S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/09/2018 - 00:09

వాతావరణంలో మార్పులకు వెనుకబడిన దేశాలే కాదు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే గాక, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా వాతావరణ మార్పులు ఛిన్నాభిన్నం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ బీమా సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ‘పర్యావరణపరమైన రక్షణ లేని’ భౌగోళిక వనరుల పట్ల నిరాసక్తత చూపుతున్నాయా?

09/08/2018 - 00:12

భారత రాజ్యాంగానికి ‘నాలుగో స్తంభం’గా పిలువబడుతున్న మీడియా తన సామాజిక బాధ్యతల నుండి ఎప్పుడో దూరం జరిగినట్లు అనిపిస్తోంది. వార్తను వార్తలా కాకుండా, ఏ మాత్రం ప్రాధాన్యతలేని అంశాన్ని ఉదయం నుండి రాత్రి దాకా ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట ప్రేక్షకుల సహనాన్ని ఎలక్ట్రానిక్ మీడియా పరీక్షిస్తోంది.

09/05/2018 - 02:51

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఏటా ‘ఉపాధ్యాయ దినోత్సవం’ పాటించడం మన దేశంలో ఆనవాయితీ. ఈ ఆనవాయితీ 1962లో మొదలైంది. ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమైన తన జీవన యానంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాష్టప్రతిగా అత్యున్నత పదవిని నిర్వహించారు.

09/02/2018 - 00:21

‘మాది సాధువుల మఠం కాదు రాజకీయ పార్టీ.. బాజాప్తా రాజకీయమే చేస్తాం..’-అని తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో అనేక సార్లు ప్రకటించారు. ప్రత్యర్థులెవరైనా తనను విమర్శిస్తే- ‘మీరు రాజకీయం చేస్తున్నారు..’ అని అనడం తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటు. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా- రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు.

09/01/2018 - 00:34

జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు జో రందుకోవడంతో దేశంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాగలరా? లేదా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన ప్రశ్న. భాజపాలోని మరొకరు ఆ పదవి లోకి వస్తారా? ప్రతిపక్ష నేత మరెవరైనా వస్తారా? అన్నది రెండో ప్రశ్న. తిరిగి లోక్ సభలో సొంతంగా భాజపా ఆధిక్యతను సంపాదించుకుంటే మోదీ మరోసారి ప్రధాని కావడం తథ్యం.

08/31/2018 - 00:32

విభిన్నంగా ఆలోచించే వర్తమాన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ముం దు వరసలో నిలుస్తారు. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రిగా కావచ్చు, పార్టీని శాసించే అధ్యక్షుడిగా కావచ్చు. ఆయనది ఒక విలక్షణ శైలి.

08/29/2018 - 00:31

తెలుగు వాడుక భాష వ్యాప్తి కోసం అలనాడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయం. వాడుక భాషోద్యమ పితామహుడిగా, సంఘ సంస్కర్తగా చెరగని ముద్ర వేసిన ఆయన జన్మదినాన్ని (ఆగస్టు 29) ఏటా ‘తెలుగు భాషా దినోత్సవం’గా పాటిస్తున్నాము. గ్రాంథిక భాషతో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, వ్యవహారిక భాషలోని అందాన్ని, వెసులుబాటును లోకానికి తెలియచెప్పిన మహనీయుడు ‘గిడుగు’.

08/26/2018 - 03:40

ఈమధ్య జాతీయ మాధ్యమాలలో ‘మూకదాడి’ (లించింగ్)పై చర్చ జరుగుతోన్నది. చర్చలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశే్లషకులు, మేధావులు పాల్గొంటున్నారు. కాని సమాజంలో జరుగుతున్న లించింగ్‌కు గల కారణాలను అనే్వషించి నిరోధించుటకు ప్రయత్నం చేయటాన్ని విస్మరించి కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు మాటల దాడులతోటే చర్చలను ముగిస్తున్నారు.

08/25/2018 - 00:21

చైనాను ఆదర్శంగా చూపిస్తూ, యాభై ఏళ్ల క్రితం నక్సల్‌బరీ ఉద్యమాన్ని ప్రారంభించారు కొందరు కమ్యూనిస్టులు. అనంతరం వారే నక్సలైట్లయ్యారు, ఆ తర్వాత మావోయిస్టులయ్యారు. అప్పుడు ఏ చైనానైతే ఆదర్శంగా చూపారో అదే చైనా ఇప్పుడు వారి అంచనాలకు మించిపోయింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థికశక్తిగా ఎదిగింది. అనూహ్యంగా దూసుకుపోతోంది. రెండంకెల వృద్ధిరేటును సాధిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.

08/23/2018 - 21:08

ఆగస్టు 23వ తేదీ తెలుగుజాతికి పర్వదినం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తెలుగు తేజం’ టంగుటూరి ప్రకాశం పంతులు 1872లో ఇదే రోజున జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, గాంధీజీ ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు అమలు పరిచిన ప్రజానేతగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

Pages