S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/17/2019 - 22:51

మానవ జీవితాన్ని శాసించేవి అతడు చేసే ఆలోచనలే.. మనకు భయం వేసినప్పుడు మెదడులో 1400 భౌతిక, రసాయనిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. ఇలా మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం. అందుకే మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మనిషి రోజుకు సగటున 30 వేల రకాల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెబుతున్నాయి.

11/17/2019 - 22:47

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే..

,
11/14/2019 - 23:15

చీర కట్టుకుంటే అందంగా కనిపించాలి.. ఆధునికంగా ఉండాలి.. సౌకర్యంగా ఉండాలి.. మెరిసిపోవాలి.. వీటన్నిటితో పాటు ట్రెండీగానూ కనిపించాలి.. ఇవి ఈ తరం మగువలు కోరుకునేవి. కానీ ఒక్క విషయం.. ఎత్తు, బరువు, షేప్‌లను అనుసరించి చీరలను ఎంచుకోవాలి. ఆకట్టుకునే చీరకట్టుతో మెరిసిపోవాలంటే.. ఎలాంటి చీరలను కట్టుకోవాలో చూద్దాం అంటున్నారు నేటి డిజైనర్లు.
పొడవైన వారికి..

11/12/2019 - 18:27

నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచినిద్ర అవసరం. రోజుకి ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోతే చాలా మంచిది. చాలా తక్కువమందికి పడకమీదికి చేరుకోగానే నిద్రపడుతుంది. అది అదృష్టంగా భావించవచ్చు. అయితే మంచం ఎక్కినా కూడా ఎక్కువమంది టీవీ చూడటమో, మొబైల్‌లో ముచ్చట్లు చెప్పుకోవడమో చేస్తుంటారు. ఈ రెండు పనులు చాలు నిద్రకు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి.

11/11/2019 - 18:34

కార్తీక ‘పౌర్ణమి’ మహోత్సవాన..
దివ్యకాంతులు మిన్నంటేను
ఆనంద పారవశ్యాలు ‘ఎద’ నిండేను

కోటి దీపారాధనతో..
కోవెలలో ‘నవ్య’ కిరణాలు విరిసేను

పవిత్ర పూజలతో..
మోముల్లో ‘శాంతి’ క్రాంతులు కురిసేను

ఈ శుభ తరుణాన..
నింగి ‘తారక’లు ఇల వాలిన చందంగా
పండు ‘వెనె్నల’ వరించిన వైనంగా
పుడమి పులకరించు
భక్త హృదయాలు హర్షించు

11/10/2019 - 22:44

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఓ నానుడి. మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను, తాను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు, జీవం వున్న ప్రతి వ్యక్తికి అత్యవసరమైనది ఆహారం. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగ నిరోధకశక్తిని కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు.

11/08/2019 - 18:29

ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. వేడుకకు ఎంత అందంగా తయారైనా.. జుట్టు నిర్జీవంగా ఉంటే అందం నీరుగారిపోతుంది. అందుకే ముందుగా జుట్టును జీవంగా, అందంగా, ఎలా చెబితే అలా వినేట్లు చేసుకోవాలి. అలాగని బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాలంటే సమయం, డబ్బూ రెండింటినీ ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇంట్లోంచి కదలకుండా, ఇంట్లోనే చేసుకోదగ్గ చిట్కాలతో అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

11/06/2019 - 19:17

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.

11/05/2019 - 18:41

ఇది శాకాహార యుగం. నాన్‌వెజ్ మానేసి చాలాకాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి. అయితే మాంసాహారం తినేవారు ఎక్కువ బలంగా ఉంటారని, శాకాహారులకు అన్నిరకాల ప్రోటీన్లు లభించవన్న వాదన మాత్రం వినిపిస్తూనే వుంది. నిజానికి ఏ ఆహారం తీసుకోవాలనేది ముఖ్యం కాదు. దాన్ని మనం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామనేది ప్రధానం. నిజానికి మాంసాహారులైనా శాకాహారం తీసుకోకుంటే అనారోగ్యం పాలవుతారనే విషయం చాలామందికి తెలియదు.

11/03/2019 - 22:18

సెల్‌ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతోంది. సెల్‌ఫోన్ నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుండి పిల్లల బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మెమరీ మందగిస్తున్నాయి. ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఆత్మవిశ్వాసం లోపించడంతోపాటుగా, కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది.

Pages