S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/08/2016 - 07:40

హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. సోమవారం శివుడికి ప్రీతిపాతమైన రోజు. ఈ రోజు సాధారణంగా శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం శివరాత్రి సోమవారం రావడంతో ఉభయ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. అన్ని ప్రధాన క్షేత్రాల్లో ‘ఓం నమఃశివాయ’ అంటూ భక్తులు శివుడి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

03/08/2016 - 05:55

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం పున:ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో బడ్జెట్ సమావేశాలు వాడి,వేడిగా జరగనున్నాయని అధికార, విపక్ష సభ్యుల ధోరణి చూస్తే స్పష్టమవుతోంది. శాసనసభ రణరంగాన్ని తలపించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార,విపక్ష సభ్యులు మాటల కత్తులు దూస్తున్న తీరు చూస్తుంటే బాహాబాహీ తథ్యమనేది సుస్పష్టం.

03/08/2016 - 04:05

విజయవాడ: మహిళాభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేస్తున్న ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళాభ్యున్నతికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందంటూ సంక్షేమ పథకాల్లో మహిళలకే అగ్ర ప్రాధాన్యత ఇవ్వనున్నామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

03/08/2016 - 04:03

శ్రీశైలం నుంచి కీసర వరకూ తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారమే ఈ సారి శివరాత్రి కావడంతో శివాలయాలన్నీ భక్తుల తాకిడితో పోటెత్తాయి. పుణ్యస్నానాలాచరించి లక్షలాదిగా గుళ్లకు తరలివచ్చిన భక్తులు ‘శంభో శంకర..’అంటూ మహాశివుడ్ని పూజించారు.

03/08/2016 - 03:54

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల నెలసరి అద్దెను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌లో ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ఏపీ ప్రభుత్వ భవనాల అద్దెను పెంచలేదు.

03/07/2016 - 17:58

విజయవాడ: పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక్కడి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్వహించిన ఎంట్రన్ ఫలితాలను ఎపి వైద్య,ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఎపి,తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 13,252 మంది ఎంట్రన్స్ రాయగా 8,658 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,533 పీజీ సీట్ల కోసం ఎంట్రన్స్ నిర్వహించారు.

03/07/2016 - 16:34

హైదరాబాద్: మగాళ్లు సైతం తల దించుకునేలా వైకాపా ఎమ్మెల్యే రోజా బజారు భాషలో తిట్లదండకం విప్పుతూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నందున ఆమెపై పోలీసులు వెంటనే రౌడీషీట్ తెరవాలని టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రోజాకు మహిళలే తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

03/07/2016 - 16:34

హైదరాబాద్: కాపుల డిమాండ్లపై ఈ నెల 10లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే 11వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించడంతో ఎపీ పోలీసులు అప్రమతమయ్యారు. డిజిపి జెవి రాముడు సోమవారం పోలీసు శాఖ అధికారులతో సమావేశమై ముద్రగడ దీక్ష ప్రారంభిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయమై ఆరా తీశారు.

03/07/2016 - 16:33

హైదరాబాద్: ఓ సినిమా ఫంక్షన్‌లో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు టిడిపి ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం నేతలకు మహిళలను గౌరవించడం తెలియదన్నారు. ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ఓ మైనారిటీ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వల్లే పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.

03/07/2016 - 16:32

రాజమండ్రి: వైకాపా తరఫున రాజ్యసభ సీటు పొందాలన్న తపనతో వైఎస్ జగన్ చెప్పినట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం టిడిపి సర్కారుపై విమర్శలు చేస్తున్నారని ఎపి కాపు ఆర్థిక సహాయ సంస్థ చైర్మన్ రామాంజనేయులు ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, కాపుల కోసం సిఎం చంద్రబాబు పలు చర్యలు తీసుకుంటున్న సమయంలో ముద్రగడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

Pages