S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/24/2016 - 16:01

దిల్లీ : పంజాబ్‌ సరిహద్దు నుంచి దేశంలోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. 2,500 మంది పారా మిలటరీ బలగాలు రాజధానిలో పలు ప్రాంతాల్లో మోహరించాయి. హోలీ సందర్భంగా దిల్లీలోని హోటళ్లు, ఆసుపత్రుల వద్ద ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

03/24/2016 - 08:46

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ సమక్షంలోనే కాశ్మీర్ అతివాద, మితవాద హురియత్ నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి జవడేకర్ హాజరయ్యారు.

03/24/2016 - 08:43

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో బుధవారం రెండు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె నాలుగు పార్టీల కొత్త కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పిడబ్ల్యుఎఫ్)తో జట్టు కట్టడం ఒకటి. మరో సినీ నటుడు ఆర్.శరత్ కుమార్‌కు చెందిన ఎఐఎస్‌ఎంకె తిరిగి ఎఐఎడిఎంకె కూటమిలో చేరడం రెండోది.

03/24/2016 - 08:40

న్యూఢిల్లీ:పఠాన్‌కోట్ మీదుగా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారన్న కథనాల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్, అసోం రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో హింస, విధ్వంస కాండలను సృష్టించే లక్ష్యంతో ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు వెల్లడించాయి.

03/24/2016 - 08:32

న్యూఢిల్లీ: అరవై రోజులో వ్యవధిలోనే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు అన్నింటినీ పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను నెలరోజుల్లోనే చేపట్టాలని అలా చేసినప్పుడే రెండు నెలల్లో ఈ సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలకు సంబంధించి సమస్యలు సకాలంలో పరిష్కరించడమే ప్రజాస్వామ్యం ప్రధాన లక్ష్యమన్నారు.

03/24/2016 - 08:31

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశానికి దేవుడు ఇచ్చిన వరమంటూ బిజెపిలో వ్యక్తి పూజ చేయటం మంచిది కాదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సంస్థ ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం బిజెపి అధినాయకత్వానికి కరాఖండీగా చెప్పింది.

03/24/2016 - 08:30

డెహ్రాడూన్: ఈ నెల 28న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న హరీష్ రావత్ ప్రభుత్వం భవిష్యత్తు ఇప్పటికే డోలాయమానంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అధికార కూటమికి చెందిన కనీసం మరో అయిదుగురు ఎమ్మెల్యేలు తమ శిబిరంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ బుధవారం చెప్పుకుంది.

03/24/2016 - 08:30

న్యూఢిల్లీ, మార్చి 23: విశ్వవిద్యాలయలలో రాజకీయ జో క్యం పనికిరాదని, వర్శిటి వ్యవహరాల్లో నేతలు జోక్యం చేసుకుని వాతావరణాన్ని కలుషితం చేయవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయు డు కోరారు. ఢిల్లీలో బుధవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాజకీయ అవసరాలకోసం విశ్వవిద్యాలయాలను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు.

03/24/2016 - 08:10

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాసారు. హెచ్‌సియులో మంగళవారం అరెస్టు చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని, వారిపైన నమోదైన కేసులు ఎత్తి వేయాలని లేఖలో పేర్కొన్నారు. టెలిఫోన్‌లో మిమల్ని సంప్రదించడానికి ప్రయత్నచేశానని, కాని ఎటువంటి స్పందన రాకపోవడంతోనే లేఖ రాసానని అందులో పేర్కొన్నారు.

03/24/2016 - 06:26

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అధ్యయనం చేయకుండానే పర్యావరణ అనుమతులు ఇచ్చారన్నది అవాస్తవమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. జావడేకర్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి సంబంధించిన అటవీ భూములలో నివాస వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేసుకునేలా నూతన విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

Pages