రాష్ట్రీయం

టిడిపిలో చేరేందుకు 15 మంది రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 2: తెలుగుదేశంలోకి మరో 15 మంది వైసిపి ఎమ్మెల్యేలు చేరనున్నారని, వారిలో సినీ నటి, ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఉన్నా ఆశ్చర్యం చెందాల్సిన పనిలేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. శనివారం ఎస్సీ రుణాలపై అవగాహన సదస్సులో పాల్గొనడానికి తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. వైసిపి అధినేత జగన్ చేతగాని నాయకత్వ ఫలితంగా మరో 15 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరనున్నారని అన్నారు. వారిలో వైసిపి శాసనసభ్యురాలు ఆర్‌కె రోజా ఉండవచ్చా? అన్న విలేఖరుల ప్రశ్నకు ఆమె కూడా తెలుగుదేశంలో చేరినా ఆశ్చర్యం లేదన్నారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేక మేడ మాదిరిగా కుప్పకూలిపోవడం తథ్యమని జోస్యం చెప్పారు. ఒక్క రాజ్యసభ సీటును కూడా దక్కించుకోలేని దుస్థితికి వైసిపి చేరక తప్పదన్నారు. ఆ పార్టీ శాసన సభ్యురాలు రోజా శాసనసభ సాక్షిగా దళితులను కించపరిచే విధంగా ప్రవర్తించారన్నారు. మంత్రి పీతల సుజాత, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలుచేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ రోజాను జగన్ ఎంతమాత్రం మందలించలేదని, అందుకే ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని పేర్కొన్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకోదని, శాసన సభాధిపతిదే ఈ విషయంలో తుది నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తోందని, ఇందులో భాగంగానే దళితులకు ఆయా ప్రభుత్వ పథకాలు, రుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు రూ.1090 కోట్లు మంజూరు చేసిందన్నారు.