S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/24/2016 - 06:23

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగను పురస్కరించుకుని బుధవారం తమ ఉద్యోగులకు కరవుభత్యాన్ని 6 శాతం పెంచింది. దీనివల్ల దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాది జనవరి 1నుంచి అమలులోకి వచ్చే డిఏ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏటా రూ. 6,795.24కోట్లు, పెన్షనర్లకు సంబంధించి రూ. 7,929.

03/24/2016 - 06:26

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం బలమైన ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు అనే ప్రతిష్టాత్మక పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల 95లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

03/23/2016 - 15:13

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. డిఎంకెతో జతకడతారని భావించిన డిఎండికె పార్టీ అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్ బుధవారం నాలుగు పార్టీల ప్రజా సంక్షేమ ఫ్రంట్‌లో చేరారు. ఈ పరిణామాలకు డిఎంకె కంగుతింది. రెండు వామపక్ష పార్టీలు, డిఎండికె, విసికె కలయికతో ఇపుడు తృతీయ ఫ్రంట్ అవతరించింది.

03/23/2016 - 08:11

న్యూఢిల్లీ: విశాఖలో త్వరలో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌సేవా కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఐటి శాఖ కార్యదర్శి అరుణ్‌శర్మ మంత్రిని కలిసి కలిసి డిజిటల్ సేవా కేంద్రంపై చర్చించారు. దీనిపై మంత్రి తన శాఖ అధికారులను పిలిచి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

03/23/2016 - 06:36

న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్‌లో మళ్లీ పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు మెరుగైనాయి. దీర్ఘకాల ప్రతిష్టంభన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించిన పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంతో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.

03/23/2016 - 06:33

పాట్నా: బిహార్‌లో అధికార జెడియు ఎమ్మెల్యే గోపాల్ మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నౌగాచియా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మండల్ ‘నా దగ్గర తుపాకీ, పేలుడు పదార్థాలున్నాయి. మళ్లీ వాటికి పనిచెప్పి హత్యారాజకీయాలు మొదలెడతాను’ అన్నారు. భగల్పూర్ జిల్లా గోపాల్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేయకపోయినా తన అధికారం, ఆయుధాలతో వారిని కాపాడతానని ప్రకటించారు.

03/23/2016 - 06:32

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిసి కెమెరాలు రంగప్రవేశం చేయనున్నాయి. రాష్టవ్య్రాప్తంగా సున్నిత ప్రాంతాలు, దాడులు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్‌లలో సిసి కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.

03/23/2016 - 06:30

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సింగూర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని టాటాలు, ఇతర పరిశ్రమల యజమానులతో మాట్లాడుతామని సిపిఎం మంగళవారం తెలియజేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో దీర్ఘకాలం ఆందోళన కారణంగా సింగూరులో ఏర్పాటు చేయదలచిన తమ చిన్న కార్ల తయారీ ఫ్యాక్టరీని టాటాలు గుజరాత్‌కు మార్చుకున్న విషయం తెలిసిందే.

03/23/2016 - 06:29

న్యూఢిల్లీ : అస్సాం అసెం బ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ దక్కదని, హంగ్ అసెంబ్లీ ఏర్పాడే సూ చనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ అస్సాంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన సర్వేలో హంగ్ తప్పదని తేలింది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎంపిక చేసిన 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వే జరిపింది.

03/23/2016 - 06:41

న్యూఢిల్లీ: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం 58 మంది జవాన్లను శౌర్య పతకాలతో సత్కరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటబడి తరిమి వారిలో ఒకరిని మట్టుబెట్టిన తర్వాత శత్రువుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన సిపాయి జగదీశ్ చాంద్ కూడా ఈ రోజు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

Pages