S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/23/2019 - 18:19

ఇక్కడ కనిపిస్తున్న పెళ్లికూతురు పేరు శ్రద్ధా భగత్. పెళ్లి ముహూర్తం ముంచుకొస్తున్నా.. త్వరత్వరగా తన అలంకరణను పూర్తిచేసుకుని.. సమాజంలో పౌరురాలిగా తనవంతు బాధ్యతను నిలబెట్టుకోవడానికి పట్టుబట్టలతో పోలింగ్ బూత్ ముందు క్యూలో నిల్చుంది. ఈమెను చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. అందరిలాగే క్యూలో నిల్చున్న ఈ నవవధువు ఓటువేసిన అనంతరం పెళ్లి మండపానికి వెళ్లింది.

04/23/2019 - 18:18

పండుగ రోజున ప్రశాంతతని వెతుకుతూ
కొన్ని పక్షులు దేవుడి ముందు మోకరిల్లితే

కష్టాలని, బాధల్ని ఆనందాల్ని దయగల
తండ్రితో మొరపెట్టుకుంటే

భిన్న సమూహాలన్నీ ఒక్కటై
సమారాధనని జరుపుతూ సంతోషపడదామని

పాపం అమాయక పక్షులు కొన్ని తలపోస్తే
ఉరుములేని మెరుపులా
ఎక్కడినుంచో బాంబుల జడివాన

04/21/2019 - 22:38

నోటి దుర్వాసన పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల ఎదుటివారు మనతో మాట్లాడాలంటే ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఇది శరీరంలోని వివిధ రుగ్మతల వల్ల వస్తుంది. చాలామటుకు అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తలతో దీన్ని సులువుగా అరికట్టవచ్చు.

04/21/2019 - 22:36

నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం
*

04/19/2019 - 19:21

ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండటం లేదు. రోజుకు పది, పనె్నండు గంటలపాటు కదలకుండా డెస్క్ ముందు కూర్చొని పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పనివిధానమిలాగే ఉంటోంది. కాబట్టి ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది.

04/18/2019 - 19:42

నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..
* బేకింగ్ సోడాను ఉపయోగించి పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా మార్చవచ్చు. బేకింగ్ సోడాను చిగుర్లకు అంటనివ్వకుండా కేవలం దంతాలపై రుద్దడం వల్ల పచ్చదనం పోతుంది.

04/17/2019 - 19:50

పిల్లలు ఎప్పుడూ ఆటలు ఆడుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో వారు త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటి సమయంలో వారిలో తక్షణ శక్తిని పెంచి, అనుక్షణం వారిని చురుగ్గా ఉంచే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. పది సంవత్సరాల నుంచి పిల్లలది బాగా పెరిగే వయసు. ఈ వయసులో పిల్లలకు న్యూట్రియంట్లు చాలా ఎక్కువ అవసరం. అలాంటి ఆహారమే వారికి అందించాలి. న్యూట్రియంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని సూపర్ ఫుడ్స్ అంటారు.

04/16/2019 - 19:47

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
గుమ్మడి గింజలు

04/15/2019 - 23:08

ఈ మానవ మృగాల రాజ్యములో
నలిగిపోయే పసిపిల్లలు ఎందరో

ఈ మానవ మృగాలు మనుషులుగా
మారేది ఎన్నడో

ఒంటరిగా ఆడపిల్ల బ్రతికే రోజెన్నడో
ఈ పసిపిల్లల దుస్థితి మారేదెన్నడో

ఈ దుర్యోధన దుశ్శాసనులు మారేదెప్పుడో
సమాజంలో మార్పు తెచ్చేది ఎప్పుడో

ప్రతి మనిషి భీమునిగా మారి
ఈ కామాంధులను చంపేదెన్నడో

ఆడదంటె ఆటబొమ్మ కాదు
నిన్ను కన్న తల్లి ఆడదేనురా

04/14/2019 - 22:18

ప్రపంచంలోని ప్రతి ఓటరు వేలిపై మన సిరాచుక్క.. అంటే హైదరాబాద్ సిరాచుక్కే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సిరాచుక్క మనం ఓటు వేశాం అని చెప్పడానికి మాత్రమే గుర్తు కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరాచుక్కే.. అందుకే భారతదేశంతో పాటు చాలాదేశాలు ఎన్నికల ఓటు వేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. ఎన్నికల వేళ కీలకంగా మారే ఈ సిరా హైదరాబాద్‌లోనే తయారవుతుంది.

Pages