సబ్ ఫీచర్

సంగీత సౌరభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సంగీత దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్‌లో 1982లో ప్రారంభించబడింది. సృష్టిలో సంగీతం యొక్క స్థానం అద్వితీయమైనది. దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతుంటారు. మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినడం, విషాదం, సమయ సందర్భమేదైనా దానికి గళమిచ్చేది సంగీతం, బలమిచ్చేది సంగీతం. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేము. 3శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః2 అన్నారు పెద్దలు. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. చక్కటి సంగీతానికి పశువులు సైతం పరవశిస్తాయి. శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలలూపుతాయట. అంతటి శక్తి సంగీతానికి వుంది కాబట్టే నేటికి సంగీతానికి ఆదరణ తగ్గలేదు. మాటల పుట్టుకకు ముందునుంచే నాదం వుంది. జ్ఞాపశక్తికి సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుంది. వయోవృద్ధులు సైతం పాటలకు వెంటనే స్పందిస్తారు మరియు పరశించిపోతారు. 3అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానం2 అని శంకరశాస్ర్తీ చేత అనిపించారు వేటూరివారు. అద్వైత సిద్ధి, అమరత్వ సిద్ధి దేవుడెరుగు కానీ ఆరోగ్యసిద్ధికి మాత్రం తథ్యమని నిపుణులు చెబుతారు. నిజానికి భారతీయ సంగీతానికి మూలం వేదాలు. సామవేదం భారతీయ సంగీతానికి మూలం.
సంగీతంలో రీతులు
భారతీయ సంగీతం అనేక సంప్రదాయ రీతుల్లో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్తానీ సంగీత సంప్రదాయాలు చెప్పబడుచున్నవి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జానపద సంగీతం పట్టుకొమ్మగా చెబుతారు. నేటి కర్ణాటక సంగీతానికి స్వర, రాగ, తాళములే ఆధారములని, ప్రాచీన గ్రంథాలైన 3శిలప్పాదికారం2 మరియు భరతుని 3నాట్యశాస్తమ్రు2 వివరించుచున్నది. వాస్తవంగా భారతదేశం సంగీతదేశం. మన దేశంలో సంగీతం వేదాల కాలంనుండి తరువాత రాజుల కాలంలోనూ ఉన్నది. ఎందుకంటే ఆబాలగోపాలాన్ని ఆనందసాగరంలో ముంచెత్తుతుంది సంగీతం. పాటకు పరవశించనివారుండరు. ప్రకృతి సైతం సంగీతానికి స్పందిస్తుందని పెద్దలు చెబుతారు. భాషకు అతీతమైంది సంగీతం. రామాయణ, భారతాల్లో కూడా శాస్ర్తియ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. 3యాజ్ఞవల్క్యస్మృతి2లో చెప్పబడినట్లు తాళ కృతి పరిజ్ఞానము కల్గిన వీణావాదకులు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతారు. (వీణావాదన తత్వజ్ఞః శృత జాతి విశారదః తాలజ్ఞ ప్రియానేన మోక్షమార్గం నియచ్చతా).
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి వుంది, మేఘాలు వర్షిస్తాయి. ఆవులు పాలిస్తాయి. చెట్లు పుష్పిస్తాయి. సంగీతానికి ఉన్న శక్తి గురించి సామవేదం చెబుతుంది. ధ్వనితరంగాలు నాడీ వ్యవస్థమీద ఎలా పనిచేస్తుందో స్వరశాస్త్రం వివరిస్తుంది. స్వరాలూ, శ్లోకాలూ, రాగాలూ, మంత్రాలూ మనస్సుమీదే కాక శరీరంమీద పనిచేస్తాయి అని సంగీత శాస్త్రం చెబుతుంది.
సంగీతం ప్రభావం
సంగీత ప్రభావంలో హిందూస్తానీ వాగ్గేయకారులు తాన్‌సేన్ మేఘమాల లహరి రాగంలో వర్షాలు కూడా రప్పించాడని చెబుతారు. సంగీత సరస్వతిని ఆరాధించి జీవన్ముక్తి సాధించవచ్చునని మన వాగ్గేయకారులు, నాదజ్ఞానులు చెబుతారు. త్యాగయ్య, రామదాసు, చైతన్యుడు మొదలైన సంకీర్తనాచార్యులు సంగీతం ద్వారా భగవంతునిలో తాదాత్మ్యం చెంది ముక్తి సాధించవచ్చునని ప్రబోధించారు. రాతియుగం నుంచి కంప్యూటర్ యుగందాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతోంది. ఆధునికకాలంలో వాద్య సంగీతం, లలిత సంగీతం కూడా మామూలు మనుషుల గుండెలకు చేరువైపోయింది. పాటనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది కోయిలమ్మ. సంగీతమే సర్వస్వంగా జీవించినవారిలో అలనాటి అన్నమయ్య, త్యాగరాజులను సంగీత విద్వాంసులు, కళాకారులు ఎన్నటికీ మరిచిపోరు. ఘంటసాలకు ప్రపంచ స్థాయిలోనే పేరు రావడానికి కారణం సంగీతమే. ఆయనేకాక పెండ్యాల నాగేశ్వరరావు, సాళువ రాజేశ్వరావు, ఇళయరాజా వారిది సినీ సామ్రాజ్యంలో సంగీతంలో అందెవేసిన చెయ్యి. ఆహ్లాదకరమైన సంగీతం వింటూ కాసేపు సేదదీరితే మనసు తేలికపడుతుంది. మనసుకు తగిలిన గాయాలకు స్వాంతన కల్గించే శక్తి సంగీతానికే వుంది. సంగీతానికి స్పందించని మనిషి ఉండడు. మనుషులే కాదు లోకంలో సంగీతానికి స్పందించని జీవులే ఉండవు. కర్ణోపేయమైన సంగీతాన్ని ఆలపించినా, ఆలకించినా కలిగే లాభాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీనులవిందైన స్వరఝరిని కొన్ని నిమిషాలే ఆలకించినా మెదడుపై ఆ ప్రభావం చాలాకాలం ఉంటుంది.
