Others

నమిలే తింటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆహారం నమిలే తినండి.. లేకపోతే లావైపోతారు’ అంటున్నారు నిపుణులు. నిజమే మరి! ప్రస్తుతం మనం నివసిస్తోంది స్పీడు యుగంలో. దీనికి తోడు సెడంటరీ జీవనవిధానం పెరిగిపోయింది. నేటి యాంత్రిక యుగంలో భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిపరమైన జీవితాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఇక తిండి విషయంలో అయితే అంతా హడావుడే.. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో ఆహారాన్ని భారతీయులు వేగంగా తింటారని ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇది ఆరోగ్యానికి ముప్పని నిపుణులు చెబుతున్నారు. ‘ఒక్క మెతుకుని వందసార్లు నమిలి తినాలి’ అని చెప్పారు పూర్వీకులు. ఇది అక్షరసత్యం కూడా. నమిలి తినే తీరిక లేక మింగేస్తుండటంతో జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతున్నాయి.
అరుగుదల నోటి నుంచే..
తిన్న ఆహారం జీర్ణాశయం చేరాకే జీర్ణంకావడం మొదలవుతుందని చాలామంది భావన. నిజానికి ఆహారం ఈ ప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది. నోటిలోని అమైలేజ్, లైపేజ్ అనే ఎంజైములు ఆహారం నమిలేటప్పుడే జీర్ణం అయ్యే ప్రక్రియను మొదలుపెడతాయి. ఇలా తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ నోటి నుంచే మొదలవుతుంది కాబట్టి ఆహారాన్ని బాగా నమలడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వెంటనే మెదడు కూడా ఉత్తేజం చెందుతుంది. జీర్ణక్రియలో మెదడు సైతం కీలకపాత్ర పోషిస్తుంది. ఎలాగంటే ఉదాహరణకు మనకు ఎదురుగా ఆహారం ఉన్నప్పుడు దాన్ని వాసన చూసిన వెంటనే మెదడు ఉత్తేజితమవుతుంది. వెంటనే నోట్లో సెలైవా విడుదల ప్రారంభం అవుతుంది. ఇందులో ఉన్న ఎంజైములు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో తోడ్పడతాయి. అయితే తీసుకున్న ఆహారాన్ని ఎంత నమిలితే అంత సెలైవా విడుదల అవుతుంది. కాబట్టి ఆహారం కూడా తేలిగ్గా జీర్ణమవుతుంది.
వేగంగా తింటే..
సమయాభావం వల్లనో, మరేదైనా కారణం వల్లనే ఆహారాన్ని వేగంగా తింటే నమలడానికి ఆస్కారం ఉండదు. ఫలితంగా జీర్ణానికి తోడ్పడే ఎంజైములు, ఆమ్లాల విడుదల మందగిస్తుంది. దీనివల్ల ఎసిడిటి, అజీర్తి వంటివి సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా వేగంగా తినడం వల్ల ఎక్కువ తినేసే ఆస్కారం కూడా ఉంది. దీనివల్ల శరీరానికి ఎంత అవసరమో, అంతమాత్రమే ఉపయోగించుకుని మిగిలింది కొవ్వు రూపంలో శరీర భాగాల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. చాలామందికి ఆహారం నమిలే అలవాటు ఉండదు. అయితే దీన్ని క్రమంగా అలవాటు చేసుకోవాలంటే పక్కన సెల్‌ఫోన్లు, టీవీలు, మాట్లాడటం వంటి పద్ధతులను పక్కన పెట్టి, ఆహారంపైనే దృష్టి ఉంచాలి. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎలా తీసుకుంటున్నాం? అనే లెక్కలు వేసుకుని ఆహారం తీసుకోవాలి. తినేటప్పుడు బాగా నమిలి ఆహారం తీసుకోవడం వల్ల అది బాగా జీర్ణమై ఆరోగ్యం కలుగుతుంది.