Others

చికాకుకి స్వస్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే.. కానీ కొద్దికాలానికే ఈ సమస్య మళ్లీ మొదలవుతుంది. ఇలా తరచూ ఇబ్బందిపెట్టే ఈ సమస్యను శాశ్వతంగా దూరం పెట్టడం ఎలా? అని చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువ. సాధారణంగా యోని మార్గం చుట్టూ ఎప్పుడూ బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా సంఖ్య రెట్టింపై అవి మూత్రకోశంలోకి చేరినప్పుడు మాత్రమే ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. మహిళల మూత్రద్వారం నుంచి మూత్రాశయాన్ని కలిపి మూత్రనాళం పొడవు కేవలం 1.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దాంతో మూత్రద్వారానికి సోకే బాక్టీరియా ఇట్టే మూత్రాశయంలోకి వెళ్లిపోతుంది. దాంతో మహిళలు త్వరగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు.
ఇన్‌ఫెక్షన్ మొదటిసారి వచ్చినప్పుడే కొన్ని రకాల పరీక్షలతోపాటు శారీరకంగా ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు వైద్యులు. ముఖ్యంగా మూత్రపిండాలు, మూత్రకోశం, మూత్రాశయం నుంచి మూత్రం వెళ్లే మార్గంలో సమస్యలున్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇందుకోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తారు. అంతేకాకుండా మూత్రపరీక్షతో పాటు బాక్టీరియా ఎంత పెరిగిందనేది తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేస్తారు. దీనితో పాటు శరీరంలో చక్కెర స్థాయిలు, మూత్రపిండాల పనితీరును కూడా చూస్తారు. అవసరాన్ని బట్టి మూత్రాశయానికి సంబంధించిన సిస్టోస్కోపీ పరీక్ష కూడా చేయించుకోమంటారు. చాలామంది ఇన్‌ఫెక్షన్‌ను చిన్న సమస్యగానే కొట్టేస్తారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు ఎదురౌతాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తరచుగా వస్తుంటే దాని ప్రభావం మూత్రపిండాలపై ఉంటుంది. ఇలాగే తరచూ జరిగితే అవి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు ఇన్‌ఫెక్షన్ల కారణంగా అధిక రక్తపోటు కూడా రావచ్చు. తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నప్పుడు మెనోపాజ్ తరువాత ‘అర్జ్ ఇన్‌కాంటినెన్స్’ అనే పరిస్థితి ఎదురుకావచ్చు. అంటే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగడం అన్నమాట. ఈ ఇన్‌ఫెక్షన్ల కారణమయ్యే బాక్టీరియా కొన్ని రకాల ఎంజైముల్ని విడుదల చేస్తుంది. వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. గర్భధారణకు ముందు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే గర్భం దాల్చాక తల్లికీ, బిడ్డకీ కొన్ని రకాల సమస్యలు తప్పవు. నెలలు నిండకుండానే కాన్పు కావడం, బిడ్డ ఎదుగుదలలో లోపాలు, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్లు వంటివి ఏర్పడతాయి. గర్భిణికి ఈ సమస్య ఉన్నట్లయితే తరచుగా మూత్రపరీక్షలు చేయించుకోమని సూచిస్తారు. ఇన్‌ఫెక్షన్ తగ్గిందా, పెరిగిందా అనేది అంచనా వేసి దాని ప్రకారమే మందులు వాడతారు.
జాగ్రత్తలు
* తరచూ బాత్‌రూముకు వెళ్లడం వల్ల మూత్రం నుంచి బాక్టీరియా బయటకు పోతుంది. ఇన్‌ఫెక్షన్ కూడా తగ్గుతుంది. అందుకని నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. తరచుగా మూత్రం రంగుని పరిశీలించుకోవాలి. మూత్రం పసుపు రంగు కాకుండా పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి గంటకోసారి మంచినీళ్లు తాగాలనే నియమం పెట్టుకోవాలి. భోజన సమయంలో మాత్రం రెండు గ్లాసుల నీళ్లను తాగాలి.
* వ్యక్తిగత శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బులు, యాంటీసెప్టిక్ క్రీములు, స్ప్రేలు, పౌడర్లు వంటివి జననేంద్రియ భాగాల్లో వాడకూడదు.
* లోదుస్తులు కాటన్‌వి ఎంచుకోవాలి. వాటిని రోజుకు రెండుసార్లు మార్చాలి.
* లోదుస్తుల్ని ఆరునెలల పాటు మాత్రమే వాడాలి. వాటిని పడేసి తరువాత కొత్తవాటిని కొనుక్కోవాలి.
* కలయిక సమయంలో బాక్టీరియా యోనిమార్గం నుంచి మూత్రాశయంలో చేరుతుంది. ఆ బాక్టీరియా అలా ఉండిపోతే ఇన్‌ఫెక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి కలయిక తరువాత మూత్ర విసర్జన చేయాలి. ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* మలబద్ధకం ఉంటే ఇన్‌ఫెక్షన్లు త్వరగా వస్తాయి. కొన్నిసార్లు పెరుగుతాయి కూడా.. కాబట్టి పీచుశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి.
* కొన్నిరకాల గర్భనిరోధకాల్లో స్పెర్మిసైడ్లు ఉంటాయి. ఇవి మేలుచేసే బాక్టీరియా సంఖ్యను తగ్గిస్తాయి. దాంతో హానిచేసే బాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక్షన్ తప్పదు. కాబట్టి స్పెర్మిసైడ్లు లేని గర్భనిరోధకాలను ఎంచుకోవాలి.
రోగనిరోధక శక్తి
సాధారణంగా శరీరంలో తగిన రోగనిరోధక శక్తి ఉంటే.. బాక్టీరియా రెట్టింపైనా పెద్ద సమస్య ఉండదు. ఆ శక్తి తగ్గినప్పుడే సమస్య వస్తుంది. కాబట్టి తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారు రోగనిరోధక శక్తిపైనా దృష్టిపెట్టాలి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. రోజూ కనీసం అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇలా వారానికి మూడు రోజులైనా చేయాలి. ముఖ్యంగా శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి.