S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

,
08/22/2019 - 18:59

పెళ్ళైనా, నిశ్చితార్థమైనా, సంప్రదాయానికి సంబంధించిన ఎటువంటి వేడుకైనా.. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులనే ఎంచుకుంటారు. నేటి అమ్మాయలు వేడుకలకి చీర, పరికిణీ ఓణీలను పక్కకు నెట్టి లెహంగాలకే ఓటేస్తున్నారు. లెహంగాలు దక్షిణ భారతదేశ సంప్రదాయం కానప్పటికీ ఉత్తర భారతదేశ సంప్రదాయ పోకడలను యువత ఎక్కువగా ఆచరించడం వల్ల పెళ్ళిళ్లలోని సంగీత్, మెహెందీ వేడుకల్లో లెహంగాలు అధరెహో.. అనిపిస్తున్నాయి.

08/22/2019 - 18:45

నీ జీవన శిల్పానికి
నీవే ఒక శిల్పివై
మార్చుకొనుము
కూర్చుకొనుము
నేర్చుకొనుము
నవ జీవన విధానమును
పొద్దు పొడుపు పొడవగనే
బద్ధకాన్ని వదిలిపెట్టి
నిదురలేచి నిశ్చయముగ
నడకను ప్రారంభించుము
అల్పాహారముతోనే
ఆ రోజును మొదలుపెట్టి
అంతులేని ఆరోగ్యం..
పొందుమింక ప్రతిరోజూ
యోగా-్ధ్యనము విడిచి
సాగదు మన జీవనమ్ము

,
08/21/2019 - 18:38

కడుపుతో ఉన్న సమయంలో రోజువారీ కేలరీల కంటే 300 నుంచి 400 కేలరీలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకనే ఆహారంలో ఐదు రకాల రంగులున్న పండ్లను తీసుకోవాలి. అంటే అరటి, బత్తాయి, ఆపిల్, ద్రాక్ష, జామ.. వంటివన్నమాట. ఆకలిగా అనిపించకున్నా కడుపుతో ఉన్నవారు తినడానికి ప్రయత్నించాలి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను ప్రతిరోజూ తప్పకుండా తినాలి.

,
08/20/2019 - 18:45

ప్రశంస తిరుగులేని సాటిలేని హార్మోన్ వంటిది. దానివల్ల మనసు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే ఎటువంటివారికైనా ప్రశంస ప్రధానం.

08/16/2019 - 18:38

ఇంట్లో పాపాయి వున్నప్పుడు తల్లికి పని పెరుగుతుంది. ‘‘చంటి పిల్లలు హాయిగా నిద్రపోతారు. అల్లరి చేస్తారా? వస్తువులను పాడు చేస్తారా? ఆకలేస్తే ఏడుస్తారు.. కాసిని పాలు తాగి, కాసేపు ఆడుకుని అలసిపోయి పవళిస్తారు’’ అనుకుంటారు మగవాళ్ళు. కాని ఆ అభిప్రాయం సరికాదు. పాపాయి పెంపకంలో తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఎంతో శుభ్రతను పాటించాలి.

08/15/2019 - 22:33

రాత్రి తీసుకునే భోజనం మితంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించే ముందు డిన్నర్ తీసుకుంటాం.. కాబట్టి భోజనం తరువాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అందుకని పరిమితిని మించి తీసుకునే ఆహారం, నిద్రలేచిన తర్వాత కూడా రోజంతా మైకం ఆవరించి ఉండేలా చేస్తుంది. అతిగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది. రాత్రి నిద్రవేళల్లో జరిగే కొన్ని జీవక్రియలు స్థాయిని మించి పనిచేయడం ద్వారా పైత్యప్రకోపాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

08/15/2019 - 22:30

నోరు బాలేనప్పుడు, నాలుక చేదుగా అనిపించినప్పుడు నాలుగు రొయ్యలను నోట్లో వేసుకోకపోతే.. మాంసాహారులకు మనసొప్పదు. అందుకే మాంసాహారులు ఎక్కువగా రొయ్యలను తింటారు. ఎక్కువగా రొయ్యల వేపుళ్లను, ఇగుర్లను తింటారు. తిన్నంతసేపు బానే ఉంటుంది.. తిన్న తరువాత అనారోగ్య భయం వెంటాడుతుంది. కానీ అనవసర భయాలు వద్దంటున్నారు ఆరోగ్యనిపుణులు.. ఎందుకంటే బలానికి రొయ్య చాలా మంచిది అని చెబుతున్నారు వారు.

08/14/2019 - 18:48

‘‘యేన బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబద్నామి రక్షే మా చల మా చల...’’ ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు...కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను... సోదర ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో ఉండిపోతారు.

08/13/2019 - 18:33

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న సిద్ధాంతం నిజం చేయాలంటే చిన్నారులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అదే విధంగా పిల్లలకు చదువు సంస్కారంతోబాటు వారిలో చిన్ననాటినుండే దేశభక్త్భివం పెంపొందించాలి. భారతదేశం మనదేశం, మన దేశ స్వాతంత్య్రం కోసం కృషిచేసిన మహనీయుల త్యాగఫలితమే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని పెద్దలు పిల్లలకు సవివరంగా తెలియజెప్పాలి.

08/13/2019 - 18:31

మనదేశం భారతదేశం
భావితరాలకు ఆదర్శం

మనదేశం భారతదేశం
జాతీయ సమైక్యతా సందేశం

మనదేశం భారతదేశం
శాంతి సౌభాగ్య సౌభ్రాతృత్వం

మనదేశం భారతదేశం
అమర వీరుల త్యాగఫలం

మనదేశం భారతదేశం
త్రివర్ణ పతాక జైకేతనం
మనదేశం భారతదేశం
ప్రగతి భావాల మనోరంజకం

మనదేశం భారతదేశం
మన అందరికీ ఒక మహోదయం

మనదేశం భారతదేశం
మన జాతికి శుభోదయం

Pages