డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణయ రంగంలో మాత్రమే ఆమె సీజర్‌ను లొంగదీసుకుంది! ఇది ఆమె జీవిత రహస్యం!
సీజర్ స్పెయన్‌కు సైన్యాలతో తరలివెళ్ళేముందు ‘‘రాణీ! నేను అతి త్వరలోనే విజయలక్ష్మిని చేపట్టి, తిరిగి వస్తాను. నీవు ఇక్కడే ఉండి పరిస్థితుల్ని వివరంగా నాకు తెలియపరుస్తూ ఉండు!’’ అని ఆదేశించాడు.
ఆమె సమ్మతించింది.
ఐతే, సీజర్‌కు క్లియోపాత్రా మీద కూడా నమ్మకంలేదు. ముఖ్యంగా ఆమె ప్రణయ స్వరూపిణి. తేలిగ్గా కామోద్రేకాలను పొందుతూంటుంది. తాను ఆమెకు కామతృప్తిని ఇవ్వగల వయసులో లేడు. తనకన్నా యవ్వనవంతులూ, బలవంతులూ- అనేకమంది రోమ్‌లో ఉన్నారు. ఇపుడు ఆమె ఈజిప్షియన్ రాణి హోదాతో నాయకవర్గంలో యువకులనేక మందితో పరిచయాలు చేసుకుంది.
తాను రోమ్‌లో ఉండగా, మరో ప్రణయకలాపం కోసం ఆమె కానీ, తన నాయకవర్గంలోని వారు కానీ సాహించలేకపోవచ్చు. కాని, తాను దూరదేశాల్లో యుద్ధ రంగంలో ఉండగా, ఆమె తొందరపడి కాలుజారటం సహజం. అలాంటిదాన్ని తాను సహించలేడు. తన అధికారానికి ఆమె ప్రవర్తన గొడ్డలిపెట్టవుతుంది. సీజర్ తన మనుషుల్ని క్లియోపాత్రా చుట్టూ కాపలా పెట్టాడు.
ఈ స్వల్ప విషయాన్ని ఆమె ఎప్పుడో గ్రహించి, తనలో తాను నవ్వుకుంది. తన రోజుల్లో కనిపించిన అందగత్తెలందర్నీ అనుభవించి, స్వర్గంలోని రంభా ఊర్వశుల సంయోగమంటే ఆశపడేందుకు వీల్లేకుండా చేసుకున్న సీజర్‌ను మాత్రం తానెలా నమ్మగలదు? యుద్ధ్భూమిలో కూడా సీజర్ ఎంత విలాసయుత జీవితాన్ని గడుపుతాడో తనకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకని తన తాలూకు గూఢచారుల్ని కూడా ఆమె సీజర్‌కు కాపలా పెట్టింది.
సీజర్ రోజురోజుకూ అధికారంతో పైకి పాకాడు. అతని ఆశ దురాశగా మారిందా అని ఆమె అనుకున్నది. నిన్నటి సీజర్ చాలా విజ్ఞానవంతుడు. ఈనాటి సీజర్ దురాశాపరుడు. అధికార గర్వి! పాంపే కన్నా ఎక్కువ అధికారాన్ని చెలాయించేందుకు ఆయన సిద్ధపడ్డాడు. పాంపే చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన ఈ సీజర్ తన భావి ఎలా వుంటుందోనని ఆలోచించిన పాపాన పోలేదు. ఇక ప్రియుడుగా సీజర్ ముసలితనాన్ని ఆమె గ్రహించింది. ప్రియురాలుగా తాను అతన్ని స్వప్న సీమలో విహరిస్తోంది. అంతవరకైనా వారి ప్రణయం పెరిగి, ఆగిపోయిందనిపిస్తోంది.
ఏమైనా సీజర్‌ను ఆమె పూర్తిగా వదులుకోలేదు. ప్రణయాన్ని మరొకరికి అర్పించేందుకు సిద్ధపడనూ లేదు. రోమన్ రాజకీయ వాతావరణంతో ఆమె తల బద్దలు కొట్టుకోసాగింది.
