రాష్ట్రీయం

సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 2: నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సబ్ రిజిస్ట్రార్ వై.కె.నందకిషోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు నెల్లూరులోని ఆయన స్వగృహంతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఆయన సంబంధీకులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో తిరుపతి, చంద్రగిరి, హైదరాబాద్, కావలి, బెంగళూరు, గన్నవరం తదితర 12 ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వరకూ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఇప్పటిదాకా సుమారు రూ 2.5 కోట్ల మేర అధికంగా ఆస్తులు గుర్తించామని నెల్లూరు ఏసీబీ డిఎస్పీ తోట ప్రభాకర్ తెలిపారు. చంద్రగిరి, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నందకిషోర్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్‌లు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.10కోట్లకు పైబడే ఉంటుందని అధికారులు తెలియచేశారు. ఈ దాడుల్లో ఏసీబీ కేంద్ర విభాగ డిఎస్పీ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.