S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/09/2016 - 06:12

విశాఖపట్నం, మార్చి 8: రెండు సంస్థల మధ్య కాంట్రాక్టు రెన్యూవల్, డిపాజిట్ల వివాదం జఠిలం కావడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలోని పట్టణాల్లో మీ-సేవ కేంద్రాలు మూతబడ్డాయి. ఫలితంగా పౌరసేవల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మీ-సేవ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు.

03/09/2016 - 04:43

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఫిలిప్ సి తోచర్ నియమితులయ్యారు. గుంటూరుకు చెందిన ఫిలిప్ సి తోచర్‌ను నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా తోచర్ గుంటూరు జిల్లా కన్నవారితోటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులుగా ఎవరినీ నామినేట్ చేయలేదు.

03/09/2016 - 02:31

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ఆరో ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వసిద్ధం చేశారు. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ నెల 10న గురువారం సాయంత్రం 4గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

03/09/2016 - 02:27

హైదరాబాద: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం నాడు శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను ఎద్దేవా చేస్తూ విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. మహిళాదినోత్సవం అని చూడకుండా అబద్దాలు చెబుతున్నారని సిఎం ముందు తన మనసును రిపేరు చేసుకోవాలని , తర్వాత పార్టీని, వ్యవస్థను రిపేరు చేయడం మొదలుపెట్టాలని పేర్కొన్నారు.

03/09/2016 - 00:49

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభ్యున్నతికి, ఆరోగ్యానికి, ఆర్ధిక స్వావలంబనకు, వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అనేక కొత్త పథకాలను, నిర్ణయాలను ప్రకటించారు. శాసనసభలో ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేశారు.

03/09/2016 - 00:46

కర్నూలు: రాష్ట్ర పొదుపుమహిళలు ప్రపంచానికే ఆదర్శమని, డ్వాకా సంఘాల సభ్యులు కూడా త్వరలో చరిత్రను తిరగ రాయనున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం కర్నూలులోని ఎన్‌టిఆర్ అవుట్‌డోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు విద్యతో ఆడప్లిల్లకు ఆర్థిక భద్రత, సమాజంలో గౌరవం లభిస్తాయన్నారు.

03/09/2016 - 00:40

హైదరాబాద్ : బుధవారం ఏర్పడుతున్న సూర్యగ్రహణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్‌లో ఈ గ్రహణం పాక్షికంగానే కనిపిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం సంపూర్ణసూర్యగ్రహణం స్థాయిలోనే ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం విడుస్తుంది.

03/09/2016 - 00:27

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలో మంగళవారం సాయంత్రం జరిగిన బాలచాముండికా అమరేశ్వరస్వామివార్ల దివ్య రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం ప్రారంభమైన 20 నిముషాల్లోపే తోపులాట జరగడంతో కొంతమంది రథ చక్రాల కిందపడ్డారు. గాయ పడ్డవారిలో కోట మురళి మృతి చెందాడు.

03/08/2016 - 18:38

హైదరాబాద్: తెలుగుదేశం పాలనలో మహిళలకు భద్రత కరవైందని, ఇందుకు ఎన్నో సంఘటనలు రుజువులుగా ఉన్నాయని విపక్షనేత వైఎస్ జగన్ మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కృష్ణాజిల్లాలో ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చినా నిందితులైన ఎమ్మెల్యేపైన, ఆయన అనుచరులపైన ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు.

03/08/2016 - 18:37

హైదరాబాద్: మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇటీవల ఓ సినిమా ఆడియో ఆవిష్కరణ సభలో మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివదాం సృష్టించిన సంగతి తెలిసిందే.

Pages