***
స్పెయిన్‌తో సీజర్ దాదాపు సంవత్సరంపాటు యుద్ధం చేశాడు. ఆయన స్పెయిన్ నుంచి బతికి వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ వయస్సులో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉండవలసినది. యుద్ధ రంగంలో దూకుతే ఆయన తన ప్రాణాన్ని కాపాడుకోవటమనేదాన్ని ఎరుగనే ఎరుగడు. అలాంటిది యుద్ధంలో జయించి, తిరిగి వస్తున్నాడని తెలిసి, ప్రజలు ఆశ్చర్యపడ్డారు. సీజర్ శక్తికి తాము కట్టిన అంచనాల్లో చాలా పొరపాటున్నదనుకున్నారు. ఈ దెబ్బతో సీజర్ అధికారం ధృవపడిపోయింది.
సీజర్ విజయలక్ష్మిని చేపట్టి తిరిగి వస్తున్నాడని తెలిసిన మార్క్ ఏంటనీ, నిన్న మొన్నటిదాకా సీజర్‌మీద కారాలూ, మిరియాలూ నూరిన వ్యక్తి, ఎదురెళ్ళి కావలించుకున్నాడు. సీజర్ కూడా పాత సంగతులన్నీ మరిచిపోయి ఏంటనీని ఆదరించాడు. ఈ సంఘటనమీద ప్రజలు అనేక విధాలుగా మాట్లాడుకున్నారు.
అంతతో పోక, అదివరకు పాంపేయులు రోమన్ ప్రభుత్వం మీద కత్తికట్టిన నేరానికిగాను ప్రభుత్వం వశపరచుకున్న వారి ఆస్తిపాస్తులన్నీ, వారి వారి వారసులకు తిరిగి అప్పగించబడినవి. రోమ్‌లో ప్రతి వ్యక్తి తనకు స్నేహితుడేనని సీజర్ భావిస్తున్నట్లు స్పష్టపడింది. అంటే, శత్రువులంటే ఆయన భయపడిపోయి ఈ విధంగా మిత్రుల్ని చేసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఈ సంగతి తెలిసినా, సీజర్ నవ్వి వూరుకున్నాడు.
సీజర్ రాకకు క్లియోపాత్రా చాలా ఆనందపడింది. కాని, రుూనాడు సీజర్‌కు రోమ్‌లో నిజమైన మిత్రులెవరైనా ఉన్నారా అని ఆమె సందేహం! పైకి మాత్రం అందరూ సీజరంటే భయభక్తుల్ని ప్రకటిస్తున్నారు. కాని, లోపల కొన్ని భూకంపాలకుగాను తగు ఏర్పాట్లు జరుగుతూన్నవని ఆమెకు మాత్రం తెలుసు.
రోమ్‌లో భూతల స్వర్గం చేయాలని సీజర్ విశ్వప్రయత్నాలు చేశాడు. ప్రభుత్వం కింద వున్న భూముల్ని ఎక్కువ ధరలకు కొనమని భాగ్యవంతుల్ని ఒత్తిడి చేశాడు. ప్రభుత్వం కింద ఋణాలు చేశాడు. ఎంత చేసినా, రోమన్ సామ్రాజ్యంలో సీజర్ అనుకున్నంత డబ్బు కూడబెట్టలేకపోయాడు. అందుకని కొత్త దేశాల మీద దాడి చెయ్యాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ కథ చిన్నతనంలో విన్నప్పటినుంచి, ఆయన మీద సీజర్‌కు ఏకలవ్య లక్ష్యం ఏర్పడింది. సీజర్ తూర్పు దేశాలన్నిటినీ జయించాడు. నిజమైన ఐశ్వర్యమం తూర్పునే ఉన్నది. చాలాకాలంనుంచి పర్షియాను రోమన్ పరిపాలన కిందికి తీసుకొని రావాలనే ప్రయత్నాలు జరిగినవి. రోవమన్ సైన్యాలైతే అనేకసార్లు పర్షియామీద దాడి జరిపినవి కాని వెళ్లిన సైన్యంలో నాలుగోవంతు కూడా క్షేమంగా తిరిగి రాలేదు.
