ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా తోచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యేగా ఫిలిప్ సి తోచర్ నియమితులయ్యారు. గుంటూరుకు చెందిన ఫిలిప్ సి తోచర్‌ను నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా తోచర్ గుంటూరు జిల్లా కన్నవారితోటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులుగా ఎవరినీ నామినేట్ చేయలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత మంగళవారం నాడు తోచర్ నియామకం జరిగింది.


తప్పు చేస్తే శిక్ష తప్పదు
కుమారుడి వ్యవహారంపై
ఏపి మంత్రి రావెల వ్యాఖ్య
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: మహిళను వేధించిన కేసులో తన కుమారుడు తప్పు చేసినట్టు తేలితే శిక్ష తప్పదని ఏపి మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి రావెల స్పందించారు. తన కుమారుడిపై కేసు నమోదు అయినట్టు తెలియగానే తానే స్వయంగా అతడిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో అప్పగించానన్నారు. ఆరోపణలు చేసిన స్ర్తి కూడా తనకు కుమార్తె వంటిదని అన్నారు. ఆనాడు పరిటాల హత్య కేసులో అప్పటి సిఎం తన కుమారుడిని వెనుకేసుకు వచ్చారని, కేసులో నుండి ఆయన పేరు తొలగించారని పేర్కొన్నారు.

నా మాటలను ఎంజాయ్ చేశారు!

అభిమానులెవరూ తప్పుపట్టలేదు మహిళలంటే ఎనలేని గౌరవం అసెంబ్లీలో బాలకృష్ణ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 8: మహిళలు అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం నాడు విపక్షనేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ ‘సావిత్రి’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో తానన్న మాటలను అక్కడ ఉన్న వారంతా ఎంజాయ్ చేశారని, వారిలో సగం మంది ఆడవాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లెవరూ తనను తప్పుపట్టలేదని, అసెంబ్లీలో కాకుండా బయట ఎవరిని అడిగినా ఆ విషయం చెబుతారని అన్నారు. మహిళలంటే తనకు గౌరవం ఉందని, మహిళలను జీవితంలో ఉద్ధరించడం, మహిళా యూనివర్శిటీని ఏర్పాటు చేయడం వంటివి జరుగుతున్నాయని, మహిళలకు ఏ సినిమాల్లో లేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత తన సినిమాల్లో ఉంటుందని అన్నారు. సినిమాల్లో తన పాత్ర గురించి జనం ఏం కోరుకుంటున్నారో ఆడియో ఫంక్షన్‌లో చెప్పానని, అక్కడ రెండు రకాలుగా మాట్లాడానని చెప్పారు. నా నుండి అభిమానులు ఏం ఆశిస్తారో, తన గురించి ఏం కోరుకుంటారో దాని గురించే తాను మాట్లాడానని అన్నారు. ఇదే సందర్భంగా సినిమా నేపథ్యం గురించి చెబుతూ తాను అన్న మాటలను అక్కడ ఉన్న వారందరూ ఎంజాయి చేశారని అన్నారు. బయట ఎవరి అభిప్రాయం అయినా తీసుకోండి దాన్ని వాళ్లు ఎలా తీసుకున్నారో ...ఎలా అర్ధమైందో...అంటూ ముగించారు.