S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/05/2016 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 4:కార్బైడ్‌తో కృత్రిమంగా మగ్గబెట్టడంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టేవారిపై ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది.

04/05/2016 - 13:48

విజయవాడ, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని టెక్ మహీంద్ర సిఇఓ సిపి గుర్నానీ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడలో సోమవారం కలిసిన ఆయన రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.

04/05/2016 - 01:11

విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వే జరిపించారు. ఆయా మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, ఆక్రమణలతో పాటు వీధికుక్కల లెక్కల వివరాలను ఆయన సేకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన 11 నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ భేటీ అయ్యారు.

04/05/2016 - 01:07

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఆవిర్భవించిన స్వల్ప వ్యవధిలోనే ఐటీ రంగంలో అద్వితీయ పురోగతితో ముందుకెళ్తోందని ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల ప్రముఖులు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో, ఐటీ ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉందన్నారు.

04/03/2016 - 11:35

అనంతపురం, ఏప్రిల్ 2: రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిస్తూ కరవుసీమకు కల్పతరువుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు కింద సాగు చేసే ఆయకట్టు నానాటికీ తగ్గిపోతోంది. దీంతో రాయలసీమ లోని జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ప్రతిఏటా చేస్తున్న నీటి కేటాయింపుల్లో అత్యధిక శాతం వాటా తాగునీటికే పరిమితమవుతోంది.

04/03/2016 - 11:33

కాకినాడ, ఏప్రిల్ 2: తెలుగుదేశంలోకి మరో 15 మంది వైసిపి ఎమ్మెల్యేలు చేరనున్నారని, వారిలో సినీ నటి, ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఉన్నా ఆశ్చర్యం చెందాల్సిన పనిలేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. శనివారం ఎస్సీ రుణాలపై అవగాహన సదస్సులో పాల్గొనడానికి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

04/03/2016 - 11:32

నెల్లూరు, ఏప్రిల్ 2: నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్ వై.కె.నందకిషోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు నెల్లూరులోని ఆయన స్వగృహంతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఆయన సంబంధీకులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

04/03/2016 - 11:25

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోనున్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకోడానికి ఆర్థిక చేయూత నందించాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం నాడిక్కడ తన కార్యాలయాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందాన్ని కోరారు.

04/03/2016 - 11:24

కడప, ఏప్రిల్ 2: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పుష్కలంగా సాగు, తాగునీరందించడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపడుతున్నారు. తాజాగా కడప జిల్లాలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు రూ.553కోట్లు మంజూరు చేశారు.

04/03/2016 - 02:35

విజయవాడ, ఏప్రిల్ 2: తెలుగువారు విదేశీ విద్య కోసం అర్రులు చాస్తుంటే ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్ఠాకరమైన ప్రముఖ 16 విదేశీ విశ్వవిద్యాలయాలు.. పైగా భారీగా స్కాలర్‌షిప్‌లతో అడ్మిషన్ ఇస్తామంటూ ఓ విజయవాడ ముద్దుబిడ్డకు ఆఫర్‌లపై ఆఫర్‌లు ప్రకటించింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల మామిడి సాయి ఆకాష్ హైదరాబాద్‌లో ఫిట్జీ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఇంజనీరింగ్ కోర్సు యుఎస్‌లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు.

Pages