డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలాసయుతంగా, ఎంతో ధనవ్యయంతో, అతి స్వల్పకాలంలో రుూ జల విహారార్థం నౌక తయారైంది. సీజర్ కూడా బైటి ప్రపంచాన్ని, ముఖ్యంగా వింతలు గొలిపే దేశమైన ఈజిప్టును చూడాలని కుతూహలపడ్డాడు.
ఐతే ప్రపంచంలోకెల్లా పొడుగైన నైల్ నదిలో ప్రయాణిస్తూ చూడడమంటే, ఈజిప్టును చూడటమే అవుతుంది. ఎందుకంటే నైల్ నది చరిత్రే ఈజిప్టు చరిత్ర! ఈజిప్టు నైసర్గిక స్వరూపానికేమి, శాంతి భద్రతలకేమి, ధనధాన్యాదులకేమి నైల్ నదే ప్రముఖ పాత్రను వహిస్తుంది. నైల్ లేకుండా ఈజిప్టు లేదు.
ప్రయాణ సన్నాహాలు జరుగుతూన్న సమయంలో ఒకనాడు సీజర్ క్లియోపాత్రాతో అన్నాడు: ‘‘రాణీ! నీకు పురుడు రాగానే నేను రోమ్ వెళ్లి, అక్కడ సమస్యలు పరిష్కరించుకోవాలి కదా! మరి ఆ ప్రయాణానిక్కూడా తగిన ఏర్పాట్లు చేయించవా?’’
ఆ ఏర్పాట్లేమిటో ఆమెకు తెలియకపోలేదు. తన తండ్రి రోమ్‌కు చాలా ధనం ఋణపడి ఉన్నాడు. దానికోసమే సీజర్ రోమ్‌కు వెళ్లకుండా ఈజిప్టులోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఎలాగైనా కొంత సువర్ణాన్ని సమర్పిస్తేగానీ ఆయన గౌరవం నిలవదు.
‘‘స్వామీ!’’ అన్నదామె. ‘‘ఈ దేశమే మీది! ఈనాడు నాకు రాజ్యపాలన సంక్రమించిందంటే, అది మీరు పెట్టిన భిక్షే కాని వేరు కాదు. మీరు గౌరవంగా రోమ్‌లో కాలుపెట్టేందుకుగాను సర్విధాలా ప్రయత్నిస్తాను. ఈ విషయమై మీరు ఆందోళన చెందకండి’’.
క్లియోపాత్రా వెంటనే రాజోద్యోగుల్నిసమావేశపరచి, లోగడ బాకీలున్న పన్నులన్నీ వెనువెంటనే వసూలుకావాలని ఆజ్ఞాపించింది. తాను టాలమీలతో పేచీపడిన అవకాశం దొరికింది కదానని పన్నులు ఎగ్గొట్టటంలో ప్రజలు తగినంత శిక్షణలను పొంది ఉన్నారు. ఇపుడు సుస్థిరమైన ప్రభ్వుం ఏర్పడింది. కనుక పన్నులు పిండటం అంత కష్టసాధ్యం కాలేదు.
సీజర్ క్లియోపాత్రాతో జలవిహారార్థం బయలుదేరాడు. నైల్ నది విలాసవతియైన స్ర్తి నడకను జ్ఞప్తికి తెస్తూంది. కనుచూపు ఆనినంత మేరవరకూ పంటలు కన్నుల పండువుగా ఉన్నవి. భూమాత పచ్చని తివాసీనిమీద కప్పుకొని, అతి శఓనాయమానంగా ఉన్నదా అనిపిస్తంది. ఈజిప్టు ఐశ్వర్యమంతా ఈ నైల్ నదిమీదినుంచే చూడొచ్చు. ధన ధాన్యాదులన్నిటినీ ఈ మహానది ప్రసాదిస్తూ ఉన్నది. ఈ ప్రకృతి శోభలో సీజర్ నిమగ్నుడయ్యాడు. తన ప్రియుని మనస్సు ఆహ్లాదకరంగా ఉన్నది కదానని క్లియోపాత్రా సంతోషించింది.
