డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లియోపాత్రా కూడా జీవిత శేషాన్ని ప్రశాంతంగా గడపమని సీజర్‌కు చెప్పాలనుకుంది. కాని చెప్పలేకపోయింది. సీజర్ నుంచి ఆమె పరిపూర్ణంగా అర్థం చేసుకున్నది ప్రణయమొక్కటే! సీజర్ దగ్గర ప్రేమోపాసన మినహా, ఆమెకు మరో ఆలోచనే రాదు!
సీజర్ కొత్త స్నేహితుడు ఏంటనీ క్లియోపాత్రా దర్శనార్థం వచ్చిపోతొనే ఉన్నాడు. క్లియోపాత్రా హృదయపూర్వకంగా, మొట్టమొదటి చూపుల్లోనే ప్రేమించింది ఈ దివ్యమూర్తినే! సీజర్‌కు శత్రువర్గంలో ఉన్నాడని నిన్న మొన్నటిదాకా ఆమె అతన్ని ద్వేషించింది. కాదు- ద్వేషించాననుకుంది. ఇపుడు అతని మిత్ర బృందంలో జేరాక, సరిగ్గా పదకొండేళ్ళ క్రితం తాను హృదయపు లోతుల్లో దాచుకున్న ప్రణయాన్ని తవ్వి బైటికి లాగింది. అతని పొందు కావాలని తహతహలాడింది. ఐతే, వృద్ధ కేసరి బతికి ఉండగా ఈ ఊహలు తనకు ఎంత ప్రమాదకరమైనవో ఆమెకు తెలిసి, ఆ కోర్కెల్ని బలవంతంగా అణచుకున్నది.
ఏంటనీ భార్య- పుల్వియా మీద క్లియోపాత్రాకు ఎంతో ఏవగింపు! ఏంటనీ లాంటి దివ్యపురుషునికి అతని భార్య ఏ విధంగానూ తగింది కాదు! అతి బలాఢ్యుడూ, 38 సంవత్సరాల నిండు యవ్వనంలో వున్న ఏంటనికీ, తనకూ ప్రణయాన్ని ఊహిచుకొని క్లియోపాత్రా కలలు కన్నది. ఇప్పుడు ఏంటనీ సీజర్ కుడి భుజ మయ్యాడు. హృదయపూర్వకంగా సీజర్ క్షేమాన్ని కోరేవారిలో ఏంటనీ వొకడు కనుక, అతని మీద క్లియోపాత్రాకు నమ్మకం ఏర్పడింది. దేవతలు కరుణిస్తే, ఏనాటికైనా ఏంటనీతో తాను కొంతకాలం స్వర్గుఖాలను బడయవొచ్చని ఆమెతలచేది.
ప్రణయదేవత వీనస్ దేవాలయ ప్రాంగణంలో సీజర్, క్లియోపాత్రా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. బహిరంగంగా సీజర్‌ను ఖండింనవారు లేరు కాని ఆయన ప్రజాస్వామ్యానే్న కాకుండా దేవతల్ని కూడా అవమానించేటంత బలాఢ్యుడయ్యాని ప్రజలు ద్వేషించసాగారు.
సర్వాధికార వర్గం కూడా సీజర్ పట్ల సుముఖణగా లేదు. అతని కీర్తికీ, అధికారానికీ అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికీ సీజర్ విసుక్కుంటున్నాడు. చాలామంది అధికారుల్ని అనవసరంగా అవమానించారు. రోమన్ సామ్రాజ్యంలోకి తిరిగి కిరీటం లేకుండానే రాజరికం ప్రవేశించిందని ప్రజలు నమ్మారు.
ఈమధ్య ఆయన చావును గూర్చి విశేషంగా మాట్లాడుతున్నాడు. ‘‘నన్ను చంపదల్చుకున్నవాడెవడో - ముందురండి, ఇదిగో తల!’’ అని అసందర్భంగా అరుస్తాడు.
