Others

పొట్టకు చెక్ చెప్పండిలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులకు మరీ ముఖ్యంగా దక్షిణాదివారికి ఓ శాపం ఉంది! ఆచి తూచి తిన్నా 40 ఏళ్ళు దాటాయంటే పొట్ట వచ్చిపడుతుంది. వాకింగ్, ఎక్స్‌ర్‌సైజులు, యోగాలు చేసి నానా తంటాలు పడితే తప్ప ఆ పొట్ట కాస్తయినా తగ్గదు. ఉత్తరాదివారు ఎక్కువ గోధుమ రొట్టెలు తింటారు కాబట్టి ఊబకాయం సమస్య మనతో పోలిస్తే వారిలో కాస్త తక్కువే. మనం రైస్ అధికంగా తినడం, బిర్యానీలు, పప్పు్ధన్యాలు అధికంగా తినడం ఊబకాయం సమస్యకు కారణం అంటున్నారు నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే మనం తీసుకొనే ఆహారంతో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే తోసుకొచ్చే పొట్టను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం..
- చికెన్ ప్రియులు మసాలాలు దట్టించిన చికెన్‌నుకాస్త తగ్గించి, చేపలకు ఫిక్స్ అయిపోవాలి.
- ఆమ్లెట్‌లకు దూరంగా ఉండండి. ఉడికించిన కోడిగుడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
- పచ్చి బఠాణీ, పెసలు, మినుములు ఉడకపెట్టినవి తీసుకోవడం మంచిది.
- ఓట్స్ ఆధునిక కాలంలో పరమ ఔషధంగా మారింది. ఉదయానే్న ఓట్స్- పాలు తీసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా, ఓట్స్ మీల్స్ ఇలా ఆహారంలో ఓట్స్ ఎంత పెంచితే అంత మంచిది.
- పచ్చి కూరగాయలు కొవ్వును బాగా తగ్గిస్తాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, కీర, దోస.. పచ్చికూరలు తీసుకోండి.
- బార్లీ కొవ్వును బాగా కరిగిస్తుంది. బార్లీ జావ, బార్లీ నీళ్ళు ఊబకాయాన్ని దూరం చేస్తాయి.
- గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యానికి, నాజూకైన శరీరానికి ఎంతగానో పనికొస్తుంది. ఇప్పుడు గ్రీన్ టీ ప్యాకెట్లు కాస్త పెద్ద షాపులన్నిటిలో విక్రయిస్తున్నారు. ఉదయానే్న గ్రీన్ టీ తీసుకుంటే మీ శరీరం కొవ్వుకు దూరంగా ఉంటుంది.