దారి పొడుగునా ప్రజలు తండోపతండాలుగా ఎదురొచ్చి, తమ రాణికీ సీజర్‌కూ స్వాగత గీతాలు పాడారు. క్లియోపాత్రా సింహాసనం ఎక్కిన వేళావిశేషమేమోకాని, భూమాత కూడా ఆనంద పారశ్యంతో విరియపండింది. ప్రజలు కలకాలంగా వాంఛిస్తూన్న శాంతియుత జీవితాన్ని అనుభవ
పూర్వకంగా చవి చూడగలుగుతున్నారు. ఇదంతా దైవాంశ సంభూతమైన తమరాణి చలవేనని వారు నమ్మారు. ఈ బ్రహ్మాండమైన స్వాగతాలతో సీజర్‌తోపాటు, క్లియోపాత్రా కూడా మైమరిచినంత పనయింది.
రెండు నెలలుగా సాగిన ఈ జల విహారంలో సీజర్ చాలా ఆరోగ్యవంతుడయ్యాడు. రాజకీయాలలో వేడెక్కిన బుర్ర ఇపుడు చల్లబడింది. ఇన్నాళ్ళూ యుద్ధరంగంలోనూ, ప్రణయ రంగంలోనూ అలసి సొలసి పోయిన ఆయన కండరాలకూ, నరాలకూ తగినంత విశ్రాంతి దొరికింది. పిల్లగాలులు పీల్చి, కొత్త శక్తిని సంపాయించాడాయన.
కాని, ఈ ప్రయాణంలో క్లియోపాత్రా ఆరోగ్యం దెబ్బతిన్నది. నైల్ మీది నుంచి వీచే శీతల వాయువులకు ఆమె తట్టుకోలేకపోయింది. తన ప్రియుణ్ణి ఆనందపరిచేందుకామె ఆరోగ్యం చెడినా పాపం భరించింది. చివరకు సీజర్ ఇది గ్రహించి అలెగ్జాండ్రియాకు తిరుగు ప్రయాణం చేయించాడు.
రాజభవనంలో ఇప్పుడామె తగినంత విశ్రాంతి తీసుకుంటోంది. ప్రతిరోజూ అనేక గంటలసేపు సీజర్ ఆమె ప్రక్కనే కూర్చుని, దాదాపు తనన జీవిత గాథనంతా చెప్పేవాడు. ఆమె వింటూ కూర్చునేది. తన సంతానం భూమిమీదికి వచ్చే శుభ సమయం కోసం ఎరుచూస్తున్నాడాయన.
రెండు నెలల అనంతరం క్లియోపాత్రా పురుడు పోసుకుంది. మొదటి కాన్పయినా అంత కష్టమవలేదు. సీజర్‌కు వాగ్థానం చేసిన విధంగా ఆమె మగబిడ్డనే కన్నది. అంతా సీజర్ పోలిక! ఈ బిడ్డను ఈజిప్షియన్ అంటే ఎవ్వరూ నమ్మరు. మంచుకొండలో అతి చాతుర్యంతో తొలిచిన ప్రతిమవలె ఉన్నాడు. క్లియోపాత్రా తన 23వ ఏట మాతృత్వాన్ని ధరించింది. బిడ్డను చూసి సీజర్ మురిసిపొయ్యాడు.
వీడికి ‘సీజర్ టాలమీ’ అని క్లియోపాత్రా పేరు పెట్టింది. టాలమీ వంశోద్ధారకుడు ఉదయించినందుకు దేశమంతటా వేడుకలు చేయబడినవి. వంశాచార ప్రకారం, ఈ సంఘటనను గూర్చి దేవాలయాల గోడలమీద శిల్పులు చెక్కారు.
