Others

ఆడపిల్ల పుట్టలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో వింత జరిగింది.. వినగానే నోళ్లు వెళ్లబెట్టేలా.. చదవగానే బాధతో కుమిలిపోయేలా ఉందా వార్త.. ఒక్కమాటలో చెప్పాలంటే.. గత మూడు నెలల్లో 132 గ్రామాల్లో 216 ప్రసవాలు జరిగితే.. ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు.. ఇది నమ్మగలరా? నిజమండీ.. ఈ జిల్లాలోని 132 గ్రామాల్లో మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదని సామాజిక వేత్తలో, పత్రికలో కాదు.. సాక్షాత్తు అధికారుల లెక్కలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయి. అదే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆడపిల్ల పుట్టిన వెంటనే లెక్కకు రాకుండా హతమార్చేస్తున్నారా? పుట్టకముందే అమ్మల కడుపుల్లోనే కడతేరుస్తున్నారా..? విషయం తెలియదు. స్కానింగు రిపోర్టులపై నిషేధం, అబార్షన్లపై నిషేధం, డాక్టర్లపై నిఘా.. ఇలాంటివన్నీ కాగితాలపై కనిపిస్తూనే ఉంటాయి. కానీ అసలు కథేంటో తెలియదు. ఆ జిల్లా కలెక్టర్‌ను ఈ విషయం గురించి అడిగితే.. ‘ఈ ఊర్లన్నింటినీ రెడ్ జోన్‌గా ప్రకటిస్తున్నాం.. మరో ఆరునెలలు పరిశీలిస్తాం.. పరిస్థితి మారకపోతే ఆశ హెల్త్ వర్కర్లకు ఉద్వాసన తప్పదు. అనుమానాస్పద అబార్షన్లపై నిఘావేసి, పసిగట్టి రిపోర్టు చేసే బాధ్యత వారిది. అది వారు సరిగా చేయలేదనిపిస్తుంది..’ అంటున్నారు కలెక్టర్. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. ఇది అంతుచిక్కని మిస్టరీలా ఉంది. ‘ఆడపిల్ల పుట్టకూడదు’ అనే జాఢ్యం ఎంత తీవ్ర రూపం దాల్చిందో.. అనే దానికి ఉదాహరణలా నిలిచింది ఈ సంఘటన.