జాతీయ వార్తలు

మా బలం పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఈ నెల 28న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న హరీష్ రావత్ ప్రభుత్వం భవిష్యత్తు ఇప్పటికే డోలాయమానంగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అధికార కూటమికి చెందిన కనీసం మరో అయిదుగురు ఎమ్మెల్యేలు తమ శిబిరంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ బుధవారం చెప్పుకుంది.
‘కొంతమంది మంత్రిపదవులు పొందిన వారితో సహా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి చెందిన కనీసం అయిదుగురు ఎమ్మెల్యేలు మా వైపునకు రావడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు’ అని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి మున్నాసింగ్ చౌహాన్ చెప్పారు. వాళ్లంతా తమతో టచ్‌లో ఉన్నారని, ఒక వేళ ఈ నెల 28న అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో గనుక లెక్కలు టైకి దారి తీసే పక్షంలో వాళ్లంతా తమ వైపు దూకేస్తారని ఆయన చెప్పారు. ఆ అయిదుగురు ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించడానికి మున్నాసింగ్ నిరాకరించినప్పటికీ వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వామి అయిన ఆరుగురు సభ్యులున్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పిడిఎఫ్)కు చెందిన వారని మాత్రం తెలిపారు. ‘హరీష్ రావత్ నియంతృత్వ తరహా పాలనపై అసంతృప్తి మొదట్లో కనిపించిన దానికన్నా కూడా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మాత్రమే అది పరిమితం కాలేదు. అవసరమైనప్పుడు మా వైపునకు రావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు చాలామందే ఉన్నారు’ అని మున్నాసింగ్ చెప్పారు. నిబంధనల ప్రకారం 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాల్ అనర్హులుగా ప్రకటించలేరని కూడా ఆయన అన్నారు.

మహారాష్టన్రు నాలుగు రాష్ట్రాలుగా విభజించాలి

ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంజి వైద్య సూచన

ముంబయి, మార్చి 23: పరిపాలన సౌలభ్యం కోసం మహారాష్టన్రు నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎం.జి.వైద్య సూచించారు. దీనికోసం రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీహరి అనేయ్ ఇటీవల మరాఠ్వాడా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చేసిన డిమాండ్ వివాదాస్పదం కావడం, దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్య చేసిన సూచన ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని వైద్య సూచించారు. ఒకటి, కొత్తగా ఏర్పాటయ్యే ఏ రాష్ట్రంలోని జనాభా మూడు కోట్లకు మించి ఉండకూడదని, రెండోది, 50 లక్షలకు తక్కువగా ఉండకూడదని ఆయన పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ సూచించారు. ఈ సూత్రాన్ని పాటిస్తే మహారాష్టన్రు నాలుగు రాష్ట్రాలుగా విభజించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సౌలభ్యం కోసం ఇప్పటికే మహారాష్టన్రు నాలుగు ‘ప్రాంత్’లు గా (రాష్ట్రాలుగా), ఉత్తరప్రదేశ్‌ను ఆరు ‘ప్రాం త్’లుగా విభజించిందని చెప్పారు. ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగిన తరువాత రాష్ట్రాన్ని విభజించడం సరికాదని, అందువల్ల ఎలాంటి ఆందోళనలు ప్రారంభం కాకముందే విభజించాలని కూడా వైద్య సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో అధిక జనసాంద్రత ఉండగా, సిక్కిం (సుమారు పది లక్షలు), ఆంధ్రప్రదేశ్ (సుమారు 14లక్షలు) వంటి రాష్ట్రాల్లో తక్కువ జనసాంద్రత ఉందని పేర్కొంటూ, తక్కువ జనసాంద్రత వల్ల అస్థిరత పరిస్థితులు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఝార్ఖం డ్, ఒడిశా, పంజాబ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రా లు సుమారు 3కోట్ల జనాభా చొప్పున కలిగి ఉండి, బాగా పనిచేస్తున్నాయని వైద్య పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన అభిప్రాయం అడిగితే తాను ఇదే చెబుతానని వైద్య అన్నారు.