జాతీయ వార్తలు

వర్షపు నీటిని ఒడిసి పడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: వర్షపు నీటిని పొదుపు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఐదు లక్షల చెరువులు, వ్యవసాయ చెరువులను నిరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటిని ఒడిసిట్టేందుకు మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం ఉదయం ఆకాశవాణిలో 18వ ‘మనసులోని మాట’ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రసంగిస్తూ నీటిని, ముఖ్యంగా వర్షపు నీటిని పొదుపు చేయటం ద్వారా రైతుల నీటి ఆవసరాలను తీర్చేందుకు ప్రయత్నించాలని పిలుపు ఇచ్చారు. ప్రతి గ్రామంలో నీటిని పొదుపు చేయాలి, కాపాడుకోవాలి, ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలని నరంద్ర మోదీ సూచించారు. నీటిని పొదుపు చేయటంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా పెద్దఎత్తున కృషి చేయాలి, దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని ప్రధాన మంత్రి చెప్పారు. వర్షపు నీరు ప్రవహించే గుంటలు, కుంటలు, చెరువులు, కాలువలకు చేరే దారుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని సూచించారు. వర్షాకాలానికి ఇంకా సమయం ఉన్నందున వర్షపు నీటిని పొదుపు చేసేందుకు ఇప్పటి నుండే అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీ పిలుపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కిసాన్ యాప్‌ను ప్రతి రైతు తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని లబ్ధి పొందాలన్నారు. రైతులు అవసరమైన మేరకే ఎరువులు వాడాలనీ, అధిక మొత్తంలో వాడకూడదన్నారు. మసాలా దినుసులతో కూరలకు రుచి పెరుగుతుంది, అయితే అవసరానికి మించి మసాలా దినుసులు వాడితే కూర చెడిపోతుంది. అలాగే ఎరువులు అధికంగా ఉపయోగిస్తే పంట దెబ్బతింటుందని మోదీ చెప్పారు. కిసాన్ యాప్ సరిగా పనిచేయకపోతే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. వచ్చేనెల ఏడో తేదీన జరుగనున్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి మోదీ ప్రస్తావిస్తూ మధుమేహాన్ని ఓడించేందుకు దేశ ప్రజలు కంకణం కట్టుకోవాలన్నారు. ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మధుమేహ పరాజయ దినంగా పాటిస్తున్నారనీ, ఈ లక్ష్య సాధనకు ప్రజలందరు కృషి చేయాలన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా క్షయను సునాయాసంగా అరికట్టవచ్చునన్నారు. క్షయ నిర్ధారణకు దేశంలో ప్రస్తుతం పదమూడు వేల మైక్రోస్కోప్ కేంద్రాలు, నాలుగు లక్షల ‘డాట్స్’ ఉచితంగా ఇచ్చే కేంద్రాలున్నాయని మోదీ చెప్పారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. పర్యటనల వల్ల ఎంతో విజ్ఞానం కలుగుతుందనీ, ఈ రంగం అభివృద్ధి చెందితే లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. బొగ్గు గనులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసిన నాగపూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్ సంస్థను నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు.
క్రీడల్లో వెనకబడ్డాం
దేశం మొత్తం జనాభాలో దాదాపు 65 శాతం మంది యువత ఉన్నప్పటికీ క్రీడా రంగంలో మనం ఎంతో వెనుకబడి ఉండటం దురదృష్టకరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. క్రీడా రంగంలో ముందుకు సాగేందుకు యువకులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. 2017లో దేశంలో ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగవలసి ఉందనీ, ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని యువతకు పిలుపు ఇచ్చారు. దేశంలో ఫీఫా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించటం గర్వకారణమనీ, అయితే నిర్వహణతోనే సరిపెట్టుకోకుండా యువత పాలు పంచుకోవాలి, ఫుట్‌బాల్‌కు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ హితవు పలికారు. క్రికెట్‌లో ఎంతో ముందున్న మన యువత ఫుట్‌బాల్ క్రీడలో మాత్రం మరెంతో వెనుకబడి ఉన్నదని వాపోయారు. ప్రతి వీధిలో ఫుట్‌బాల్ అడే పరిస్థితి రావాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణపై యువత తనకు సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.
వేసవిలో పక్షుల కోసం మట్టి గినె్నల్లో నీరు పెట్టాలని తనకు గుర్తు చేసిన అభయ్ చతుర్వేది అనే బాలుడిని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వేసవిలో మన ఇంటికి వచ్చే తపాలా సిబ్బంది, ఇతరులకు తాగేందుకు నీరు ఇవ్వాలనే సూచన చేసిన శిల్పా కూకేను కూడా ఆయన అభినందించారు. ఈస్టర్ పండుగ జరుపుకున్న క్రైస్తవులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.