పూర్వం పర్షియా ఒక చిన్న రాజ్యంగా ఉండేది. ఇపుడు అదీ సామ్రాజ్యమైంది. ఈ పర్షియాను జయించాలి. ఆ తరువాత అలెగ్జాండర్ అడుగుజాడల్లో ఇండియాను స్వాధీనం చేసుకోవాలి. అదే ఇప్పుడు సీజర్ కంటూన్న కల! ఈ కలకు రూపరేఖలు దిద్దుతున్నాడాయన. కాని, అలెగ్జాండర్ చేసిన దండయాత్రలన్నీ, ఆయన యవ్వనంలోనే! సీజర్ ఊహించే రుూ ఘన విజయాలు ఆయన షష్ఠిపూర్తికి దరిదాపుల్లో జరుగుతూన్నవి.
సీజర్ కేవలం స్వార్థపరుడు కాదు. ముఖ్యంగా తననునమ్ముకున్న క్లియోపాత్రాకూ, ఆమె కుమారునికీ తనంత అధికార ప్రాప్తి జరిగేట్లుగా చూడాలి. ఆయన స్వప్నంలో క్లియోపాత్రా కూడా పాల్గొన్నది కాని ఈ వయసులో సీజర్ ఇంకా యుద్ధాలను గూర్చి ఆలోచించడం ఆమెకు సబబుగా తోచలేదు. అయినప్పటికీ ఆ శ్రమ పడేందుకు సిద్ధంగా ఉన్న సీజర్‌కు ఆమె ఎదురుచెప్పలేకపోయింది.
ఈజిప్షియన్ చట్టాల ప్రకారం సీజర్ టాలమీకి తండ్రి సీజర్! పోతే రోమన్ చట్టాల ననుసరించి కూడా సీజర్ తన కుమారునికి పితృస్థానాన్ని వహించేందుకు వీలుగా కొత్త చట్టం రావాలి. ఈ విధంగా తన తరువాతి తరాన్ని స్థాపించాలి. అంతతో అవదు. ప్రజాస్వామ్యంలో ప్రతి నియంతనూ సర్వాధికార వర్గం ఎన్నుకోవాలి. అంతేకాని, వంశపారంపర్యత ప్రకారం సామ్రాజ్యాధిపతం చేకూరదు.
అందుకని సీజర్ ఎలాగైనా తిరిగి రాజరికాన్ని రోమ్‌లో స్థాపించాలనీ, తాను చక్రవర్తి కావాలనీ ఆలోచిస్తున్నాడు. ఈ సూచనలు రోమన్ ప్రజలకు బొత్తిగా ఇష్టం లేదు. వారు శ్రమించి, తమ స్వాతంత్య్రాన్ని సంపాయించుకున్నారు. పేరుకు మాత్రమే అది స్వాతంత్య్రమైనా వారు దాంతోనే తృప్తిపడుతున్నారు. ఈ సీజర్ చాలా పెరిగిపొయ్యాడనీ, ఇక ఇతని పరిపాలన తాము భరించలేమనే ధోరణి స్పష్టమైంది.
పర్షియన్ దండయాత్రక్కూడా ప్రజలు సుముఖులుగా లేరు. ఎప్పుడూ యుద్ధాలేనా అనిపించింది వారికి. యుద్ధాల తరువాత శాంతిదేవత నాట్యమాడవలసింది, కాని అశాంతి తప్ప మరేమీ మిగలలేదు. పైగా ఈ యుద్ధం కొరకై తాము పన్నుల రూపాన సహాసయపడేందుకు వారు నిరాకరించారు. ఆరు నూరయ్యేది ఈ యుద్దం జరగాలనే సీజర్ పట్టుబట్టాడు. ఆయనకు ఎదురుచెప్పే సాహసం ఎవ్వరికీ లేదు.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు