నీ హతమార్చేవరకూ ఆక్టోవియన్ నిద్రపోడని ఆమెకు తెలుసు. అయితే అది అంత త్వరగానూ, తేలిగ్గానూ జరగదు. తనకున్న వ్యవధిలో శత్రువు చేజిక్కకుండా తన అధీనంలో వున్న ప్రాచ్య దేశాలను, కనీసం ఈజిప్టును రోమన్‌ల బారినుంచి కాపాడుకోవాలి. ఇపుడిప్పుడే తనకు ఈజిప్టు మట్టిమీద మమత హెచ్చుతోంది. తన సంతానం, తన దేశం, తన ప్రజ అనే పదాలకు అర్థమంటూ ఏర్పడింది. వీటినుండి తన సుఖం, ఆనందం, జీవితమనేది చాలా అల్పమైనవిగా తోస్తూన్నవి. స్వార్థం క్షీణించి దాని స్థానే పరమార్థం హెచ్చుతోంది. ఈ ఆలోచనలకు ఇది సమయం కాదు. ముందు తన పిల్లల్ని చూడందే ప్రాణాలు నిలిచేటట్లు లేవు. ఇక ఏంటనీ మనసు మనసులో లేదు. ఇంతకుముందు ప్రాణాలను దక్కించుకున్నందుకు తనను తాను అభినందించుకుని ఆనందించాడు. కానీ ఆ ఆనందం క్షణభంగురంగా మారిపోయింది. యుద్ధరంగంలో తనకు సైనిక బలమంటూ ఉండగానే వారందరికీ ద్రోహం చేసి పారిపోయి వచ్చిన పిరికిపంద తాను. సైనికుల్లో కానీ, సేనానుల్లో కానీ ఎవరైనా తనకు ద్రోహం చేసినందుకు తానెంత కలత చెందాడో, ముందూ వెనుకలు ఆలోచించకుండా, అనుమానితుల్ని వధించాడో గుర్తొస్తున్నవి. అలాంటి ద్రోహమే తాను కూడా చేశాడు. అలాంటి శిక్షను తాను కూడా పొంది ఉండవలసింది. బహుశా ఆ శిక్షకు భయపడే తానిలా పరారవుతున్నాడేమో?
సేనల్ని, సేనానుల్ని, శత్రువుల ఖడ్గాలకు, విధికి వదిలేసి, కేవలం తానొక్కడు సుఖపడాలని, తన ఒక్కడిదే విలువైన ప్రాణమనే ధోరణిలో నీచాతినీచంగా ప్రవర్తించాడు.
ఇంతకుపూర్వం తనలోవున్న పౌరుషం, ఆత్మాభిమానం, వీరత్వం ఏమైనవి? రణరంగంలో ఓటమిని పొందడం వేరు, పారిపోయి రావడం వేరూనూ. తాను గెలవలేనట్లయితే, ప్రాణాలను అర్పించి, నిజమైన యోధుడని రుజువు చేసుకొని ఉండవలసింది. ఒక సామాన్యుడివలె ప్రవర్తించాడు. యుద్ధ్భూమిలో చచ్చి, వీరస్వర్గాన్ని పొంది ఉండవలసింది. కానీ ఆ వీరస్వర్గాన్ని మించిన ఆశ ఏదో తనను ఈ నీచానికి పాల్పడేట్టు చేసింది. ఆ ఆశ, ఆ జ్యోతి- క్లియోపాత్రా తప్ప వేరెవరూ కాదని ఇపుడు తెలిసి వస్తోంది.
ఇంతకుముందు క్లియోపాత్రా తెలివితేటల్ని అభినందించుకున్నాడు. ఆమె మినహా తనకు ఈ ప్రపంచంలో వేరెవరూ ఉండబోరనుకున్నాడు. ఆమె సుఖమే తన సుఖమనుకున్నాడు. తనకు మతిపోయింది. తాను పిచ్చివాడయ్యాడు. అది పిచ్చి కూడా కాదు- ఆమెకు లొంగిపోయాడు. మత్తు మందు చల్లినట్లు, కీలుబొమ్మవలె తలూపాడు. ఆమె ప్రతి అక్షరాన్ని అమలుజరిపాడు. తనకు ఆలోచనలంటూ లేవు. ఆమే అంతా ఆలోచించింది. అదే తనకు శిలాశాసనం అయింది. అందుకనే తన వ్యక్తిత్వం మచ్చుకైనా కనిపించకుండా పోయిది. ఇపుడిప్పుడే తాను తానుగా ఆలోచించగలుగుతున్నాడు.
తన బ్రతుకు కుక్కకన్నా హీనంగా తయారైంది. ఇలా పారిపోవడంకన్నా, యుద్ధంలో శత్రువు ఖడ్గానికి బలికావడం భయమైనట్లయితే, కనీసం ఆత్మహత్య చేసుకోనైనా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవలసింది. ‘్ఛ! అనిపించింది. తనమీద తనకు కలిగిన అసహ్యంతో తాను దహించుకొని పోతున్నాడు.
ఈ ఓటమి మహావీరుణ్ణితోనైనట్లయితే, అది వేరు సంగతి. నిన్నగాక మొన్న కళ్లుతెరిచిన వెధవ- ఆక్టోవియన్, పిరికిపంద, రణరంగమంటే చెమటలు పోసి, అంతఃపురాల్లో, అందమైన అమ్మాయిల పమిటల చాటున దాక్కునే తత్వమున్న ఆక్టోవియన్, భూమ్యాకాశాలంత పెరిగి పెద్ద కత్తిని కుడిచేతితో పైకెత్తి వికటాట్టహాసం చేస్తున్నాడు.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు