S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/28/2019 - 22:39

మనమెప్పుడూ ఆహారపదార్థాల్లో ధాన్యానికే ఎక్కువ విలువనిస్తాం. కానీ చిరుధాన్యాలు కూడా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయని నేటి భావన. వీటిని తీసుకోవడం వల్ల మనిషి తన ఆరోగ్యాన్ని మరింత భద్రం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

07/26/2019 - 18:30

ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో పదిహేను కోట్ల మంది పోషకాహారలోపంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. అదే వయస్సులో ఉన్న ఆరోగ్యవంతమైన చిన్నారులతో పోలిస్తే.. పోషకాహార లోపం గల చిన్నారులు బలహీనంగా ఉండటం, ఎదుగుదల లేకపోవటమే కాదు.. వారి పేగులో వివిధ రకాల బాక్టీరియా కూడా అసంపూర్ణంగా, ఎదుగుదల లేకుండా ఉంటుంది. మన శరీరంలో మనిషి కన్నా సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి.

07/25/2019 - 18:45

ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా వుంటాయి. అందుకే వాటిని రక్షక ఆహారంగా, సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఆకుకూరల్లో ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, రైబోఫ్లొనివ్ యాసిడ్‌లు పుష్కలంగా వుంటాయి. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకుకూరలు తినాలి.

07/24/2019 - 19:36

‘ఆహారం నమిలే తినండి.. లేకపోతే లావైపోతారు’ అంటున్నారు నిపుణులు. నిజమే మరి! ప్రస్తుతం మనం నివసిస్తోంది స్పీడు యుగంలో. దీనికి తోడు సెడంటరీ జీవనవిధానం పెరిగిపోయింది. నేటి యాంత్రిక యుగంలో భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిపరమైన జీవితాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవాలి.

07/23/2019 - 19:06

కొంతమంది బాగా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుంటారు. చక్కగా నిద్రపోతారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం వారికే అర్థం కాదు. డాక్టర్లకు కూడా కొన్నిసార్లు ఈ విషయం అర్థం కాదు. అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

07/23/2019 - 19:04

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో వింత జరిగింది.. వినగానే నోళ్లు వెళ్లబెట్టేలా.. చదవగానే బాధతో కుమిలిపోయేలా ఉందా వార్త.. ఒక్కమాటలో చెప్పాలంటే.. గత మూడు నెలల్లో 132 గ్రామాల్లో 216 ప్రసవాలు జరిగితే.. ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు.. ఇది నమ్మగలరా? నిజమండీ.. ఈ జిల్లాలోని 132 గ్రామాల్లో మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదని సామాజిక వేత్తలో, పత్రికలో కాదు..

07/22/2019 - 04:50

అన్నింట్లోనూ మగవారితో పోటీ పడుతున్నారు నేటి మహిళలు. విమానం నడపడం దగ్గర నుంచి యుద్ధరంగంలో తుపాకీ పట్టడం వరకు దేనికీ వెనుకంజ వేయడం లేదు. అలా భిన్నమైన వృత్తిని ఎంచుకున్నారు ఇక్కడి మహిళలు. యుద్ధరంగంలో తుపాకీ మహిళలను చూసుంటాం.. కానీ సైనికుల తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలను ఎప్పుడైనా చూశారా? మగవారి పనిగా భావించే ఈ వృత్తిని చేపట్టి ప్రత్యేకంగా నిలిచిన నలుగురు నేపాల్ మహిళల గురించి తెలుసుకుందాం..

07/22/2019 - 04:48

స్నానం చేయడంతోనే కుంకుమను నుదుటన పెట్టుకోవడం మన సంప్రదాయం. ఒకప్పుడు కుంకుమతో ఎర్రెర్రగా బొట్టుపెట్టుకోవడం నేడు తగ్గిపోయినా పెళ్లయిన వారు మాత్రం నుదుటిపై కుంకుమను ధరించడం ఆనవాయితీ. కొందరు పండుగలు, పబ్బాలప్పుడు మాత్రమే కుంకుమను వాడుతుంటాయి. ముఖ్యంగా పూజల సమయంలో కుంకుమ లేకుండా పూజ పూర్తికాదు.

07/18/2019 - 18:56

కొందరు ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తుంటారు. భూమి భారమంతా తమ నెత్తినే మోస్తున్నట్లు నిస్సత్తువగా కనిపిస్తుంటారు. ఆహారంలో తీసుకోవడం బాగానే ఉన్నా వారిలో నీరసం మాత్రం తగ్గదు. ఇందుకు కారణం కొన్ని రకాల విటమిన్స్ లోపించడమే కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అనేక అధ్యయనాల ఫలితంగా కొద్దిపాటి పనులకే నీరసం, నిస్సత్తువగా అనిపించే అయ్యేవారిలో విటమిన్12, విటమిన్ డి లోపం ఉంటుందని స్పష్టంగా తెలిసింది.

07/17/2019 - 18:33

సహజంగా సీజన్‌కు తగినట్టుగా జీవనశైలిని, ఆహారశైలి మారుస్తూ ఉండాలి. మండు వేసవి తరువాత వచ్చే వానాకాలం అంటే ఎవరికైనా ఇష్టమే.. వర్షంలో తడవాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ తడిస్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే వస్తాయి. అందుకే వర్షాకాలానికి తగినట్టుగా మనం ఆహార జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం..

Pages