రాష్ట్రీయం

తెదేపాది త్రిపాత్రాభినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: తెలుగుదేశం పార్టీ కుటుంబం వంటిదని, కార్యకర్తలందరినీ కుటుంబ సభ్యుల్లానే తాను మొదటి నుంచి భావిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తాను నిరంతరం పాటుపడతానని చెప్పారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎ కనె్వన్షన్‌లో 200మంది కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం త్రిపాత్రాభినయనం చేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షంగా, తెలంగాణలో ప్రతిపక్షంగా, కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతోందన్నారు. అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ పట్టుదలతో శ్రమిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన నివాళి అర్పించారు. అవినీతిని సహించలేకనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నై వెళ్లి కఠోర శ్రమతో సినీహీరోగా విరాజిల్లారన్నారు. అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు. బిసిలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపి కేశినేని నాని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, శాప్ డైరెక్టర్ బండారు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న సిఎం చంద్రబాబు