S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/03/2018 - 00:21

ఓ నిశీధి వేళలో...
జ్ఞాపకాల తీరాన
ఆశా నిరాశల పడగ నీడలో
కొట్టుమిట్టాడే సమయాన...
మనో క్రీడాంగణంపై
గత స్మృతుల దొంతరలు
దాగుడుమూతలాడసాగాయ!
ఇంకేముంది? మనసు...
ఎంచక్కా బ్రతుకు పుస్తకంలోని
ఒక్కో పేజీ తిరగేస్తూ...
కొమ్మకొమ్మపై
వాలిన పిట్టలు కాసేపటికే
ఎగిరిపోయనట్లు...
సమస్యలు సైతం
చుట్టాల వోలె పరామర్శించి

09/03/2018 - 00:17

చివురు వెచ్చని వెనె్నల
నవమి గడచి
మెత్త తెలిరేకు నొత్తిన
మెలపులోన
తగులమెంతయు సాగెడు
తావి బఱపి
సన్న సంపంగి నవ్వెను
చాటు నుండి...

నీలి కాసార గగనంపు
నీళులందు
చుక్కలను బోలు కల్వల
లెక్కలేదు
విచ్చుకొన్నవి తారకల్
విభ్రమమున
పుడమికిన్ స్వర్గమునకొక్క
ముడి రచించి...

09/02/2018 - 23:58

ఎందుకు లేరు!
ఇప్పటికీ వున్నారు
మానవత్వం కోసం
మరణాన్ని లెక్కచేయనివాళ్లు
మరణంతో కొత్త ఆవరణకు
తెరతీసే మహాభి భాసితులు
ఎందుకు లేరు!

నిన్నటి ఆర్తిమూర్తులు
గోడలపై ఫ్రేముల్లో ఇముడరు
వారి కీర్తి ఉజ్జ్వలోజ్వలం!
స్ఫూర్తిని కిరణాలుగా గుచ్చుకొని
వారి అడుగుజాడల్లో
చరిత్ర కొత్తదారులు తియ్యక తప్పదు

09/02/2018 - 23:45

అగాథ బాధలపై సెర్చ్‌లైట్
================

జ్ఞాపకాల్లో ఇంద్రవెల్లి
(వ్యాసాలు, కవితలు, రిపోర్టు)
సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, ఎస్.సుధాకర్
పుటలు: 9+94, వెల: రూ.50లు;
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

08/26/2018 - 22:18

దయగల గోడ దగ్గర
దయాదాక్షిణ్యాలు
కొత్త ఊపిరిలోసుకుంటున్నాయ
మానవతా చివరి శ్వాస మీద
సమతా చివుళ్ళు మొలిపిస్తూ
తీరిన ఓ అవసరం
మరో అవసరంగా గోడ గుండెలమీద
రూపునే కాదు చూపునూ మార్చుకుంటుంది

08/26/2018 - 22:16

‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య పరిచయం’గా మందలపర్తి కిషోర్ రాసిన ‘పెరటిచెట్టు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 30న విశాఖపట్నంలో జరగనుంది. క్రీ.శ. పదో శతాబ్దానికి చెందిన మల్లియ రేచన మొదలుకుని, పందొమ్మిదో శతాబ్దం చివర్లో జన్మించిన సురవరం ప్రతాపరెడ్డి వరకూ 80మంది సాహితీవేత్తల పరిచయ విశే్లషణలు ఈ పుస్తకంలో ఉన్నాయ. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగే ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ప్రముఖ కవి ప్రొ.

08/20/2018 - 19:37

కాలం మళ్లీ కొత్తద్దంలో తనను చూసుకోబోతున్నవేళ
నిదుర లేచిన పిట్ట గొంతు విప్పి చిలికిన
తొలి కువకువలాంటి వాక్యానివి

మూడవఝాము రాతిరి మీద
మిగలపండిన ‘మాల్కౌన్స్’లా
మురిపాల వానలు గుమ్మరించి
నిలువెల్లా థిల్లానాలు పూయంచిన వాక్యానివి

08/20/2018 - 19:40

నేనెప్పుడూ అడవిని చూళ్లేదు
మా యంటి చెట్టు ద్వారానే దర్శించాను
గోడల మధ్య పుట్టి
గోడల మధ్యే పెరిగి
గోడలే లోకం అనుకునే నాకు
అరణ్యం ఒక ప్రాకృతిక మాన్యం

అడవిలో మన దారుల్ని
మనమే తీసుకోవాలి
చెట్టుకొమ్మల్లోంచి ఆకాశం
కాస్త కాస్త రాలి పడుతుంది

08/12/2018 - 23:24

‘తూర్పు పడమరల కలయక అసంభవం’ - ఒకనాటి మాట
తూర్పుకిటువైపు
పడమటకటువైపు
వేలాది మైళ్ల దూరాన్ని
కలిపిన ఒకే వాన
ఒకే కాలాన
సమాంతరంగా
మబ్బుల కుండలన్నీ ఢీకొని
ఉరిమి మెరిసి
పగిలి వర్షించి
ప్రాక్ పశ్చిమాకాశాలన్నీ
జలధారలతో
నేలమీది కాలాన్ని
నిర్నిద్ర సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌ను
భూగోళ కొసలతో
వాణిజ్య వ్యాపార సూత్రాలన్నీ

Pages