రాష్ట్రీయం

విశాఖ ‘టెక్ మహీంద్ర’లో మరో వెయ్యి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని టెక్ మహీంద్ర సిఇఓ సిపి గుర్నానీ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడలో సోమవారం కలిసిన ఆయన రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. తిరుపతిలో నెలకొల్పనున్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడిటి)లో రొబొటిక్స్ అండ్ ఎనలిటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ టెక్ మహీంద్ర ఫెసిలిటీ సెంటర్‌లో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో స్పల్వకాలంలో హైటెక్ సిటీ నిర్మించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేశారని చంద్రబాబును గుర్నానీ అభినందించారు. క్షణం తీరిక లేకుండా పనిచేయడంలో చంద్రబాబు నాయుడిని తాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యులకు చేరాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందుకు తగిన ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని గుర్నానీని సిఎం కోరారు. ముఖ్యమంత్రి కోర్ టీం సలహాదారుల్లో ఒకనిగా ఉండి సేవలు అందించడానికి గుర్నాని అంగీకరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి, టెక్ మహీంద్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన టెక్ మహీంద్ర సిఇవో గుర్నానీ తదితరులు