S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/11/2019 - 18:34

కార్తీక ‘పౌర్ణమి’ మహోత్సవాన..
దివ్యకాంతులు మిన్నంటేను
ఆనంద పారవశ్యాలు ‘ఎద’ నిండేను

కోటి దీపారాధనతో..
కోవెలలో ‘నవ్య’ కిరణాలు విరిసేను

పవిత్ర పూజలతో..
మోముల్లో ‘శాంతి’ క్రాంతులు కురిసేను

ఈ శుభ తరుణాన..
నింగి ‘తారక’లు ఇల వాలిన చందంగా
పండు ‘వెనె్నల’ వరించిన వైనంగా
పుడమి పులకరించు
భక్త హృదయాలు హర్షించు

11/10/2019 - 22:44

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఓ నానుడి. మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను, తాను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు, జీవం వున్న ప్రతి వ్యక్తికి అత్యవసరమైనది ఆహారం. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, రోగ నిరోధకశక్తిని కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు.

11/08/2019 - 18:29

ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. వేడుకకు ఎంత అందంగా తయారైనా.. జుట్టు నిర్జీవంగా ఉంటే అందం నీరుగారిపోతుంది. అందుకే ముందుగా జుట్టును జీవంగా, అందంగా, ఎలా చెబితే అలా వినేట్లు చేసుకోవాలి. అలాగని బ్యూటీపార్లర్ల చుట్టూ తిరగాలంటే సమయం, డబ్బూ రెండింటినీ ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇంట్లోంచి కదలకుండా, ఇంట్లోనే చేసుకోదగ్గ చిట్కాలతో అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

11/06/2019 - 19:17

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.

11/05/2019 - 18:41

ఇది శాకాహార యుగం. నాన్‌వెజ్ మానేసి చాలాకాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి. అయితే మాంసాహారం తినేవారు ఎక్కువ బలంగా ఉంటారని, శాకాహారులకు అన్నిరకాల ప్రోటీన్లు లభించవన్న వాదన మాత్రం వినిపిస్తూనే వుంది. నిజానికి ఏ ఆహారం తీసుకోవాలనేది ముఖ్యం కాదు. దాన్ని మనం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామనేది ప్రధానం. నిజానికి మాంసాహారులైనా శాకాహారం తీసుకోకుంటే అనారోగ్యం పాలవుతారనే విషయం చాలామందికి తెలియదు.

11/03/2019 - 22:18

సెల్‌ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతోంది. సెల్‌ఫోన్ నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుండి పిల్లల బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మెమరీ మందగిస్తున్నాయి. ఏకాగ్రత సన్నగిల్లుతోంది. ఆత్మవిశ్వాసం లోపించడంతోపాటుగా, కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది.

11/01/2019 - 18:44

రంగురంగుల సీతాకోకచిలుకల్లా అమ్మాయిలు ఇంట్లో హడావుడిగా తిరుగుతుంటే ఆ సందడే వేరు.. చిన్నారులు బుట్టబొమ్మల్లా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అదీ వారు ఫ్యాషన్-్ఫ్యషన్ డ్రెస్సుల్లో ముద్దుముద్దుగా ఉంటే ఆ ముచ్చటే వేరు. అలాంటి ఫ్యాషన్స్‌లో చెప్పుకోవాల్సింది స్కర్టుల గురించే.. తరాలు మారినా తరగని ట్రెండ్ దీని సొంతం. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో కనికట్టు చేస్తుంది.

10/31/2019 - 18:37

నేటి కాలుష్య జీవనంలో కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్ల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అవి పొడిబారి దురద, మంటతో పాటు కళ్ల కింద నల్లటి చారలు ఏర్పడతాయి. వివిధ రకాల అలర్జీల నుంచి కళ్లను కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ నియమాలను పాటించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో కూడా ఆయన వివరించారు.

10/29/2019 - 19:00

చలికాలం మొదలైంది. దానికి తోడు అప్పుడప్పుడూ వర్షాలు.. ఇలాంటి వాతావరణంలో ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తరచూ జలుబు.. అది కాస్త తగ్గుతుండగానే మళ్లీ జలుబు.. ఇలాంటి వాతావరణంలో ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. మనందరిలో కాస్త దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే.. అలా మందుల దుకాణానికి వెళ్లడం.. ఏదో ఒక యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటాం.

10/25/2019 - 18:38

తెలుగింట కళకళలాడే
తారాతోరణం దివ్య దీపావళి
రంగురంగుల బాణాసంచా సొగసులు
చిటపటలాడే టపాకాయల హంగామాలు

యువభావంలో నవరాగం పలికించిన
ప్రియమైన దీపావళి తెలుగింట ఆనందరవళి
మతాబుల షరాబులు తారాజువ్వల శరవేగాలు
నిజజీవితంలో నిలువుటద్దం దీపావళి

Pages