Others

నిస్సత్తువకు కారణాలివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తుంటారు. భూమి భారమంతా తమ నెత్తినే మోస్తున్నట్లు నిస్సత్తువగా కనిపిస్తుంటారు. ఆహారంలో తీసుకోవడం బాగానే ఉన్నా వారిలో నీరసం మాత్రం తగ్గదు. ఇందుకు కారణం కొన్ని రకాల విటమిన్స్ లోపించడమే కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అనేక అధ్యయనాల ఫలితంగా కొద్దిపాటి పనులకే నీరసం, నిస్సత్తువగా అనిపించే అయ్యేవారిలో విటమిన్12, విటమిన్ డి లోపం ఉంటుందని స్పష్టంగా తెలిసింది.
విటమిన్ బి12
మన నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్ బి12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్దీ మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవడం, రక్తపోటు తక్కువ కావటం, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ ఎక్కువైతే రక్తహీనతకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను పాటించాలి.
* ఆహార పదార్థాల్లో కేవలం మాంసంలోనే విటమిన్ బి12 అధికమొత్తంలో ఉంటుంది.
* శాకాహారంలో బి12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా.. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బి12 మాత్రలు వేసుకోవాలి.
* చేపలు, షెల్‌ఫిష్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి
మానవ శరీరంలో విటమిన్ డి చేసేటువంటి మేలు నిజంగా ఎంతో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలంగా ఉండేట్టు చేస్తుంది. రక్తంలో ఉన్న నాళాలను కాపాడుతుంది. ఇది లోపిస్తే ఎముకల, కండరాల పటుత్వం తగ్గి, నీరసానికి దారితీస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో చాలామంది ఆడవారికి విటమిన్ డి లోపం చాలా ఉంది. అందుకే నలభై దాటిన మహిళలందరూ తప్పనిసరిగా విటమిన్ డి సప్లిమెంట్స్ వాడాలని నిపుణుల సలహా.
* సాలమన్, ట్యునా, మెకరెల్ చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
* పాలు, తృణధాన్యాలు, గుడ్లలో కూడా విటమిన్ డి అధికంగా లభిస్తుంది.
* ఆరెంజ్ జ్యూస్, పుట్టగొడుగులు, నువ్వుల ద్వారా కూడా ఈ విటమిన్ లభిస్తుంది.
* ఆహారం సంగతి అలా ఉంచితే.. వీలైనంత వరకు సూర్యరశ్మిలో నిలబడితే విటమిన్ డి శరీరానికి కావలసిసంత లభిస్తుంది.