S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/20/2016 - 06:27

విజయవాడ, జనవరి 19: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశంపై ప్రభుత్వ, శాసనసభ, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కెఎల్ యూనివర్సిటీని మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు.

01/20/2016 - 06:20

విజయవాడ, జనవరి 19: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణీకుల రద్దీతో ఎపిఎస్‌ఆర్‌టిసికి లాభాల పంట పండింది. రద్దీ రోజుల్లో రోజుకు సగటున రూ.12 కోట్లు ఆదాయం సాధించింది. పండగ రద్దీ దృష్ట్యా 2500 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి రెగ్యులర్ బస్సులతో పాటు ఈ ప్రత్యేక బస్సులు తిరిగాయి. పండగ సమయంలో ఇప్పటివరకు 5 లక్షల 50 వేల మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చారు.

01/20/2016 - 06:19

విశాఖపట్నం, జనవరి 19: భారత దేశ రక్షణపటంలో ఇక విశాఖది నిరుపమానస్థానమే. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అంకురించనున్న అనేక రక్షణ ప్రాజెక్టులు విశాఖకు వ్యూహాత్మక ప్రాధాన్యత కల్పించబోతున్నాయి. నౌకాశక్తికి తిరుగులేనికోటగా, రక్షణ పాటవానికి మేటిగా విశాఖ విరాజిల్లనుంది. ఇప్పటికే దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్ఠ పరిచేందుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది.

01/19/2016 - 18:21

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తంగా దాఖలైన 4,039 నామినేషన్లలో 3,850 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. మిగిలిన 189 నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలన ప్రక్రియ అనంతరం తెరాస-839, భాజపా-426, తెదేపా-658, కాంగ్రెస్‌-659 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 వరకు గడువు ఉంది.

01/19/2016 - 18:18

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం హైదర్ గూడలో బట్టలు కొనుగోలు చేశారు. హైదర్ గూడలోని సాయిఖాదీ భండార్ లో ఆయన వస్త్రాలు కొనుగోలు చేసి... కుట్టేందుకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తాను 1990 నుంచి అదే షాపులో బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా షాపింగ్ చేశారు.

01/19/2016 - 18:17

హైదరాబాద్: రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంలో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో , వరంగల్ జిల్లా హన్మకొండలో మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల చిరు జల్లులు పడ్డాయి.

01/19/2016 - 18:15

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. యలమంచిలి రాము, భవానీ శంకర్‌, దూడల రాజేశ్‌లకు విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

01/19/2016 - 16:29

హైదరాబాద్: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను ఇవాళ న్యాయమూర్తి ఉపసంహరించుకున్నారు. ధోనీ న్యాయవాది విజ్ఞప్తి మేరకు గతంలో కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.

01/19/2016 - 16:23

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్ సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది.

01/19/2016 - 16:11

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలిచివేసిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారంనాడు రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోహిత్ ఆత్యహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వీసీ పరామర్శించాలని అవసరం లేదా అని ప్రశ్నించారు. వీసీని తప్పించాలని డిమాండ్ చేశారు.

Pages