S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/21/2019 - 18:41

యోగా ఉపయోగాలపై గల విశ్వాసంతో చాలామంది వారి శరీర భాగాలను బలోపేతం, బిగువుగా చేసుకోవడానికి చాలా కృషి చేస్తుంటారు. పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరాన్ని తగినవిధంగా మలచుకోవడం సాధ్యం. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో, ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే బిగువైన, నాజూకైన, అందమైన చేతులు పొందవచ్చు. మరి ఎలాంటి యోగాసనాలను వేస్తే బిగువైన, అందమైన చేతులు సొంతమవుతాయో చూద్దాం..

08/20/2019 - 18:47

ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు నేటితరం పిల్లలు ఎటువంటి శారీరిక శ్రమ చేయడం లేదు. ఉదయం బడికి వెళ్లేటప్పుడు నడవకుండా ఏదో ఒక వాహనంలో వెళ్లడం, సాయంకాలం మళ్లీ వాహనంలోనే ఇంటికి రావడంతో నడిచే పరిస్థితి లేదు. అలాగే వచ్చీరాగానే టీవీ, కంప్యూటర్, ఫోన్ ఆటలతో బిజీ.. ఇదీ నేటి పిల్లల దైనందిన జీవితం. ఇక వారి శరీరానికి వ్యాయామమెక్కడిది? ఆరుబయట ఆటలు ఆడుకునే ప్రస్తావన ఏది?

08/19/2019 - 18:46

కొందరి ఇళ్లు ఉండడానికి చిన్నవే కానీ చూసేందుకు చాలా పెద్దగా కనిపిస్తాయి. అలాగే మన ఇల్లు కూడా చిన్నదే అయితే పెద్దగా కనిపించడానికి ఇంటీరియర్ విషయంలో జాగ్రత్తపడితే సరిపోతుంది అంటున్నారు డిజైనర్లు. చిన్న గది అనగానే లైట్ కలర్ వాడితే సరిపోతుంది అనుకుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే.. ఆ గదిని మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి కలర్‌ను ఎంపిక చేసుకోవాలి.

08/16/2019 - 18:44

యోగా ప్రక్రియలో కాయకల్ప యోగ అత్యంత ప్రశంసనీయమైనది. నాడి, జీవక్రియలను మెరుగు పరచటంతో బాటు శరీరానికి యవ్వనాన్ని తెచ్చిపెట్టటం దీని ప్రత్యేకత. ఇది శారీరక పుష్టితో బాటు ఆధ్యాత్మక సిద్ధినీ అందిస్తుంది. ఈ యోగాన్ని మొదట గురువు పర్యవేక్షణలోనే చేయాలి. కాయకల్ప యోగా పలు విధానాల సమ్మేళనం. ముక్కుతో గాలి పీల్చి, నెమ్మదిగా నోటితో వదలటం, భస్తిక అంటే..

08/15/2019 - 22:35

నగలంటే ఇష్టపడని స్ర్తిలు ఎవరూ ఉండరు. పండుగలన్నా, శుభకార్యాలన్నా ముందు స్ర్తిల చూపు నగలపైనే. ఎవరు ఎలాంటి నగలు పెట్టుకుని వచ్చారు అని చూస్తుంటారు. దాదాపుగా అందరు స్ర్తిలు ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు అందర్లోకి భిన్నంగా కనిపించాలని, కొత్తగా కనిపించాలని అనుకుంటూ తయారవుతారు. వారు ధరించే నగలను అందరూ చూడాలని, తమ దగ్గర ఉన్న నగలు ఎవరి దగ్గరా ఉండకూడదనే భావన కూడా చాలామంది దగ్గర ఉంటుంది.

08/14/2019 - 18:55

సాంప్రదాయం కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేసింది. తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, సోదరులు.. ఇలా అందరి మధ్యా ఆప్యాయత, అనురాగాలు పెనవేసుకుని ఉంటాయి. మానవ సమాజాన్ని దిశానిర్దేశం చేసేది ధర్మం. వేదాలు మనిషి మనుగడకు మార్గనిర్దేశం చేశాయి. వాటిని తూచా తప్పకుండా ఆచరించడమే మనిషి కర్తవ్యం. కుటుంబ బాధ్యత ఈ ధర్మాల్లో ఒకటి. తల్లిదండ్రులతో పాటు సోదరిని చూసుకోవాల్సిన బాధ్యత అన్నపై ఉంటుంది.

08/13/2019 - 18:37

వయసేదైనా సరే.. రోజూ కాసేపు ఏదైనా ఆట ఆడితే ఆరోగ్యంగా ఉండొచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ఇష్టమైన ఆటను దినచర్యలో భాగంగా చేసుకుంటే శారీరకంగానే కాదు మానసికంగానూ బలంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆటలతో వృత్తిగత సామర్థ్యం మెరుగుపడటమే గాక గెలుపోటములను ఒకేలా స్వీకరించే సానుకూల దృక్పథం అలవడుతుందని వారు సూచిస్తున్నారు.

08/12/2019 - 18:32

సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. దీనిని నాక్టర్నల్ ఎన్యురెసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. తక్కువ గది ఉష్ణోగ్రతలు, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

08/11/2019 - 19:16

పండుగరోజుల్లో రవ్వంత బంగారం అయినా కొనుక్కోవాలనుకుంటారు మహిళలు. బంగారం కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం డబ్బు నష్టపోవడం ఖాయం అంటూ కొన్ని సలహాలను ఇస్తున్నారు నిపుణులు.

08/09/2019 - 18:42

మన దేశంలో తల్లిపాలు అందక ప్రతిఏటా లక్షా ఇరవై వేలమంది నవజాత శిశువులు మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే ఆ తల్లి తన బిడ్డకు ‘ముర్రుపాలు’ పట్టడం ఎంతో అవసరం. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు మొదలెట్టాలి. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలను ఒకరకంగా తొలి టీకా అనుకోవచ్చు. తల్లి యొక్క మొదటి పాలు బిడ్డకు జీర్ణవ్యవస్థకు సిద్ధం చేస్తాయి.

Pages