Others

మంచి బాక్టీరియాను పెంచాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో పదిహేను కోట్ల మంది పోషకాహారలోపంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. అదే వయస్సులో ఉన్న ఆరోగ్యవంతమైన చిన్నారులతో పోలిస్తే.. పోషకాహార లోపం గల చిన్నారులు బలహీనంగా ఉండటం, ఎదుగుదల లేకపోవటమే కాదు.. వారి పేగులో వివిధ రకాల బాక్టీరియా కూడా అసంపూర్ణంగా, ఎదుగుదల లేకుండా ఉంటుంది. మన శరీరంలో మనిషి కన్నా సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి. శరీరంలోని అన్ని కణాలనూ లెక్కిస్తే.. అందులో కేవలం 43 శాతం మాత్రమే మానవ కణాలు. మిగతా అంతా మన శరీరంలోని సూక్ష్మజీవులే.. అందులో బాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఏకకణజీవులు ఉంటాయి. మానవ జీనోమ్.. మనిషి జన్యు సంకేతాల పూర్తి పటం.. జన్యువులు అని పిలిచే 20,000 సూచనలతో తయారైంది. కానీ.. మన శరీరంలో సూక్ష్మజీవులు జన్యువులన్నింటినీ కలిపితే.. ఈ సంఖ్య 20 లక్షల నుంచి రెండు కోట్ల సూక్ష్మజీవుల జన్యువులుగా తేలుతుంది. వీటన్నింటినీ కలిపి రెండో జీనోమ్‌గా పిలుస్తారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలకు.. అరటిపండ్లు, వేరుసెనగలు, సెనగలు వంటి బలవర్ధక ఆహారం ఇవ్వటం వల్ల వారి పేగుల్లో మంచి బాక్టీరియా మెరుగుపడుతుందని.. ఇది వారి ఎదుగుదల మొదలవడానికి దోహదపడుతుందని తాజా పరిశోధన చెబుతోంది. ఈ ఆహారపదార్థాలు ప్రత్యేకించి పేగుల్లో ఆరోగ్యవంతమైన సూక్ష్మజీవులను పెంచడానికి బాగా ఉపయోగపడతాయని బంగ్లాదేశ్ చిన్నారులపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
మంచి బాక్టీరియా
ఎదుగుదల లేకపోవడానికి ఇదే కారణం అయి ఉండొచ్చని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు భావించారు. అయితే.. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని రకాల ఆహారాలు సమానంగా సాయం చేయవు. బంగ్లాదేశ్ చిన్నారుల్లో పేగుల్లో ఉన్న ప్రధాన రకాల బాక్టీరియాను పరిశోధకులు అధ్యయనం చేశారు. అనంతరం.. ఎలుకలు, పందులపై ప్రయోగాలు చేసి.. వాటి పేగుల్లో ఈ తరహా బాక్టీరియా పెరగడానికి ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుందో పరీక్షించారు. సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు గల పిల్లలపై కూడా ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి ఎదుగుదలను నిశితంగా పర్యవేక్షించారు. పరిశోధకులు అందించిన ఆహారంలో ఒక ఆహారం మిగతా వాటికన్నా చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. అవేంటంటే.. అరటిపళ్లు, సోయా, వెరుసెనగలు, సెనగలు.. ఇవి ఎముకల ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి, రోగనిరోధకశక్తి పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడే సూక్ష్మజీవుల పెరుగుదలను ఈ ఆహారం పెంచినట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ ప్రజలకు చౌకగా అందుబాటులో ఉండే, వారు స్వీకరించడానికి అంగీకరించగల పదార్థాలనే ఈ ఆహారంలో వినియోగించారు.
వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ గోర్డన్ సారథ్యంలో ఢాకాలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియల్ డిసీజ్ రీసెర్స్ సిబ్బంది ఈ పరిశోధన జరిగింది. పిల్లల్లో పోషకాహారలోపాన్ని నయం చేయడానికి సూక్ష్మజీవులపై దృష్టి కేంద్రీకరించటం లక్ష్యంగా ఈ అధ్యయనం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అయితే.. బియ్యం తదితర ధాన్యాలు ప్రధానంగా ఉన్న ఇతర ఆహారాల ప్రభావం తక్కువగా కనిపించింది. అంతేకాదు.. అవి పేగులను మరింత దెబ్బతీశాయి కూడా. ఈ ఆహారాలు ఉత్తమంగా ఎందుకు పనిచేశాయనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదట. అయితే.. పిల్లలు బరువు పెరగడం, ఎత్తు పెరగడం వంటి అంశాలపై ఈ ఆహారాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయో? లేదో? తెలుసుకోవడానికి ఇంకా విస్తృత ప్రయోగం కొనసాగుతోంది.