S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
వాడికి రాజకీయాలలో ప్రవేశాన్ని కలిగిస్తూ, ఎవరెవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, రాజరికాన్ని ఎలా ప్రదర్శించాలో ఆమె తెలియజెప్పసాగింది.
వాడిప్పుడిప్పుడు లోకాన్ని అర్థం చేసుకుంటున్నాడు. అమ్మ ఎప్పుడూ దిగులుగా ఎందుకుంటుందోనని ఆలోచిస్తున్నాడు. దేశదేశాలనుంచీ రాయబారులు వచ్చినపుడు తన తల్లి నిజంగానే మహారాణి అని ఆమెను చూస్తేనే అర్థవౌతుంది.
ఇదంతా క్లియోపాత్రాకు చెప్పి చారుడు అన్నాడు. ‘‘ఆయన అన్న మాటల అర్థం వేరు, ఆ కంఠస్వరం వేరూను. ఆ స్వరంలో నాకంత ఆశ కనిపించలేదు రాణీ!’’
యుద్ద సన్నాహాలు జరుగుతూన్న సమయంలో, పుల్వియా హఠాత్తుగా గుండెజబ్బుతో చనిపోయింది. వయసు 30 సంవత్సరాలే అయినా, మానసికంగా చాలా దిగజారిపోయిందని వైద్యులన్నారు.
అక్కడ గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో పాంపే చివరి వారసుడూ, కొడుకూ అయిన సెక్స్‌టన్ పాంపియన్ రక్షణలో వున్నట్లు వార్తలు వచ్చినవి. పాంపేయులు ఇంకా తాము బతికి ఉన్నట్లూ, వీలైనపుడల్లా రోమన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే యత్నాలలో ఉన్నట్లూ అర్థవౌతోంది. ఇపుడు ఏంటనీ ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నాడు. వెనువెంటనే రోమ్ వెళ్లి, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోకుంటే, తనకున్న కాస్త అధికారమూ ఊడుతుంది.
తాను ఆమె ముందు ఎంత అల్పుడయ్యాడో అతను గ్రహించగలిగినా, అందుకు సిగ్గుపడలేదు సరికదా, గర్వపడ్డాడు కూడాను.
‘‘దానికి పెద్ద ఆలోచన దేనికి ప్రియా! అలెగ్జాండ్రియాలో ఏం తక్కువ? భూతల స్వర్గాన్ని నీకు చవి చూపుతాను.. నాతోరా!’’ అన్నదామె.
ఈ ఈజిప్షియన్ రాణి మూలకంగా రోమన్ చరిత్రే వేరొక విధంగా రూపొంది ఉండేది.
తాను మూర్ఖుడు కనుకనే క్లియోపాత్రా సౌందర్యాన్నీ, ఆమె ఐశ్వర్యాన్నీ అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతో కాలాన్ని వృథా చేశాడు! అయినా ఇపుడు మాత్రం మించిపోయిందేమిటి? ముసలివాడు కనుక, పడుచుదాని వలపుల వలల్లో చిక్కుకున్నాడని తాను అనుకొని, నవ్వుకొనేవాడు. కాని తనలాటి పడుచువాడు ఇప్పుడీ ప్రణయంలో తల్లక్రిందులుగా పడిపొయ్యాడు.
సీజర్‌ను మొదటిసారి కలుసుకున్నపుడే అతన్ని ఆశ్చర్యపరిచి, మభ్యపెట్టగలిగింది తాను! అదేవిధంగా ఏంటనీకి కూడా ఏ తివాసీలో నుంచి ఉద్భవించి దర్శనమివ్వటమా? ఈ ఊహ రాగానే ఆమె తనలో తాను నవ్వుకున్నది.. కాదు, ఇంకో కొత్త పద్ధతిలో అతన్ని కలుసుకోవాలి.
ఏంటనీ తనకు తూర్పు దేశాల పాలన కావాలని కోరాడు. తూర్పు దేశాలలో ఐశ్వర్యమూ, అందమైన అమ్మాయిలూ, ఆహ్లాదకరమైన సహజ వాతావరణం, తియ్యని మధువు- మొదలైనవి అతన్ని ఆకర్షించినవి. అదీగాక ఏళ్ళ తరబడి అంతఃకలహాలతో తలబొప్పెలు కట్టిన రోమన్ రాజకీయాలు అతనికి విసుగు పుట్టించినవి.
ఈ అల్లకల్లోలం కూడా త్వరలోనే కుదుట పడింది. ఇప్పుడు రోమన్ రాజకీయాల్లో రెండు పక్షాలు ఏర్పడినవి. మొదటి పక్షంలో సీజర్ వారసుడు అక్టోవియన్, ఏంటనీ, సీజర్ మీద భక్తి విశ్వాసాలున్నవారు , రెండో పక్షంలో సీజర్ హత్యకు కారకులైన ముఖ్యులు. ఈ హంతకుల్లో చరిత్రకు అవసరమైన వారిద్దరూ కాస్పియస్, బ్రూటస్ లు వీరు రోమ్‌విడిచి చాలాకాలమైంది.
ఆకాశపుటంచుల్లోకి వెళ్లిన గాలిపటం తెగిన రీతయింది తన బతుకు విశేషించి తన జీవితంలో సీజర్ ఆక్రమించుకోగలిగిన స్థానానికి వేరెవ్వరూ అర్హులు కారు. అందుకనే జీవితంలో ఎటుచూసినా కారుచీకట్లు తప్ప మరేమీ గోచరించలేదామెకు.