S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/19/2016 - 16:10

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ తల్లిని, కుటుంబ సభ్యులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారంనాడు పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

01/19/2016 - 16:09

హైదరాబాద్ :సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై విచారణ జరిపేందుకు కేంద్రబృందం ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ బృందం సభ్యులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. మరో వైపు సెంట్రల్ యూనివర్శిటీకి విద్యార్థిసంఘాలు, మానవ హక్కుల సంఘాలు పోటెత్తటంతో ఉద్రక్తిత కొనసాగుతోంది.

01/19/2016 - 14:11

హైదరాబాద్ : హెచ్‌సీయూలో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి రాహుల్ నివాళులర్పించారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య వివరాలను తెలుసుకున్నారు. రాహుల్ రాకతో హెచ్‌సీయూ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

01/19/2016 - 13:20

ఢిల్లీ: బాలీవుడ్‌ చిత్రం ‘బాజీరావు మస్తానీ’కి పన్ను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల వీక్షించారు. అఖిలేష్‌ని ఎంతగానో ఆకట్టుకుందట. దీంతో చిత్రానికి పన్ను ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

01/19/2016 - 13:09

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్శిటీ వీసీని పదవి నుంచి తప్పించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండారు ఇచ్చిన లేఖ వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తుంచుకోవాలని, దీన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని ఒవైసీ అన్నారు.

01/19/2016 - 04:50

సూళ్లూరుపేట, జనవరి 18: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత ఐదో క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.31 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-31 రాకెట్ నింగిలోకి పంపనున్నారు.

01/19/2016 - 04:02

వెల్దుర్తి, జనవరి 18: కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బస్‌స్టేషన్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

01/19/2016 - 04:00

విజయవాడ, జనవరి 18: తెలుగుదేశం పార్టీ కుటుంబం వంటిదని, కార్యకర్తలందరినీ కుటుంబ సభ్యుల్లానే తాను మొదటి నుంచి భావిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తాను నిరంతరం పాటుపడతానని చెప్పారు.

01/19/2016 - 03:42

రాజమహేంద్రవరం, జనవరి 18: గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై జస్టిస్ సివై సోమయాజులు ఏక సభ్య కమిషన్ సోమవారం ఇక్కడ న్యాయ విచారణ మొదలెట్టింది.

01/19/2016 - 03:35

హైదరాబాద్, జనవరి 18: విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ మరింత ఉత్సాహంతో ఈసారి అంతర్జాతీయ వేదికపై కీర్తిపతాక ఎగరేసేందుకు సంసిద్ధమైంది. సిఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధి బృందం దావోస్ బయలుదేరివెళ్తోంది.

Pages