Others

ఇక అంతా ఇన్‌స్టెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఒకవేళ కాకపోయినా పొద్దునే్న లేచి పిల్లలకు భర్తకు వంట చేయడం నిజంగా స్టంటే అవుతుంది, ముఖ్యంగా చిన్నప్పట్నుంచి చదువుల కోసం హాస్టళ్ళల్లో గడిపి తరువాత పెళ్లయిన గృహిణులకు. దిగులు పడకుండా ఈ పద్ధతి అనుసరించి చూడండి.
* బాణలిలో ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఒక్కో చెంచాడు మినప్పప్పు, సెనగపప్పు, జీడిపప్పు వేసి దోరగా వేగాక అందులో సన్నగా తరిగిన ఆరేడు పచ్చిమిర్చి ముక్కలు, రెండు రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి బాగా వేపాక అందులో అరకేజీ రవ్వ, రుచికి సరిపడా సాల్ట్ కలిపి తక్కువ మంటమీద చక్కగా వేపుకుని చల్లారాక ఓ ఎయిర్ టైట్ కంటెయినర్ లో పోసి పెట్టుకుంటే, పొద్దున్న లేవగానే కప్పు రవ్వ మిశ్రమానికి రెండు కప్పుల కొలతతో కేవలం నీళ్ళు మరిగించుకుని పది నిమిషాల్లో ఉప్మా చేసుకోవచ్చు. ఇదే మిశ్రమంలో పెరుగు, పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి పదిహేను నిమిషాలు నానాక అందులో కావాలంటే కాస్త ఇంకువ, తురిమిన పచ్చికొబ్బరి కానీ తురిమిని క్యారెట్ కానీ చేర్చుకుని ఇడ్లీలు పోసుకుంటే రవ్వ ఇడ్లీలు రెడీ. అలాగే ఇదే మిశ్రమంతో పొంగణాలు కూడా చేసుకోవచ్చు. ఒకే మిశ్రమంతో మూడు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు, ఏది కావాలనిపిస్తే అది.
* ఒక కప్పు, మినప్పప్పు, నాలుగు చెంచాలు సెనగపప్పు, మూడు చెంచాలు కందిపప్పు, ఒక చెంచా మెంతులు బాణలిలో నూనె లేకుండా దోరగా వేపుకుని మిక్సీలో మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇందులో రెండు కప్పుల బియ్యం పిండి, రెండు స్పూన్ల బొంబాయి రవ్వ, ఒక చెంచా బేకింగ్ సోడా, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుని చల్లారాక కంటైనర్‌లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమయం లేక గానీ, మరిచిపోవడంవల్ల గానీ దోసెల కోసం పిండి ప్రిపేర్ చేసుకోలేదన్న బాధ లేకుండా పదినిమిషాలు నీళ్లలో ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టి చక్కటి దోసెలు వేసుకోవచ్చు.
* నాలుగు చెంచాల నెయ్యిలో గుప్పెడు జీడిపప్పు, అరచెంచా మిరియాలు, అరచెంచా జీలకర్ర, ఒక చెంచా సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసి బాగా వేగాక అరకేజీ బియ్యం, పావు కేజీ పెసరపప్పు వేసి దోరగా వేపుకుని తగినంత ఉప్పు కలిపి చల్లారనిచ్చి నిలవ చేసుకుంటే కప్పుడు నాలుగు కప్పుల నీరు చొప్పున మరిగించుకున్న నీటిలో ఈ మిశ్రమం వేసి మెత్తగా ఉడికించుకుంటే వేడి వేడి పొంగల్ రెడీ.
* నాలుగైదు చెంచాల నెయ్యి, రెండు చెంచాల నూనె వేసి రెండు బిరియానీ ఆకులు, జీడిపప్పు, రెండు ఏలకులు, ఒక చెంచా షాజీర, అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ వేసి వేగాక చెంచా మిరియాలు వేసి వేగాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కూడా కలిపి వేగనిచ్చి అరకేజీ బాస్మతీ రైస్ గానీ, సోనా మసూరిగానీ వేసుకుని రెండుమూడు నిమిషాలు సన్న మంటమీద వేపుకుని తగినంత ఉప్పు కలిపి చల్లారనిచ్చి స్టోర్ చేసుకుంటే నెల వరకు రుచి తగ్గకుండా వుంటుంది. ఈ మిశ్రమానికి ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళు చొప్పున వేసుకుని మరిగాక అలాగే కానీ లేక సన్నగా తరిగి కాస్త నూనెలో వేపుకున్న కారెట్, ఆలుగడ్డ, క్యాప్సికం ముక్కలు కూడా చేర్చుకుని అందులో ఈ మిశ్రమం కలిపి ఉడికించుకుంటే వేడి వేడి పులావ్ పావుగంటలో తయారైపోతుంది.
* నాలుగు చెంచాల నేతిలో గుప్పెడు జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేపుకుని, అందులో రవ్వగానీ, సేమియా గానీ వేసి దోరగా వేపుకుని, రెండు చెంచాల ఏలకుల పొడి కలిపి ఆరాక నిలువ చేసుకుంటే పాలు మరిగించుకుని సేమియా మిశ్రమం, చక్కెర కలిపి పాయసం, పాలకు బదులు కప్పుకు రెండున్నర కప్పున నీరు వేసి మరిగించి చిటికెడు కేసరి రంగు కలిపి రవ్వ మిశ్రమం చేర్చి చక్కెర రుచికి తగినంత వేసి ఉడికించుకుంటే కేసరి తయార్. కావాలనుకుంటే మరికాస్త నెయ్యి వేసుకోవచ్చు.

- డేగల అనితాసూరి 92475 00819