S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/10/2019 - 19:11

భగవంతుడు సర్వాంతర్యామి. చిన్నారులకు చిన్ననాటినుండే భక్త్భివం కలిగించేందుకు పెద్దలు నిత్యం కృషిచేయాలి. ప్రహ్లాదుడు చిన్నతనంలో తల్లి గర్భం నుండే హరినామ సంకీర్తన చేసి లోకానికే ఆదర్శప్రాయుడైనాడు. ఇంకా ధ్రువుడు, లవకుశులు చిన్నారులుగానే ఆధ్యాత్మికతను సంతరించుకున్నారు. శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందగలిగాడు.

10/09/2019 - 19:56

భారతీయులకు మరీ ముఖ్యంగా దక్షిణాదివారికి ఓ శాపం ఉంది! ఆచి తూచి తిన్నా 40 ఏళ్ళు దాటాయంటే పొట్ట వచ్చిపడుతుంది. వాకింగ్, ఎక్స్‌ర్‌సైజులు, యోగాలు చేసి నానా తంటాలు పడితే తప్ప ఆ పొట్ట కాస్తయినా తగ్గదు. ఉత్తరాదివారు ఎక్కువ గోధుమ రొట్టెలు తింటారు కాబట్టి ఊబకాయం సమస్య మనతో పోలిస్తే వారిలో కాస్త తక్కువే.

10/07/2019 - 18:54

శా॥ వాచాహేయము, అస్థిర ప్రమద శోభాభాస దుర్మోహద
స్ర్తి చక్రంబున, లాభలోభ వివశ స్వేచ్ఛా విహీన వ్యధా
శ్రీచక్రంబున, జన్మమృత్యు రుదిత క్ష్వేళాకరాళ క్రియా
శ్రీచక్రంబున, మున్గితేలు మము సుస్నేహార్ద్ర మోక్షార్హద
శ్రీచాతుర్య కళాప్రభన్ గనగదే! శ్రీచక్ర సంచారిణీ!

10/01/2019 - 18:43

సీ॥ అది గాంధి కళ్లజోడటె? కాదు- బాహ్యాంత
ర స్వచ్ఛ భవ్య భారతము కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు- శాంత్యహిం
సల సత్యతత్త్వదర్పణము కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు.. స్వామి న
రేంద్ర, రవీంద్రుల హేల కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు.. రామనా
మైక గీతా రూప టీక కాని..
అట్లుగా కళ్లజోడద్దమందరికిని
ఉన్నచో మోకరిల్లదే! ఉర్వియెల్ల

,
09/26/2019 - 18:51

సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. పండుగల కోలాహలం మొదలవుతుంది. బతుకమ్మ, దసరా, దీపావళి.. ఇలా వరుసగా పెద్ద పండుగలే.. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కళకళలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలో బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు. ముఖ్యంగా తెలంగాణాకు మాత్రమే ప్రత్యేక పండుగ బతుకమ్మ. ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. పండుగ వచ్చిందంటే చాలు..

,
09/25/2019 - 18:37

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే..

09/24/2019 - 18:52

జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే అతి పెద్ద పండుగ పెళ్లి. అలాంటి సమయంలో ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అలా పెళ్లిలో కనిపించాలంటే అప్పటికప్పుడు రెడీ అవుతే సరిపోదు. కనీసం నెలరోజుల ముందు నుంచీ శారీరికంగా, మానసికంగా సిద్ధమవ్వాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చెయ్యాలి. ముఖానికి ఏ క్రీములు పడితే అవి వాడకూడదు.

09/24/2019 - 18:41

ఆ అమ్మాయి వయస్సు పదహారు సంవత్సరాలు.. పేరు గ్రెటా.. పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలు మానేసి మరీ పోరాటానికి దిగింది. ఆమెకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్కూలు విద్యార్థులు పోరాటం చేపట్టారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమం సాగిస్తున్నారు. అలాంటి గ్రెటా థన్‌బర్గ్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఉద్వేగ భరితంగా మాట్లాడింది.

09/22/2019 - 22:37

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా.. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసంతో ఒక్క 2015లోనే 3, 83, 000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు.

09/20/2019 - 19:14

నేటి తరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. పిల్లలకు చదివే అలవాటు ఎలా చేయాలన్నదే నేడు పెద్దలకు దిక్కుతోచని సమస్యగా మారింది. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. ఇలా జరగాలంటే వారితో పాటు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకం ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి పుస్తకాలను సమకూర్చాలి.

Pages