తన ఆశయాలన్నీ నెరవేరినవి. రోమ్‌లో పరిస్థితులు తిరిగి విషమిస్తున్నట్లు సీజర్‌కు వార్తలు వస్తున్నవి. తన పేరు మీదుగానే పరిపానను మార్క్ ఏంటనీ జరుపుతున్నాడు. ప్రతి శాసనం సీజర్ నుంచే వస్తోందని అతను అంటున్నాడు. నిజం ఎవ్వరికీ తెలియకపోయినా, సీజర్ నాయకత్వాన్ని ఎదురాడేందుకు ఎవ్వరూ సాహసించటంలేదు. ప్రపంచమంతా తన విజయాలకు తగిన సత్కారాలను చేసేందుకూ, ముఖ్యంగా రోమన్ రాజ్యపాలనలో సీజర్‌ను చూసేందుకూ ఉవ్విళ్ళూరుతూన్నది. అనేక స్థలాల్లో అప్పుడే తన శిలావిగ్రహాలు స్థాపించబడినవనే వార్తలు వస్తూన్నవి.
ఐతే తాను రోమ్‌కు తిరిగి వెళ్ళని కారణమల్లా- తన చేతుల్లో చిల్లిగవ్వ లేకుండటమే! పరాజయాన్ని పొందిన పాంపేయులు తిరిగి రోమన్ ప్రభుత్వాన్ని వశం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వినవస్తూన్నది. సీజర్ సైనిక దళాలు, కొన్ని నెలలుగా వేతనాలందని కారణంగా రాజీనామాలిచ్చి, రహస్యంగా పాంపేయుల సైనిక దళాల్లో చేరిపోతున్నారనీ, ఇప్పటికైనా వెంటనే తిరిగొచ్చి, ఇంటి వ్యవహారాలు చూసుకోకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందనీ, చివరకు విచారపడి ప్రయోజనం ఉండదనే కబుర్లు రోమ్ నుంచి వచ్చినవి. ఇక తాను ఈజిప్టులో ఉండటం ప్రమాదకరమని కూడా ఆయన గ్రహించాడు. ప్రపంచం తాను కేవలం విలాస పురుషుడని తన వెనుక హేళన చేస్తున్నది. ఆ అభిప్రాయాన్ని రూపుమాపేందుకు ఆయన సిద్ధపడ్డాడు.
‘‘రాణీ! అత్యవసరమైన రాజకీయాలు నన్ను ఆహ్వానిస్తున్నవి. నీకు వాగ్దానం చేసినట్లు నీ బహూకృతి కొరకై ఇన్నాళ్ళూ వేచి ఉన్నాను. మరి నాకు సెలవిప్పించవా?’’’ అని ప్రాధేయపడ్డాడు సీజర్.
క్లియోపాత్రా కన్నులు చెమ్మగిల్లినవి. మాతృత్వాన్ని పొందాక ఆమె సహజ సౌందర్యం ద్విగుణీకృతమైంది. స్ర్తిత్వానికి ప్రకృతి విధించిన అగ్ని పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనందుకు ఎంతో హుందాతనం, గర్వం ఆమెలో పొడచూపున్నవి.
‘‘నీవలా దుఃఖపడితే, నా కాళ్ళు కదలలేవు. ఆరు నెలలు తిరుగకుండా నిన్ను రోమ్‌కు ఆహ్వానిస్తాను రాణీ! నా శరీరమైతే రోమ్‌లో ఉంటుంది కాని, ప్రాణం ఇక్కడున్న నీమీదా, నా రుూ కుమారునిమీదనే ఉంటుంది’’ అన్నాడు సీజర్.
ఆమెకు ఈ వియోగం తప్పనిసరైంది.
‘‘మీ ప్రయాణానికి అన్నీ సిద్ధంగా ఉన్నవి ప్రభూ! కోశాగారంలో మీకు సరిపడేటంత బంగారాన్ని కూడబెట్టాను తీసుకొని వెళ్ళండి.. కాని, కాని.. నన్ను మరువకండి.. కనీసం ఈ చిన్నారినన్నా గుర్తుంచుకోండి.
‘‘రాణీ! నినె్నలా మరువగలను? జీవితంలో ప్రణయదేవతమై నన్ను మోకరిల్లజేశావు. ఇంత అనుభవమున్న నేను ప్రణయకళను నీనుంచి నేర్చుకున్నానంటే నమ్ము..

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు