Others

పండుగల్లో కళకళలాడుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. పండుగల కోలాహలం మొదలవుతుంది. బతుకమ్మ, దసరా, దీపావళి.. ఇలా వరుసగా పెద్ద పండుగలే.. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కళకళలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలో బతుకమ్మ, దసరా చాలా ముఖ్యమైన పండుగలు. ముఖ్యంగా తెలంగాణాకు మాత్రమే ప్రత్యేక పండుగ బతుకమ్మ. ఇది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ సొంత ఊర్లకు వెళ్లి సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ఊర్లో తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా, హాయిగా గడపాలని, ఆఫీసులకు సెలవులు పెట్టి, పిల్లల్ని తీసుకుని జామ్‌జామ్ అంటూ సొంతూర్లకు ఎగిరిపోతారు. సిటీలో మోడ్రన్ డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సులు అంటూ మెరిసిపోతారు కానీ పండుగరోజు మాత్రం సాంప్రదాయంగా ఆకట్టుకోవడానికి ఇష్టపడతారు చాలామంది అమ్మాయిలు, మహిళలు.
లంగా ఓణీ
పండుగల వేళ పరికిణీలో అమ్మాయిలు ఇంట్లో సందడి చేస్తుంటే.. చాలా అందంగా ఉంటుంది.ద ఇంటికి పండుగ కళ అమ్మాయిలే.. కాబట్టి.. మంచి కలర్ ఫుల్ లంగా ఓణీలను ఎంచుకుని.. అందంగా ముస్తాబు అవ్వాలి. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు పండుగ వేళ లంగా, ఓణీలు వేసుకుని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటే ఆ ముచ్చటే వేరు. ఇక సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు.
పట్టుచీరలు
దుస్తుల్లో ఆల్‌టైమ్ ఫేవరేట్ పట్టుచీరలే.. పండుగ, వివాహం.. ఇలా ఎలాంటి ప్రత్యేక సందర్భమైనా పట్టుచీరలు కట్టుకుంటే వచ్చే హుందాతనం, సాంప్రదాయ శోభ మరే దుస్తులతో రావు. అందుకే బతుకమ్మను ఆడేటప్పుడు మహిళలు కచ్చితంగా పట్టుసోయగంతో అలరారుతుంటారు.
జార్జెట్
చీర ఎంత ఖరీదైనా జాకెట్ బాగోలేకపోతే చీర అందమే పోతుంది. అందుకే జాకెట్ డిజైనింగ్ ఇప్పుడు ట్రెండీగా మారింది. చీర సింపుల్‌గా ఉన్నా.. జాకెట్ హెవీగా ఉంటే ట్రెండీ లుక్ వస్తుందని చాలామంది అమ్మాయిల భావన. అందుకే జర్దోసీ, కుందన్, ఎంబ్రాయిడరీ, పల్స్, బీడ్స్, స్టోన్స్, లేసులు.. ఇలా ఎన్నో రకాలుగా బ్లౌజ్ లుక్ మార్చేస్తున్నాయి. కాబట్టి చీర సింపుల్‌గా, ప్లెయిన్‌గా ఉన్నా.. బ్లౌజ్ హెవీ లుక్ ఇస్తే.. ఈ బతుకమ్మ, దసరాలకు మీరే స్పెషల్ లుక్.
గాగ్రా
దసరాలో ఆడే దాండియాకు గాగ్రాను మించింది ఏముంటుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల గాగ్రా డిజైన్లు ఉన్నాయి. వాటిలో వెల్వెట్ లుక్ వేరే. ఇది ట్రెండీగానే కాదు.. వేసుకున్న వారికి స్పెషల్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లకు ఈ వెల్వెట్ గాగ్రాలు వేసుకున్న వారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
లాంగ్ ఫ్రాక్
చాలామందికి చీరలు కట్టడం, సాంప్రదాయంగా ఉండటం ఇష్టంగానే ఉన్నా.. చీరలు కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చే డ్రెస్‌లు ఎంచుకోవాలి. అలాంటి జాబితాలోకి వచ్చేవే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌లు. కుచ్చులు, కుచ్చులుగా ఉండే.. ఈ డ్రెస్‌లు కొత్త లుక్‌ను తీసుకొస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే కాస్టూమ్ ఇది. డ్రెస్‌లతో పాటు జ్యువెలరీ కూడా పండుగల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
నగలు
పండుగ వేళ మరింత అందంగా కనిపించాలంటే బుట్ట కమ్మలను పెట్టుకోవాల్సిందే.. పండుగ వేళ సాంప్రదాయంగా కనిపించాలంటే.. నచ్చిన అందమైన దుస్తులతో పాటు, బుట్ట కమ్మలతో పాటు, ఒక చంద్రహారమో, కాసులపేరో వేసుకుంటే బతుకమ్మ ఆడితే పండుగ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు.