రాష్ట్రీయం

పండ్లు కొనాలంటే భయంగా ఉంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4:కార్బైడ్‌తో కృత్రిమంగా మగ్గబెట్టడంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టేవారిపై ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన చీఫ్ జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్‌రావు రెండు రాష్ట్రాలు తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవాలని కూడా సూచించింది. ఇథిలీన్‌తో పండ్లను మగ్గబెట్టే కేంద్రాలను నిర్ణీత కాలంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ సూచించింది. ఈ సందర్భంగా మార్కెట్‌లో పండ్లు కొనాలంటే భయంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కాగా హైకోర్టు సూచనలు అన్నింటినీ అమలు చేస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పేర్కొన్నాయి. వరంగల్ , జగిత్యాల మార్కెట్‌లతోపాటు హైదరాబాద్ గడ్డిఅన్నారం మార్కెట్‌లో ఇథిలీన్ చాంబర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర కౌన్సిల్ ఎ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఆంధ్ర తరఫున అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను వివరించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణకు కేసును ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.