Others

పర్యావరణ రక్షణకై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అమ్మాయి వయస్సు పదహారు సంవత్సరాలు.. పేరు గ్రెటా.. పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలు మానేసి మరీ పోరాటానికి దిగింది. ఆమెకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్కూలు విద్యార్థులు పోరాటం చేపట్టారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమం సాగిస్తున్నారు. అలాంటి గ్రెటా థన్‌బర్గ్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఉద్వేగ భరితంగా మాట్లాడింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆధ్వర్యంలో ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే.. ఈ సదస్సులో ప్రపంచ నేతలు మాట్లాడటానికి ముందు గ్రెటా థన్‌బర్గ్ ప్రసంగించింది. ఈ ఉద్విగ్న ప్రసంగం మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ గ్రెటా మాట్లాడిన మాటలేంటంటే.. ‘ఈ రోజు నేను ఇక్కడ ఉండాల్సింది కాదు.. స్కూల్లో చదువుకోవాల్సింది. కానీ పరిస్థితులు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయి. మీరు (ప్రపంచ నేతలు) మా కలల్ని చిదిమేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఇదంతా తప్పు. మీకెంత ధైర్యం? వాతావరణ మార్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం పర్యావరణ వ్యవస్థే దెబ్బతింటోంది. ఇదే జరిగితే.. మా తరం తీవ్ర విపత్తును ఎదుర్కొంటుంది. అయినా మీరు మాత్రం డబ్బు, ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీకు మా ఆవేశం, ఆవేదనా అర్థం కాదా? అర్థం అవుతోందని మీరు చెబుతారు.. కానీ నిజంగా మా బాధ అర్థమైతే.. ఎందుకు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం లేదు. మీరు మమ్మల్ని ఎందుకు ప్రకృతి ముందు ఓడిపోయేలా చేస్తున్నారు? మీ వల్ల మా తరం తీవ్ర విపత్తు అంచున ఉంది. మీ మోసాన్ని కూడా మా యువతరం అర్థం చేసుకుంటోంది. భవిష్యత్తు తరాల కళ్లన్నీ మీపైనే ఉన్నాయి. మీరు ఇలాగే చేస్తే.. మేము ఓడిపోతాం. ఇదే జరిగితే.. మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేం.. అంటూ గ్రెటా థన్‌బర్గ్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ ఆవేదనను చూసైనా ప్రపంచ నేతల మనసు మారుతుందేమో వేచి చూద్దాం.