ఆంధ్రప్రదేశ్‌

రేపే నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ఆరో ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వసిద్ధం చేశారు. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ నెల 10న గురువారం సాయంత్రం 4గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే పిఎస్‌ఎల్‌వి-సి 32 వాహక నౌక ద్వారా 1425కిలోల బరువుగల భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహాన్ని (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్) నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశ అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందించారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని నాలుగో దశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం మధ్యాహ్ననికి పూర్తి చేశారు. అనంతరం నైట్రోజన్ హీలియం గ్యాస్‌ను నింపే ప్రక్రియను కూడా పూర్తిచేశారు.