S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/28/2016 - 01:49

న్యూఢిల్లీ, మార్చి 27: వర్షపు నీటిని పొదుపు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఐదు లక్షల చెరువులు, వ్యవసాయ చెరువులను నిరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటిని ఒడిసిట్టేందుకు మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

03/28/2016 - 01:00

క్రీజ్‌లో ఉన్నది కోహ్లీ... ధోనీ!
టెన్షన్ పడాల్సిన అభిమానులు ఎప్పుడో రిలాక్సయిపోయారు!
ఆ జంట మీదున్న నమ్మకం అలాంటిది మరి!
ఊపు మీదున్న కోహ్లీ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు
8 బంతులు... 8 పరుగులు!
ఎనిమిదో బంతికి పరుగేమీ రాలేదు
అయితేనేం... ఏడో బంతికి మరో ఫోర్!
ఆరు బంతులు... నాలుగు పరుగులు
చివరి ఓవర్ తొలి బంతికి ధోనీ ఫోర్!
అంతే... ఖేల్ ఖతమ్!

03/28/2016 - 03:06

న్యూఢిల్లీ, మార్చి 27: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లలో జరిగిన సంఘటనలు రెండూ కూడా ప్రధానంగా వామపక్ష భావజాల ఉద్యమాలేనని, వీటిలో కొద్ది మంది జిహాదీలు కూడా ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు.

03/28/2016 - 00:36

న్యూఢిల్లీ, మార్చి 27:తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ కేంద్రం ఆదివారం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని..దరిమిలా రాష్టప్రతి పాలన విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

03/27/2016 - 17:10

న్యూదిల్లి:సెలవుల్లో సమయాన్ని వృధా చేయవద్దని, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని లేదా తెలుసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు సూచించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన రేడియోలో ప్రసంగించారు. టి-20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఆనందాన్నిచ్చిందన్న ఆయన సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గాలని ఆకాంక్షించారు.

03/27/2016 - 17:08

న్యూదిల్లి:ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించారు. ఈ మేరకు కేంద్రమంత్రివర్గ సిఫారసుపై రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జి ఆమోదముద్ర వేశారు. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిరోజులుగా సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి హరీష్‌రావత్ వైఖరి నచ్చని 9మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అక్కడ రాజకీయ అనిశ్ఛితి నెలకొంది.

03/27/2016 - 02:52

న్యూఢిల్లీ/డెహ్రాడూన్, మార్చి 26: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై తీవ్రమైన ఆరోపణ చేశారు. సోమవారం రాష్ట్ర శాసనసభలో జరుగనున్న బలపరీక్షలో తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ రావత్ తమకు లంచం ఇవ్వజూపాడని వారు ఆరోపించడంతోపాటు ఇందుకు సంబంధించిన ‘స్టింగ్ ఆపరేషన్’ వీడియోను కూడా విడుదల చేశారు.

03/27/2016 - 02:51

పనాజి, మార్చి 26: క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను యోగా నయం చేస్తుందని ఒక పరిశోధనలో రుజువైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా ‘ఆయుష్’ను ఉపయోగించువాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

03/27/2016 - 02:51

డెహ్రాడూన్, మార్చి 26: కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ శనివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గోవింద్ సింగ్ కున్‌జ్వాల్‌ను కోరారు. రావత్.. స్పీకర్ కున్‌జ్వాల్‌తో భేటీ అయి తన వాదన వినిపించారు.

03/27/2016 - 02:50

న్యూఢిల్లీ, మార్చి 26: యెమెన్‌లో గత నెల ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన కేరళ ఫాదర్‌ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం తెలిపారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు ఆ పూజారిని ఉరితీయాలని సదరు ఉగ్రవాద గ్రూపు నిర్ణయించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ పై విషయాన్ని స్పష్టం చేశారు.

Pages