S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/27/2018 - 23:55

భగత్‌సింగ్ జయంతి సందర్భంగా.....

09/27/2018 - 00:34

జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపించిన హిందీ భాషకు తెలుగు రాష్ట్రాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 43.63 శాతం ఉంది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ అధికార భాష హిందీ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ముఖ్యంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ కనీస ఉత్తీర్ణత నూటికి 20 మార్కులుగా ఉంది.

09/26/2018 - 00:49

సంపద సృష్టించి పంచడం ఈనాటి విధానంగా మారింది. ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండు బిలియన్ డాలర్ల (రూ.14,200 కోట్లు)తో దాతృత్వ నిధిని ఏర్పాటు చేశాడు. దీనికి ‘బెజోస్ డేవన్ ఫండ్’గా నామకరణం చేశాడు. ఈ నిధి నుంచి నిలువ నీడ లేని వారికి ఇళ్లు, పేద పిల్లల ప్రీ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు ధనం ఖర్చుచేస్తారు. ఈ ప్రీ స్కూళ్లు మాంటిస్సోరి స్ఫూర్తితో పనిచేస్తాయని చెబుతున్నారు.

09/23/2018 - 01:25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్మిస్తున్న ‘అమరావతి’ నగరాన్ని నిజానికి రాజధాని అనకూడదు. రాష్ట్ర ముఖ్య పట్టణం అని మాత్రమే అనాలి. రాజధాని అంటే దిల్లీ నగరం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే ‘రాజధాని అమరావతి’ అంటూ తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన ఖర్చు ప్రారంభించింది. దాదాపు 30 వేల పైచిలుకు ఎకరాల పంట భూములను సేకరించింది. ఏపీలో ఎక్కడా పెద్ద పట్టణం లేదా?

09/20/2018 - 01:45

ఒక జాతి బాగుపడాలంటే ప్రజలందరూ విద్యావంతులు కావాలని చెబుతారు. విద్య అంటే ఏమిటి? చదవడం, రాయడం నేర్పడమేనా? కేవలం ఇదే కాదు. సంస్కారం, విలువలు కూడా అవసరం. నేటితరం పిల్లలు సంస్కార రహితమైన విద్యను యాంత్రికంగా అభ్యసిస్తున్నారు. ఇది పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు మాత్రమే పనికివచ్చేదిగా తయారైంది. విశ్వవిద్యాలయాలలో కూడా జ్ఞానార్జనకి పనికివచ్చే చదువుకరవైంది.

09/19/2018 - 01:07

ఈ ఏడాది ఆగస్టులో పది లక్షల మంది ప్రజల సమక్షంలో కొత్త పార్టీని ప్రకటిస్తానని, మేనిఫెస్టోను ఆవిష్కరిస్తానని గాయకుడు గద్దర్ రెండున్నర నెలల క్రితం గొప్పగా ప్రకటించాడు. పార్టీ ఆవిర్భావ సభ జాడ లేదు, ఈ జాప్యంపై వివరణ కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి, కొత్త పార్టీతో ప్రజల్లోకి వస్తానన్న గద్దర్ మాటకు ఇక ‘విశ్వసనీయత’ ఉందా?

09/16/2018 - 00:11

జాతీయోద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న కాలంలో ఆనాటి పాలకుల భాషయైన ఇంగ్లీషు కాకుండా భారతీయులలో జాతీయ స్ఫూర్తిని రగిలించగలిగే ఒక ప్రభావశీలమైన దేశీయ భాష అవసరం ఏర్పడింది. రాజకీయ, సాంఘిక అవసరాల రీత్యా దేశవ్యాప్తంగా ఒక సమైక్య భాష ఆవశ్యకత కలిగింది. 130కి పైగా భాషలు వ్యవహారంలో ఉన్న ఇంత పెద్ద దేశానికి జాతీయ భాషగా హిందీ అయితే అనుకూలంగా ఉంటుందని అప్పటి నేతలు భావించారు.

09/15/2018 - 00:10

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే.. అక్కడ సాంకేతికపరమైన ఇంజనీరింగ్ రంగం పటుత్వంగా ఉండాలి. ప్రపంచంలో గొప్ప ఇంజనీర్‌గా పేరుప్రతిష్ఠలు సాధించి మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య.

09/13/2018 - 00:01

వినాయక చవితి సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన భారతదేశ యాత్ర చెయ్యడానికి మూషిక వాహనంపై కైలాసం వీడాడు గణపతి. ‘అక్కడి విషయాలేమిటి?’- అంటూ ముందుగానే నందిని వాకబు చేశాడు గణేశుడు. ‘మీరు అక్కడి పరిణామాలను సరిగ్గా గమనించడం లేదని నా అనుమానం.. ఏదీ మూడు ప్రశ్నలడుగుతాను.. జవాబులు చెప్పండి..’ అన్నాడు నంది.

09/11/2018 - 23:57

భారత రాజకీయ యవనికపై తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ఘట్టం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల ప్రజా పోరాటం ఫలితంగా, ముఖ్యంగా మలిదశ ఉద్యమం పదునాలుగు సంవత్సరాల పాటు కొనసాగి పరాకాష్ఠకు చేరడంతో నాలుగేళ్ల క్రితం నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ పోరాటంలో అనె్నం పునె్నం తెలియని ఎంతోమంది యువకులు, విద్యార్థులు ఆత్మత్యాగాలు చేశారు.

Pages