S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/18/2016 - 18:55

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, సభ్యుల తీరుపై శాసనసభ విలువల కమిటీ సమగ్రంగా చెర్చించింది. నాలుగు గంటలపాటు జరిగిన ఆ సమావేశంలో పలువురు నాయకులు సూచనలు చేశారు. ఇదే సమయంలో ఆస్తి, అప్పుల వివరాలు అందించిన 40 మంది సభ్యుల జాబితాను వివరాలను విడుదల చేశారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ ముగింపు సందేశమిచ్చారు. అసెంబ్లీ హాలులో జరిగిన సమావేశానికి ఉప సభాపతి బుద్దప్రసాద్ హాజరయ్యారు.

01/18/2016 - 16:44

హైదరాబాద్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సహకరిస్తామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ఎరువుల కర్మాగారంపై సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ఎరువుల సంస్థ అధికారులు హాజరయ్యారు. 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామని, ఈ కర్మాగారం పునరుద్ధరణ వల్ల 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు.

01/18/2016 - 16:39

హైదరాబాద్ : రాయదుర్గం స్మశానవాటికలో సిక్కీం మాజీ గవర్నర్ రామారావు అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,బండారు దత్తాత్రేయ, బాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బాజపా జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు హాజరయ్యారు.

01/18/2016 - 14:04

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది.

01/18/2016 - 13:48

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హయాం నుంచే వెనుకబడిన వర్గాలు, మహిళలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

01/18/2016 - 13:23

కర్నూలు : కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్సు స్టేజి వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

01/18/2016 - 13:10

గుంటూరు: నరసారావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఈ రోజు ఉదయం నరసారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీనివాసరెడ్డి ధర్నా చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

01/18/2016 - 13:03

హైదరాబాద్‌: తెలుగువారికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన కుమార్తె, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్న వంతెన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఈరోజు ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

01/18/2016 - 13:01

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హచ్‌సీయూ)లో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపారు. ఆస్పత్రి దగ్గరకు వచ్చిన దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

01/18/2016 - 12:53

హైదరాబాద్‌: ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ అభిమానులకు ఆయన తనయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

Pages