రాష్ట్రీయం

అద్వితీయంగా ఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఆవిర్భవించిన స్వల్ప వ్యవధిలోనే ఐటీ రంగంలో అద్వితీయ పురోగతితో ముందుకెళ్తోందని ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల ప్రముఖులు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో, ఐటీ ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 20 నెలల వ్యవధిలోనే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సాధించడమే కాకుండా వచ్చే 24 నెలల్లో లక్ష కోట్ల పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ముందుకెళ్తోందని అన్నారు. దేశంలోనే అత్యుత్తమైన నూతన పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఐటీతో పాటు మరో నాలుగు అనుబంధ రంగాలకు కొత్త విధానాన్ని సోమవారం ఆవిష్కరించింది. మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ హాల్ (హెచ్‌ఐసిసి)లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీ పాలసీ ఆవిష్కరణకు గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్, ఇన్పోసిస్ చైర్మన్ నారాయణమూర్తితో ఐటీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ఐటీ రంగానికి తెలంగాణ అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణమన్నారు. తమ నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించినట్టుగానే, కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ పాలసీకి కూడా ఆదరణ లభిస్తుందన్నారు. ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతా, ఇస్తున్న ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మా రాష్ట్రానికి రండి, మీరు, మేము అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుదాం అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తమ నూతన పారిశ్రామిక విధానం సింగిల్ విండో, వితౌట్ గ్రిల్స్‌కు పారిశ్రామికవేత్తల నుంచి మంచి ఆదరణ లభించిందని, ఈ పాలసీ తర్వాత రాష్ట్రానికి 1691 పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు ఇచ్చి రికార్డు సాధించమన్నారు. వచ్చిన పరిశ్రమలలో ఇప్పటికే 883 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయని ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోనూ సమగ్రమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న విజన్ రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తుందని ప్రశంసించారు. ఐటీ రంగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు చేస్తోన్న కృషి అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి ప్రసంగిస్తూ అహంను జయిస్తే అభివృద్ధిని సాధించినట్టేనని అన్నారు. ఐటీ రంగంలో సిలిక్యాన్ వ్యాలీతో దేశం పోటీ పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీని ఆయన అభినందించారు. నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియా నినాదంతో దేశం ఐటీలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఇ-గవర్నెనెస్, ఎం-గవర్నెనెస్, స్కిలింగ్, క్వాలిటీ లివింగ్ పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేద్రీకరించడం అభినందనీయమన్నారు. ఇంటెల్ మేనేజింగ్ డైరెక్టర్ దేబ్ జానీ ఘోష్ ప్రసంగిస్తూ డిజిటల్ ఇండియాలో రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే ఐటీ రంగంలో మంచి వృద్ధి సాధించిందని, ఈ రంగంలో రాష్ట్రానికి అన్ని విధాలుగా తమ తోడ్పాడు ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ పారిశ్రామికవేత్త పంకజ్ మహేంద్ర మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉందన్నారు. ఎలక్ట్రానిక్ రంగం తెలంగాణలో ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నాస్కామ్ చైర్మన్ బివిఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 20 నెలలల్లోనే ఐటీ రంగంలో రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు సాధించిందన్నారు. లక్ష కేట్ల ఎగుమతులను సాధించే లక్ష్యంతో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. ఐటీ రంగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారంతా సంతోషంగా గడపాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రఖ్యాత యానిమేషన్ డిజైనర్, ఆస్కార్ అవార్డు గ్రహిత టిమ్ మెక్ గోవెన్‌తో పాటు పలు ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

చిత్రం హెచ్‌ఐసిసిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ పాలసీలను ఆవిష్కరిస్తున్న
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఐటి శాఖ మంత్రి కెటిఆర్, తదితరులు