S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/01/2019 - 19:29

అన్నీ జైదీ ముంబైకి చెందిన జర్నలిస్ట్. ఈమె జర్నలిస్ట్ మాత్రమే కాదు రచయిత్రి, కవయిత్రి.. నాటకాలు, వ్యాసాలు, నవలలు.. ఇలా అన్ని రకాల రచనా ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది జైదీ. చాలా పుస్తకాలు కూడా రాశారు. సాహితీ ప్రపంచానికి సుపరిచితురాలైన జైదీ రాసిన వ్యాసానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డుతో పాటు లక్ష డాలర్లను అంటే దాదాపు 70 లక్షల రూపాయలు ‘నైన్ డాట్స్ ప్రైజ్’ కింద ఇటీవల ప్రకటించారు.

06/30/2019 - 22:47

వెలుగు నీడలు.. ఒకదాని వెంటే మరొకటి.. దీపం ఇంటికి వెలుగునిస్తుంది. మరి దాని వెనుక నీడ.. ఇంటికి అందాన్నిస్తుంది. అదెలా.. అని ఆలోచిస్తున్నారా? నీడను వృథాగా పోనివ్వకూడదు.. అనే ఆలోచనతోనే నీడనూ కళాఖండంలా మార్చేసి ఇంటిని అలంకరిస్తున్నారు సృజనకారులు. అవే క్యాండిల్ షాడో ప్రొజెక్టుర్లు.. వీటిలో నూనె దీపాలు, బ్యాటరీలతో పనిచేసే లైట్లు అలాంటివే..

06/28/2019 - 19:35

చిన్ని ప్రశంస..
అభినందనపూర్వకమైన చిరునవ్వు..
కరతాళ ధ్వని..

06/27/2019 - 22:30

నేటికాలంలో ఇంటివద్ద పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, కిట్టీ పార్టీలు వంటి సందర్భాలు ప్రతి ఇంట్లోనూ తరుచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు అలంకరణ కూడా కాస్త భిన్నంగా ఉంటేనే బాగుంటుంది. వేడుకలప్పుడే కాదు.. మామూలుగా కూడా గదుల్లో.. ముఖ్యంగా హాల్లో ఫర్నిచర్, గోడలకున్న రంగులే కాదు.. పరదాలు కూడా కళను తీసుకొస్తాయి.

,
06/27/2019 - 03:29

కన్నతండ్రి ఇక లేడని తెలిసినా గుండె దిటవు చేసుకుని దేశం కోసం ఆడింది పంతొమ్మిది సంవత్సరాల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టులో సభ్యురాలు. గత ఆదివారం ఈ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్ సిరీస్‌లో ఆతిథ్య జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు..

06/26/2019 - 21:49

కంటి చుట్టూ చాలామందికి నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎన్ని రకాల సౌందర్య చికిత్సలు చేయించినా ప్రయోజనం ఉండడం లేదు అనుకుంటూ ఉంటారు. చాలామంది నిపుణులు కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదనే చెబుతుంటారు. అయితే వీటిని అదుపులో ఉంచుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే తగ్గించుకోవడం సులువవుతుంది.

06/24/2019 - 22:33

భారత సైనిక విభాగంలో ఓ యువ మెడికల్ ఆఫీసర్ కల్పనా కుందు.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైన, అతి ప్రమాదకరమైన వాతావరణంలో తన బృందంతో కలిపి సేవలు అందించి అరుదైన సాహసం చేసింది కెప్టెన్ కల్పన. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న హిమాలయ పర్వతశ్రేణుల్లో విధులు నిర్వహిస్తోన్న భారత సైన్యానికి వైద్యసేవలు అందించి, వారికి గస్తీ నిర్వహించి వార్తల్లో నిలిచింది కల్పన.

06/23/2019 - 22:57

చాలామంది తల్లిదండ్రులు తమ పుత్రరత్నాల చేత బాధించబడటం, వేధించబడటం చూస్తూంటాము, వింటుంటాము. అలాగే తమ కుమార్తెల చేత బాధించబడుతున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కానీ కొడుకులపై పితూరీలు చేసినంత సులభంగా కూతుళ్ళపై చెయ్యలేరు. బాహాటంగా చెప్పుకోలేరు.

06/21/2019 - 19:30

నాసాగ్రే నవ వౌక్తికం అని శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పారు. ముక్కుపుడకను ధరించే సంప్రదాయం హిందూమతంలో అనాదిగా ఉంది. భారతీయ సంస్కృతిలో హిందూ మతం ప్రకారం ఆడవారికి ముక్కు, చెవులు కుట్టడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారంగా ఉంది. అలాగే ఇంకొన్ని వర్గాల తరఫున మగవారు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. మన సంప్రదాయంలో ముక్కుపుడకలకు ప్రత్యేక స్థానం ఉంది.

06/20/2019 - 19:28

ప్రపంచ సంగీత దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్‌లో 1982లో ప్రారంభించబడింది. సృష్టిలో సంగీతం యొక్క స్థానం అద్వితీయమైనది. దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతుంటారు. మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినడం, విషాదం, సమయ సందర్భమేదైనా దానికి గళమిచ్చేది సంగీతం, బలమిచ్చేది సంగీతం. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేము.

Pages