S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/13/2016 - 04:45

హైదరాబాద్, మార్చి 12: సింగర్ మధుప్రియ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను భర్త శ్రీకాంత్ కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ హుమయూన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

03/13/2016 - 04:44

విద్యార్థులకు నష్టమని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

03/13/2016 - 04:43

మంత్రులు ఈటల, జోగురామన్నలకు
బిసి సబ్‌ప్లాన్ సాధన కమిటీ వినతి

03/12/2016 - 17:51

హైదరాబాద్: వనస్థలిపురం పనామా గోడౌన్స్ వద్ద శనివారం దంపతులు వెళుతున్న ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో భార్య మరణించగా, తీవ్రగాయాలతో భర్త ఆస్పత్రి పాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

03/12/2016 - 17:04

హైదరాబాద్: ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేసేందుకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14కు శనివారం ఉదయం వెళ్లిన జిహెచ్‌ఎంసి అధికారులపై దాడి చేసిన హకీం, ఖయ్యూం అనే నిందితులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తమపై దాడి జరిగిందని అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

03/12/2016 - 17:03

హైదరాబాద్: బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి కాంగ్రెస్ హయాంలో సమైక్య పాలకులు తెలంగాణకు నీటివాటా దక్కకుండా చేశారని సిఎం కెసిఆర్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఖండించారు. కృష్ణా, గోదావరి జలాల్లో నీటివాటాను కేటాయిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు.

03/12/2016 - 17:02

హైదరాబాద్: గోదావరి నదిపై అయిదు జలాశయాల నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శనివారం మీడియాతో అన్నారు. ఆ ఒప్పందాల వల్ల మహారాష్టక్రే మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ నీటి ప్రాజెక్టులు చాలావరకూ పూర్తయ్యాయన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక నీటి పారుదల రంగం అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.

03/12/2016 - 17:02

వరంగల్: భర్త మరణానంతరం ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై సరిత అనే హోంగార్డు వరంగల్‌లో శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేసేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

03/12/2016 - 17:01

హైదరాబాద్: పాతబస్తీలోని హుస్సేనీఆలం ప్రాంతంలో శనివారం రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. దీన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో చేరుకున్నారు.

03/12/2016 - 16:59

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం స్పందించాలని అసెంబ్లీలో బిజెపి పక్ష నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం శాసనసభలో మాట్లాడుతూ, ఖరీఫ్‌లోనైనా రైతులకు రుణమాఫీని వర్తింపజేయాలని, రైతులకు అన్ని విధాలుగా రాయితీలు ఇవ్వాలని కోరారు.

Pages