S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/15/2019 - 18:22

భూమిపై ఉన్న జీవరాశి బ్రతకడానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం అనేది మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైనది. మంచి తిండి తిని మనిషి ఆరోగ్యంగా ఉన్నపుడే దేశ పురోగతికి పాటుపడుతాడు. అందుకే ప్రముఖ కవి గురజాడ అప్పారావు ‘‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్’’అని అన్నారు. మనం ఆహారంకొరకు పంటలపై, చెట్లపై, పశువులపై, జలవనరులపై ఆధారపడవలసి ఉంటుంది.

10/13/2019 - 22:32

ఇప్పుడు మనం ‘ఇంటీరియర్ డెకరేషన్’ అనే మాటని బాగా వింటున్నాం. ఇంటినొక సాంకేతిక సీమగా, సర్వవసతుల నిలయంగా మార్చుకుంటున్నాం. ఇంటిని అందంగా అలంకరించుకోవటానికి వస్తువులు, సకల సదుపాయాలు ఇబ్బడిముబ్బడిగా ఇప్పుడు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అన్నీ ముఖ్యమైనవీ, అత్యవసరాలు అని కూడా అనిపిస్తాయి. హోదాని పెంచేందుకు, హుందాగా జీవించేందుకు అవి తప్పనిసరే అనిపిస్తాయి.

10/11/2019 - 18:55

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లి.. ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం. అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా.

10/11/2019 - 18:53

రోజువారీ ఆహారంలో అన్ని ఖనిజాలు ఉన్నాయా? లేవా? అని చూసుకుంటాం కానీ మెగ్నీషియం గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. శరీరం సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. కండరాలు, నరాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరి. రోగనిరోధక వ్యవస్థకు సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గుండెను అలాగే కాపాడుకోవడానికి, ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి కూడా మెగ్నీషియం ఎంతగానో ఉపయోగపడుతుంది.

10/10/2019 - 19:11

భగవంతుడు సర్వాంతర్యామి. చిన్నారులకు చిన్ననాటినుండే భక్త్భివం కలిగించేందుకు పెద్దలు నిత్యం కృషిచేయాలి. ప్రహ్లాదుడు చిన్నతనంలో తల్లి గర్భం నుండే హరినామ సంకీర్తన చేసి లోకానికే ఆదర్శప్రాయుడైనాడు. ఇంకా ధ్రువుడు, లవకుశులు చిన్నారులుగానే ఆధ్యాత్మికతను సంతరించుకున్నారు. శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందగలిగాడు.

10/09/2019 - 19:56

భారతీయులకు మరీ ముఖ్యంగా దక్షిణాదివారికి ఓ శాపం ఉంది! ఆచి తూచి తిన్నా 40 ఏళ్ళు దాటాయంటే పొట్ట వచ్చిపడుతుంది. వాకింగ్, ఎక్స్‌ర్‌సైజులు, యోగాలు చేసి నానా తంటాలు పడితే తప్ప ఆ పొట్ట కాస్తయినా తగ్గదు. ఉత్తరాదివారు ఎక్కువ గోధుమ రొట్టెలు తింటారు కాబట్టి ఊబకాయం సమస్య మనతో పోలిస్తే వారిలో కాస్త తక్కువే.

10/07/2019 - 18:54

శా॥ వాచాహేయము, అస్థిర ప్రమద శోభాభాస దుర్మోహద
స్ర్తి చక్రంబున, లాభలోభ వివశ స్వేచ్ఛా విహీన వ్యధా
శ్రీచక్రంబున, జన్మమృత్యు రుదిత క్ష్వేళాకరాళ క్రియా
శ్రీచక్రంబున, మున్గితేలు మము సుస్నేహార్ద్ర మోక్షార్హద
శ్రీచాతుర్య కళాప్రభన్ గనగదే! శ్రీచక్ర సంచారిణీ!

10/01/2019 - 18:43

సీ॥ అది గాంధి కళ్లజోడటె? కాదు- బాహ్యాంత
ర స్వచ్ఛ భవ్య భారతము కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు- శాంత్యహిం
సల సత్యతత్త్వదర్పణము కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు.. స్వామి న
రేంద్ర, రవీంద్రుల హేల కాని..
అది గాంధి కళ్లజోడటె? కాదు.. రామనా
మైక గీతా రూప టీక కాని..
అట్లుగా కళ్లజోడద్దమందరికిని
ఉన్నచో మోకరిల్లదే! ఉర్వియెల్ల

,
09/26/2019 - 18:51

సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. పండుగల కోలాహలం మొదలవుతుంది. బతుకమ్మ, దసరా, దీపావళి.. ఇలా వరుసగా పెద్ద పండుగలే.. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కళకళలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలో బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు. ముఖ్యంగా తెలంగాణాకు మాత్రమే ప్రత్యేక పండుగ బతుకమ్మ. ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. పండుగ వచ్చిందంటే చాలు..

,
09/25/2019 - 18:37

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే..

Pages