సంగీతంలో ఉత్సాహం
ఎవరికైనా అమ్మ పాడే జోలపాటలతో సంగీతంతో పరిచయం మొదలవుతుంది. వయసు పెరిగేకొద్దీ అనేక పాటలు చెవినబడుతూ వుంటాయి. సంగీతం ఉత్సాహానికే ఊపిరిస్తుంది. శ్రమైక జీవనానికి, సౌందర్యం ఇచ్చేది సంగీతమే. పనితో పాటే పుట్టిన పాట జానపదుల నోట దిద్దుకున్న సొబగు చెప్పడానికి వీల్లేదు. 3ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు, సొలుపేమున్నది2 అంటారు. అంటే అలసట తెలియని జీవామృతం సంగీతం. శ్రావ్యమైన సంగీతం వింటూ పనిచేస్తుంటే కొందరికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది.
కర్ణాటక సంగీతం విశ్వ సంగీతానికి మూలం. ఆధారసూత్రం. కర్ణాటక అనే పదానికి అసలైన అర్థం చెవికి ఇంపైనది అని అట. ఎందుకంటే సంగీతానికి రాగం ప్రధానం. చతుష్షష్టి కళలలో సంగీతం ఒకటి. బాధలను మరిపించే మందు సంగీతం. జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం సంగీతం. ఆ పరమశివుడిని సైతం పరశింపజేసి ప్రచండ తాండవం చేయించగల శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే వుంది. బహుశా మరే దేశపు సంగీతానికి లేని ప్రత్యేకత మనకు వున్న రాగవల్లరి (రాగం, స్వరాల సమూహం). ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎస్.జానకి, త్యాగరాజు, ద్వారం అనంత వెంకటస్వామి, నేదునూరి కృష్ణమూర్తి, పురందరదాసు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ముత్తుస్వామి దీక్షితులు- వీరంతా సంగీత సామ్రాజ్యంలో దిట్టలు. ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్.డి. బర్మన్, ఆశాభోంస్లే లాంటి వారు ఎందరో సంగీతానికి దర్శకత్వం వహించారు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ సంగీతం చిరస్థాయిగా ఉంటుంది.
దీపక్ రాగంలో తాన్‌సేన్ పాడితే శరీరంలోని వేడి పుట్టి అక్బర్ రాణిగారికి ప్రాణాలు నిలబడినాయట. దీక్షితులవారు నవగ్రహ ధ్వనులను స్వరపరిచి వినిపించినపుడు ఒక వ్యక్తి కడుపుమంట ఉపశమనం పొందినదట. దీక్షితులవారు కరవు ప్రాంతంలో పర్యటిస్తున్నపుడు అమృతవర్షిణి రాగం ఆలపించటంతో వర్షం కురిసిందట. అనేక జబ్బుల నివారణకు మ్యూజిక్ ఆఫ్ థెరపీ అనేక రకాలుగా ఉపయోగపడుతుందట.
సంగీత పరికరాల వల్ల కూడా ఎంతో ఉపయోగముందట. సరస్వతి చేతిలోని వీణ, నారదుని చేతిలో తంబూర, మృదంగం మరియు గురునానక్ చేతిలో చిరుతలు ఆయా పరికరాలకు సంగీతం, స్వరం కలిసి ఒక్కొక్కరికి ఒక్కోరకమైన శక్తిని ఇచ్చాయి. సంగీతంలో కావాల్సినవారికి శక్తి, రక్తి, భక్తి దొరుకుతుంది. హంసధ్వని, చక్రవాకం, భైరవరాగం, గరుడధ్వని రాగాలే ఇందుకు నిదర్శనాలు. సంగీత రాజ్యంలో వీణ, సన్నాయి, మృదంగం, డోలు, డప్పు, వయొలిన్, హార్మోనియం, వేణువు వంటివి అనేకం ఉన్నాయి.

- కె. రామ్మోహన్‌రావు 94414 35912