‘‘మరణం అనుకున్నంత క్రూరమైనది కాదు. జీవితంలో ఒక్కసారే మనల్నది పలకరిస్తుంది. దానికోసం అశాంతితో ఎదురుచూడటం కన్నా, దాన్ని మనంతట మనమే ఆహ్వానిస్తే తేలిపోతుంది’’ అంటూంటాడాయన.
ఇలాంటి మాటలు విన్న క్లియోపాత్రా, ఆయన అనే మృత్యువు నిజంగానే దరిదాపుల్లో దాక్కొని ఉన్నదని భయపడసాగింది. ఐతే సీజర్ నవ్వు ముఖం చూ0సి, అదంతా వొట్టిదేలెమ్మని తనను తాను సమాధానపరచుకుంటూ ఉంటుంది.
రోమన్ సామ్రాజ్యంలో కుట్ర జరుగబోయే అవకాశాలున్నవని క్లియోపాత్రా తలచింది. అయితే కుట్ర అదివరకే ఆరంభమై అంత్యదశకు వచ్దిని ఆమె భావించలేకపోయింది.
క్రీ.పూ.44వ సంవత్సరం మ ఆర్చి నెల 17వ తేదీన సీజర్ పర్షియామీదికి దండెత్తేందుకు నిర్ణయించుకున్నాడు. తాను దేశం విడిచే ముందు ఒకసారి సర్వాధికార వర్గాన్ని సమావేశపరిచి, దేశంలోని అతి ముఖ్య సమస్యలను చర్చించి,. పరిపాలనా విధానాన్ని నిర్ణయించవలసి ఉంది. ఇందుకుగాను మార్చి 15వ తేదీ నిర్ణయించబడింది.
సర్వాధికార వర్గంలోని 80 మంది సభ్యుల్నీ సమావేశపరిచి చాలాకాలమైంది. వారు సీజర్‌ను ఒంటరిగా కలుసుకునేందుకు ఇదే చివరి అవకాశం! ఈ సమయంలోనే సీజర్‌ను సెనేట్‌లో విధిచేందుకు వారిలో వారు నిర్ణయించుకున్నారు.
అందరూ బాకుల్ని వెంట తెచ్చుకోవాలి, ఐతే ఎవ్వరికీ అవి కనిపించరాదు. సీజర్‌ను ఏదో మిషమీద అందరూ చుట్టుముట్టాలి. మొదటి బాకు పోటు పడగానే ముందు వెనుకలు ఆలోచించకుండా అందరూ ఆయన్ను పొడవాలి. ఎవరైతే వెనుకంజ వేస్తారో, వారు దేశద్రోహులౌతారు. ఆ తరువాత ప్రజలకు తాము చెప్పుకునే సంజాయిషీ కూడా తయారైంది.
‘‘సీజర్- రాజరికాన్ని తిరిగి ఇటలీలో స్థాపించాలనే దురుద్దేశ్యంతో, ప్రజాస్వామ్యాన్ని కూలద్రోయాలని ప్రయత్నించాడు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గౌరవించే రోమన్ జాతి ఎన్నుకున్న మేము- ప్రజల తరఫున- దీన్ని భరించలేకపోయాము. ఒక వ్యక్తి వేలికింద ఆడటం మాకు సమ్మతం కానేరదు. రక్త్ధారలతో సంపాదించుకున్న రుూ స్వేచ్ఛను పోగొట్టుకోలేక, తన అధికారాన్ని రోమన్ జాతిమీద రుద్దాలని ప్రయత్నించిన ఒక్క వ్యక్తినీ చంపివేశాము. రోమన్ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చిరకాలం వర్థిల్లుగాక!’’ ఇదీ ఆ సంజాయిషీ ధోరణి.
ఈ కుట్ర సంగతి చాలా రహస్యంగా ఉంచబడింది. సీజర్ యుద్ధ సన్నాహాలలో వేరొక విషయాన్ని పట్టించుకోవటంలేదు. ప్రజల దృష్టి కూడా వారం రోజులుగా, తూర్పు దేశాన్ని జయించేందుకుగాను ఉత్సాహంతో కదిలిపోతూన్న సైనిక దళాల మీదనే ఉన్నది. రోమన్‌లు తమ కొరకై సీజర్ రుూ యుద్ధాన్ని చేస్తున్నాడా అని కూడా అనుకుంటున్నారు.
