S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/30/2016 - 02:53

చండీగఢ్, మార్చి 29: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జాట్‌లు, మరో అయిదు కులాల వారికి రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు హర్యానా శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

03/30/2016 - 01:40

పఠాన్‌కోట్, మార్చి 29: పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిపై విచారణ నిమిత్తం మంగళవారం ఇక్కడకు వచ్చిన ఐదుగురు సభ్యులుగల పాకిస్తాన్ దర్యాప్తు బృందం నిరసనలు ఎదుర్కోనవలసి వచ్చింది. దర్యాప్తు బృందంలో ఐఎస్‌ఎస్ అధికారి ఉన్నారు. జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే.

03/30/2016 - 01:36

రామచంద్రపూర్, మార్చి 29: పశ్చిమ బెంగాల్‌లో బాంబుల శబ్దాల మధ్య రవీంద్రనాథ్ టాగూర్ సంగీత శబ్దాలు వినిపించడం లేదంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమాన పరిచేవారికి తనకన్నా పెద్ద శత్రువు మరొకరుండరని పురులియా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో మాట్లాడుతూ మమత అన్నారు.

03/30/2016 - 01:31

న్యూఢిల్లీ, మార్చి 29: బ్రసెల్స్ బాంబు దాడుల నేపథ్యంలో బెల్జియం ప్రజలు ప్రదర్శించిన దృఢసంకల్పం, స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, భారత దేశం వారితో భుజం, భుజం కలిపి నిలుస్తుందన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం రాత్రి బెల్జియంకు బయలు దేరారు. ఆయన అక్కడినుంచి మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అణు భద్రతపై జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వాషింగ్టన్ వెళ్తారు.

03/30/2016 - 00:24

నైనితాల్, మార్చి 29:ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మంగళవారం అనూహ్య మలుపుతిరిగింది. రెండు రోజుల క్రితం విధించిన రాష్టప్రతి పాలన అమలులో ఉండగానే 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అనర్హతకు గురైన తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది.

03/30/2016 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 29: క్రియాత్మకంగా లేని ఖాతాలపై మళ్లీ వడ్డీ చెల్లించాలని ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. దాదాపు 32వేల కోట్ల మేర ఉన్న నిధులపై వడ్డీ చెల్లింపువల్ల 9కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏప్రిల్ 1నుంచే అమలు చేస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వడ్డీ జమ విధానాన్ని యుపిఏ నిలిపివేసిందని, దీనివల్ల ఖాతాదారులకు నష్టం కలిగిందన్నారు.

03/29/2016 - 18:34

హైదరాబాద్: ‘గానకోకిల’గా తెలుగువారందరికీ తెలిసిన నేపధ్యగాయని సుశీల తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆరు భాషల్లో 17,695 పాటలు పాడిన గాయనిగా ఆమెకు ఈ అరుదైన ఘనత దక్కింది. 1950లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లో పాడి సంగీతానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు.

03/29/2016 - 18:32

దిల్లీ: బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాల్లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి బయలుదేరి వెళుతున్నారు. ముందుగా ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరుకుని అక్కడ జరిగే యూరోపియన్ యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. ఈనెల 31న వాషింగ్టన్ చేరుకుని రెండు రోజుల అక్కడ జరిగే పలు సదస్సుల్లో పాల్గొంటారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటించి పలు ఒప్పందాలు చేసుకుంటారు.

03/29/2016 - 18:31

చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మంగళవారం హర్యానా అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు ఇదివరకే రాష్ట్ర మంత్రిమండలి సుముఖత తెలిపింది.

03/29/2016 - 16:44

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్టప్రతి పాలనపై ఇక్కడి హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ నెల 31న అసెంబ్లీలో ఎమ్మెల్యేల విశ్వాసం నిరూపించుకోవాలని సిఎం హరీష్ రావత్‌ను కోర్టు ఆదేశించింది. తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రాష్టప్రతి పాలన విధించిందని రావత్ హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలిక స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Pages