సీజర్ హత్యకు సరిగ్గా రెండు రోజుల ముందు ఆయన క్లియోపాత్రాతో గడిపాడు.
ఇదే తమ తుది కలయిక అని వారు అనుకోలేదు. అయినప్పటికీ ఆ రాత్రి వారు తమ ప్రణయ చరిత్రనూ, ముఖ్యంగా అలెగ్జాండ్రియాలో వారు పొందిన సౌఖ్యాన్ని గూర్చీ ముచ్చటించుకున్నారు. ఒకరు మరిచిన ఘట్టాన్ని వేరొకరు జ్ఞాపకం చేసుకున్నారు.
ఉన్నట్లుండి సీజర్ ‘‘రాణీ! ఈవితంలోని నా కోర్కెలన్నీతీరినట్టే అనిపిస్తూంది.. మరణమనేది హఠాత్తుగా వచ్చిపడితే ఎంత బగుండునో అనుకుంటున్నాను!’’ అన్నాడు.
క్లియోపాత్రా అదిరిపోయింది. ఒకపక్క యుద్ధంలోకి వెళ్తూ రుూ ముసలివాడు సందర్భం లేకుండా మాట్లాడతాడేమిటి?
ఆమె ముఖంలోని కల్లోలాన్ని చూసి సీజర్ నవ్వాడు. ‘‘నాకు చావంటే భయం లేదు- అంతే’’ అన్నాడు.
ఆమెవిచారం తగ్గలేదు; సీజర్‌తోపాటే ఆమె నవ్వలేకపోయింది. ‘‘ప్రభూ! ఏవౌతుందనేది నేను చెప్పలేను కాని, దుష్టగ్రహాలు మన జీవితాన్ని ఆవరిస్తున్నాయని తోస్తుంది. ఏవో అశుభాలు నన్ను పట్టి పీడిస్తున్నవి. ననే్నదో చెప్పలేని భయం వేధిస్తూన్నది!’’ అన్నదామె.
సీజర్ మళ్లీ నవ్వాడు.
‘‘ఈ శకునాలమీద నాకంత నమ్మకం లేదనుకో. ఐనా, మాట వచ్చింది కనుక చెబుతున్నాను.. దేవతలే కానుకలుగా పంపారని తలచబడే నా రథాశ్వాలు మూడు రోజులనుంచీ నిరాహారదీక్ష పూనినవి. తీతువు పక్షులు గుంపులు గుంపులుగా నా ఇంటిమీద వాలి కూస్తూన్నవి. ఐతే ఇంతమాత్రానికే దిగజారిపోతే, నేను జూలియస్ సీజర్‌నవుతానా? నాకేం భయ లేదు- రాణీ!’’ అన్నాడాయన.
కాని రోమ్‌లో వదంతులు చెలరేగినవి. ప్రజలు మాట్లాడుకునే రహస్యల శబ్దం, కత్తులు సానబెడుతూన్న శబ్దంవలె ఉన్నది. చీకటి మూలాల్లో వారు మానవులకు అర్థంకాని భాషనేదో వాడుతున్నారు. ఈ సంగతులన్నీ సీజర్‌కు చెప్పి, యుద్ధ కారణంగా మకు కలగబోయే దీర్ఘ వియోగానికి ముందన్నా, కాస్త సుఖపడే అవకాశాన్ని పాడుచేసుకోవడం దేనికని ఆమె ఊరుకున్నది.
‘‘రాణీ! నా గూర్చి విచారించకు! ఈ యుద్ధంలో కూడా నేనే గెలుస్తాను! వంద యుద్ధాలు చేసినా, నా కత్తి ఇంకా మొక్కపోలేదు!’’ అన్నాడాయన గర్వంగా.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు